సీసీ రోడ్డు పనుల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

సీసీ రోడ్డు పనుల అడ్డగింత

Aug 26 2026 1:24 AM | Updated on Aug 26 2026 1:24 AM

తమకు చెప్పకుండా పనులు చేశారని టీడీపీ నాయకుల దుశ్చర్య

అధికారుల తీరుపైనా విమర్శల వెల్లువ

కవిటి: మండలంలోని కవిటిరాజపురంకొజ్జిరియా( కేఆర్‌కే) రోడ్డు నుంచి చండీపురానికి వెళ్లే అనుబంధ రోడ్డు నిర్మాణాన్ని రాజపురం పంచాయతీకి చెందిన టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీనిపై చండీపురం గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం తమకు చెప్పకుండా పను లు ప్రారంభిస్తున్నారనే కారణంతో ఈ పనులు అడ్డుకోవడం గమనార్హం. వాస్తవానికి ఈ పనులు దాదాపు 8 నెలల కిందటే జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరి యా విజయ పరిపాలన అనుమతులతో మంజూరయ్యాయి. అప్పట్లో జంగిల్‌ క్లియరెన్స్‌ కోసం రాజపురం–1 ఎంపీటీసీ సనపల కృష్ణారావు రూ. 45 వేలు సాయం కూడా చేశారు. కానీ అప్పట్లో తెలుగు తమ్ముళ్లు అధికార దర్పంతో పనులు జరగనీయలేదు. నెలలు గడుస్తున్నా పనులు కాకపోవడంతో దీని వెనుక కారణాలను ఓ సామాజిక కార్యకర్త వెలికి తీశారు. సమాచార హక్కు చట్టం సాయంతో అన్ని వివరాలు రాబట్టి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వెంటనే ప నులు ప్రారంభించాలని, లేదంటే చర్యలు తప్పవని ఆదేశించారు.

దీంతో పనులకు తీర్మానం, వర్క్‌ ఆర్డర్‌ ప్రక్రి యలు పూర్తి చేసి మంగళవారం పనులు ప్రారంభించారు. కానీ మళ్లీ టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు. తమకు సమాచారం లేకుండా పనులకు కొబ్బరికాయ కొట్టి ఎలా చేస్తారని పనులు ఆపేశారు. దీంతో చండీపురం గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్పీ నిధులను జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ మంజూరు చేస్తే వాటిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. చేతనైతే అభివృద్ధి చేయాలని ఇలా అడ్డుకోవడం సబబు కాదని అన్నారు. దీనిపై అధికారులు నోరు మెదపకపోవడంతో కలెక్టర్‌ ఉన్నతస్థాయి విచారణ జరపాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement