వరంగల్‌లో ఏసీబీ ప్రత్యేక కోర్టు 

ACB Special Court in Warangal - Sakshi

ప్రారంభించిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే 

వరంగల్‌ లీగల్‌: వరంగల్‌లో ఏసీబీ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టును శనివారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో సంతోషపడటమే కాకుండా సమగ్రంగా సద్వినియోగం చేసుకునే విధంగా న్యాయవాదులు తర్ఫీదు పొందాలని అన్నారు.

ఏసీబీ కోర్టుతోపాటు హనుమకొండ జిల్లాకు సబ్‌ కోర్టు, ఉభయ జిల్లాలకు ఈ– సేవా కేంద్రం, రాష్ట్రంలోనే తొలిసారి పాత రికార్డులను భద్రపర్చడం కోసం డిజిటైజేషన్‌ కేంద్రాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఇక్కడ ప్రారంభించారు.

ఆయా కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ టి.వినోద్‌కుమార్, ఉభయ జిల్లాల పరిపాలన న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ ఎన్‌.రాజేశ్వర్‌రావు, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె.రాధాదేవి, ఎం.కృష్ణమూర్తి, బార్‌ అసోసియేషన్‌ల అధ్యక్షులు ఆనంద్‌మోహన్, శ్యాంసుందర్‌రెడ్డి, సభ్యులు జయాకర్, జనార్ధన్, డాక్టర్‌ యాకస్వామి, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top