కొనసాగుతున్న కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కష్టాలు

Aug 26 2026 1:24 AM | Updated on Aug 26 2026 1:24 AM

ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి

వ్యవసాయ రంగాన్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. కూలీల సమస్యతో రైతు లు వ్యవసాయాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఏర్పడుతోంది. ఉపాధి పనులను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేస్తే రైతు బాగుపడతాడు.

– సిర్ల ప్రసాద్‌,

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు

హిరమండలం:

వ్యవసాయంతో ఉపాధి అనుసంధానం.. ఏళ్లుగా రైతులను ఊరిస్తున్న కల. కాలం గడుస్తున్నా కల మాత్రం తీరడం లేదు. ఇన్నేళ్లలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు వీబీజీరామ్‌జీగా మారింది. రోజు వారీ కూలి రేటు పెరిగింది. పొలం పనులకు వచ్చే వారి సంఖ్య తగ్గింది. పెట్టుబడి ఇదివరకెన్నడూ లేనంతా పెరిగింది. అయినా సర్కారుకు ఈ అనుసంధానం గుర్తు రావడం లేదు.

పెరుగుతున్న మదుపులు

వ్యవసాయ రంగంలో మదుపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రైతుల కష్టానికి తగిన ఫలితం రావడం లేదు. ఏటా ఎరువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంటలకు రూ.25 వేలు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. ఇంత మొత్తంలో పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసినా కూడా పంటచేతికి వచ్చేంత వరకూ నమ్మకం ఉండదని వాపోతున్నారు. దీనికి తోడు కూలీల రేట్లు పెరుగుపోతున్నాయని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. వీబీజీరామ్‌జీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

వ్యవసాయ రంగాన్ని వేధిస్తున్న కూలీల సమస్య

ఏటా పెరుగుతున్న పెట్టుబడులు

నష్టపోతున్న అన్నదాతలు

ఫలించని వ్యవసాయంతో ఉపాధి అనుసంధానం కల

వెంటాడుతున్న కూలీ సమస్య

వ్యవసాయ రంగంలో రోజురోజుకూ కూలీల సమస్య వేధిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసా యాన్ని (వీబీజీరామ్‌జీ)ఉపాధి హామీకి అనుసంధానం చేస్తే రైతులకు మేలు జరుగుతుంది.

– కె.నవీన్‌, రైతు, తాయమాంబాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement