కిలోల
గంజాయి స్వాధీనం
వజ్రపుకొత్తూరు రూరల్: పర్లాకిమిడి నుంచి తమిళనాడుకు 32.590 కిలోల గంజాయి అక్రమంగా తరలిస్తు న్న కొందరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను డీఎస్పీ భవానీ మంగళవారం మీడి యా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన నిందితులు పెయింటింగ్ ప నులు చేసుకుంటూ ఒకరికొకరు పరిచయమయ్యా రు. సూళ్లురుపేట సమీపంలోని తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో బాలాజీ అనే వ్యక్తి వద్ద చిన్న చిన్న గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసి సే వించేవారు. ఒడిశాలో గల పర్లాకిమిడికి వెళ్లి పినో ష్‌కుమార్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తే ఒక్కొక్కరికి రూ.5 వేలు ఇస్తానని చెప్ప డంతో వారు గంజాయి రవాణాకు సిద్ధమయ్యారు. అక్రమంగా 16 ప్యాకెట్లలో 32.590 కిలోల గంజాయి తరలిస్తుండగా కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడటంతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. కేసులో ఎ–1గా సర్వసన్ ఫళని, ఎ–2గా భూపాలన్, ఎ–3గా మసన్, ఎ–4గా పినోష్‌కుమార్, ఎ–5గా బాలాజీ నమోదయ్యారు.


