ఒకటి కాదు రెండు కాదు రూ.62.50 లక్షలు ఖర్చు పెట్టారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా హాజరై అట్టహాసంగా రోడ్డును ప్రారంభించారు. అక్కడకు సరిగ్గా ఐదు నెలలు గడిచి ఆరో నెల వచ్చాక రోడ్డు అసలు రంగు బయటపడింది. ఎక్కడికక్కడ బీటలు వారిపోయి కట్టిన వారి నైపుణ్యాన్ని బట్ట బయలు చేసింది. అరసవల్లి ఆదిత్య క్షేత్రానికి సమీపంలో ఉన్న రోడ్డు స్థితి ఇది. రథసప్తమి సందర్భంగా కూట మి పెద్దలే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి పనులు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ రోడ్లు ఇలా కనిపిస్తున్నాయి. ఆదిత్యాలయానికి సమీపంలోని ఈ సీసీ రోడ్డు నాణ్యత చూసి స్థానికులు, భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. – అరసవల్లి


