మానవ అక్రమ రవాణా నేరం | - | Sakshi
Sakshi News home page

మానవ అక్రమ రవాణా నేరం

Jul 31 2026 7:22 AM | Updated on Jul 31 2026 7:22 AM

అనంతగిరి: మానవ అక్రమ రవాణాను అరికడదామని, ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి కాంతారావు అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం వికారాబాద్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా అనేది సమాజానికి తీవ్రమైన ముప్పన్నారు. అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. మానవ అక్రమ రవాణా వల్ల మహిళలు, చిన్నారులు ఎదుర్కొనే ప్రమాదాలు, బాధితులకు అందుబాటులో ఉన్న రక్షణ, పునరావాస సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అనంతరం అవగాహన వాల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ విక్రమ్‌ సింహారెడ్డి, డీఎల్‌ఎస్‌ ఏ వెంకటేశం, కార్యక్రమ ఇంచార్జి సీఐ అన్వర్‌ పాషా , సీడీపీఓ శ్రీలత, మెప్మా కోఆర్డినేటర్‌ వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి కాంతారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement