షాద్‌నగర్: ఉమ్మడి జిల్లా సీ్త్రనిధి బోర్డు ఆఫ్ డైరెక్టర్‌గా ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లికి చెందిన అరుంధతి ఎన్నికయ్యారు. మండల సమాఖ్య అధ్యక్షురాలిగా పని చేస్తున్న ఆమె ఇటీవల నిర్వహించిన బోర్డు ఎన్నికల్లో విజయం సాధించారు. గురువారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్
కుల్కచర్ల: చెంచుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ అన్నారు. గురువారం మండలంలోని సాల్వీడు గ్రామంలో పర్యటించారు. అధికారులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం కింద కాలనీకి రూ.1.72 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని లబ్ధిదారులకు సూచించారు. ఇందుకు అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంతోష, సర్పంచ్ లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ సంధ్యారాణి, పంచాయతీ కార్యదర్శి హర్శద్ తదితరులు పాల్గొన్నారు.
యాలాల: రైతులకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన 43 బస్తాల నకిలీ డీఏపీని అధికారులు పట్టుకున్నారు. గురువారం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండల వ్యవసాయ అఽధికారి శ్వేతరాణి తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్‌లో నకిలీ డీఏపీ రైతులకు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో వ్యవసాయ శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన రాచూరి ఆశన్న, శంకిరి బిచ్చప్ప ఇంట్లో నిల్వ ఉన్న 43 నకిలీ డీఏపీ బ్యాగులను గుర్తించారు. వీటిని పెద్దేముల్ మండలానికి చెందిన పోల రాజు అనే వ్యక్తి విక్రయించినట్లు గుర్తించామన్నారు. నకిలీ డీఏపీ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఇలా విక్రయించే వారి విషయంలో వ్యవసాయ శాఖ, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
కుల్కచర్ల: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. గురువారం కుల్కచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు నష్టపోకుండా చూడాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజిలయ్య, ఉప సర్పంచ్ విజయకుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మాలె కృష్ణయ్య, రైతుబంధు మాజీ అధ్యక్షుడు రాజు, పీఏసీఎస్ మాజీ డైరక్టర్ కొండయ్య, నాయకులు మహేశ్వరం రాములు, జనార్దన్ రెడ్డి, మొగులయ్య, బిచ్చయ్య, సత్యయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


