కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్‌ | Ranjith Reddy And Danam Nagender Joined Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్‌

Mar 17 2024 1:31 PM | Updated on Mar 17 2024 3:44 PM

Ranjith Reddy And Danam Nagender Joined Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్సీ సమక్షంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ను దానం నాగేందర్‌కు కాంగ్రెస్‌ ఖరారు చేసింది.

కాగా, బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేయడమే టార్గెట్‌గా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. బీఆర్‌ఎస్‌కి  చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ గుడ్ బై చెప్పారు. ఇటీవల రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, యాదయ్య  కలిశారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పట్నం సునీతా రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్‌ యోచిస్తున్నట్లు సమాచారం


 

Advertisement
 
Advertisement
Advertisement