నియోజకవర్గంలో సర్ ప్రక్రియ ఇలా..
తాండూరు నియోజకవర్గంలో యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, కోట్‌పల్లి(సగం) తాండూరు మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో 90 శాతానికి పైగా ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. తాండూరు మున్సిపాలిటీలో మాత్రం భారీగా తగ్గింది. ఇక్కడ 70 పోలింగ్ కేంద్రాలు.. 73,959 మంది ఓటర్లు ఉన్నారు. సర్ ప్రక్రియలో 50,991 మంది మాత్రమే ఫారాలు ఇచ్చారు. 22,968 మంది ఎన్యూమరేషన్‌కు దూరంగా ఉన్నారు. సొంత గ్రామాల్లో నమోదు చేసుకోవడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతున్నట్లు ఆయా రాజకీయ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
తాండూరు: నియోజకవర్గంలో భారీగా ఓట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది. సర్ గడువు సమీపిస్తున్నా వేలాది మంది ఎన్యూమరేషన్‌కు దూరంగా ఉన్నారు. ఓటరు జాబితా నుంచి సుమారు 36,676 మంది పేర్లు తొలగనున్నట్ల సమాచారం. ఇవి డబుల్ ఓట్లా.. లేకుంటే వలస ఓటర్లా, మరణించిన వారా అనేది తేలాల్సి ఉంది. తాండూరు మున్సిపల్ పరిధిలో 36 వార్డుల్లో సర్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. నియోజకవర్గంలో 269 పోలింగ్ బూత్‌లు.. 2,52,235 మంది ఓటర్ల కోసం బీఎల్‌ఓలు ఎన్యూమరేషన్ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి వరకు 2,15,559 మంది ఫారాలను పూర్తి చేసి బీఎల్‌ఓలకు అందజేశారు. ఇందులో 1,82,804 మంది ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. మరో 36,676 మంది ఎన్యూమరేషన్‌కు దూరంగా ఉన్నారు. 33 పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం ఎన్యూమరేషన్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
ఎన్యూమరేషన్‌కు దూరంగా వేలాది మంది ఓటర్లు
తాండూరు మున్సిపాలిటీలో భారీగా తగ్గనున్న ఓట్లు
33 పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి
మండలం పోలింగ్ బూత్ ఓటర్లు డిజిటలైజేషన్ పెండింగ్ శాతం
పెద్దేముల్ 46 41326 38,304 3,022 92.69
కోట్‌పల్లి 8 6,315 5,817 498 92.11
తాండూరు (మం) 50 46,983 41,197 5786 87.68
తాండూరు అర్బన్ 70 73,959 50,991 22,968 68.94
యాలాల 48 42,331 39,272 3.059 92.77
బషీరాబాద్ 47 41,321 39,978 1,343 96.75
మొత్తం 269 2,52,235 2,15,559 36,676 85.46


