● 21.5 అడుగులకు చేరిన నీటి మట్టం
ధారూరు: మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టుకు క్రమంగా నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండటంతో గురువారం నాటికి 21.5 అడుగుల మేర నీరు చేరింది. కాలువలు సరిగ్గా లేక గత ఏడాది జూలై నెలలో చుక్కనీరు రాలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాల్వలకు నీరు వదలకపోవడంతో ప్రాజెక్టులో 18 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. మరో 2.5 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండనుంది. ఆధునీకరణ పనులు పూర్తయితే తప్ప రబీ పంటలకు నీరు అందే అవకాశం లేదు. పనుల్లో వేగం పెంచి సాగుకు నీరందించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.


