బతుకుల్లో కారు చీకటి | - | Sakshi
Sakshi News home page

బతుకుల్లో కారు చీకటి

Aug 25 2026 2:03 AM | Updated on Aug 25 2026 2:03 AM

గుడ్లు సరఫరాలో నిర్లక్ష్యంప్రభుత్వ బడులకు గుడ్లు సరఫరాలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. గుడ్డు బదులు వేరే కూర పెడుతున్నారు. –8లో వామ్మో.. వయ్యారిభామ వయ్యారిభామ ఆందోళన కలిగిస్తోంది. పొలాల్లో ఏపుగా పెరుగుతోంది. –8లో

న్యూస్‌రీల్‌

శ్రీకాకుళం
గుడ్లు సరఫరాలో నిర్లక్ష్యంప్రభుత్వ బడులకు గుడ్లు సరఫరాలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. గుడ్డు బదులు వేరే కూర పెడుతున్నారు. –8లో

మంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026

సారవకోట: మండలంలోని కిన్నెరవాడ గ్రామానికి సమీపంలో సోమవారం వంశధార ఎడమ కాలువలోకి కారు దూసుకుపోవడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాలు ప్రకారం.. కేళవలసలో ఉన్న కల్యాణ మండపంలో సోమవారం ఓ వివాహం జరిగింది. ఈ వివాహానికి గోపాలపురం గ్రామానికి చెందిన పీస రాము (46), ఖరగ్‌పూర్‌కు చెందిన రాము మేనల్లుడు మెండ విశాల్‌(30) వచ్చారు. పీస రాము కుమార్తె శృతి పార్వతీపురంలో చదువుతుండడంతో ఆమెను తీసుకురావడానికి గోపాలపు రం గ్రామానికే చెందిన గొటివాడ నాగరాజు కారు లో బయల్దేరారు. కారు కిన్నెరవాడ సమీపంలో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొని అకస్మాత్తుగా వంశధార ఎడమ కాలువలోకి దూసు కుపోయింది. కారు కాలువలోకి వెళ్లిపోవడాన్ని చూసిన అవలింగి గ్రామానికి చెందిన కూర్మాపు వెంకటరమణ వెంటనే స్పందించి కాలువలోకి దూకి అద్దాలు పగుల గొట్టి కారులో ఉన్న డ్రైవర్‌ గొటివాడ నాగరాజును ప్రాణాలతో కాపాడారు. కారులో ఉన్న మరో ఇద్దరిని కాపాడాలని ప్రయత్నించినా.. కారు నీటిలో మునిగి పోవడంతో వారిని కాపాడే అవకాశం లేకుండా పోయింది. దీంతో కిన్నెరవాడ గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరి కారును గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు.

స్థానిక ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ కోటబొమ్మాళి ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు తమ సిబ్బందితో వచ్చి స్థానికుల సాయంతో కాలువలో మునిగి పోయిన కారును గుర్తించి బయటకు తీశారు. కారులో పీస రాము మృతదేహం మాత్రమే లభ్యం కావడంతో మెండ విశాల్‌ మృత దేహం గల్లంతైందని గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. మృతుని భార్య చిలకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు.

పెళ్లింట చావు వార్త..

చనిపోయిన పీస రాము భార్య సోదరి కుమార్తెకే వివా హం జరుగుతోంది. ఆ వివాహానికి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తూ రాము చనిపోయారు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి కుమార్తెకు మృతి చెందిన పీస రాము చిన్నాన్న కావడం, గల్లంతైన విశాల్‌ కూడా బంధువే కావడంతో అంతా కన్నీరుమున్నీరయ్యారు.

మద్యపానమే కారణమా..

డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. డ్రైవర్‌ మద్యం సేందించి వాహనాన్ని నడుపుతున్నాడన్న వాదనలూ వినిపించాయి.

వంశధార ఎడమ కాలువలోకి దూసుకెళ్లిన కారు

ఒకరు మృతి.. మరొకరు గల్లంతు

పెళ్లింట విషాదం

డ్రైవర్‌ మద్యం మత్తే ప్రమాదానికి కారణమంటున్న ప్రత్యక్ష సాక్షులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement