స్టోక్స్‌ కెరీర్‌లో ఆణిముత్యాలు | Top 5 Greatest Ben Stokes Performances In International Cricket | Sakshi
Sakshi News home page

స్టోక్స్‌ కెరీర్‌లో ఆణిముత్యాలు

Jun 29 2026 10:55 AM | Updated on Jun 29 2026 11:05 AM

Top 5 Greatest Ben Stokes Performances In International Cricket

ఇంగ్లండ్ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ నిన్న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్ తరఫున దశాబ్దన్నర కాలంపాటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా  చాటిన అతడి కెరీర్‌లో ఎన్నో చారిత్రక క్షణాలు ఉన్నాయి. స్టోక్స్‌ రిటైర్మెంట్ నేపథ్యంలో అతడి కెరీర్‌లో ఆణిముత్యాలపై ఓ లుక్కేద్దాం.

5) వెస్టిండీస్‌పై 2020లో ఆల్‌రౌండ్ షో
వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌లో స్టోక్స్ 176 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. దాదాపు 8 గంటలు క్రీజ్‌లో నిలిచి ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం అందించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 78* (57 బంతుల్లో) వేగంగా ఆడి మ్యాచ్‌ను డిక్లేర్ చేయించాడు. బౌలింగ్‌లో కూడా 3 వికెట్లు తీశాడు. మొత్తం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు.

4) సౌతాఫ్రికాపై 2016లో 258-రన్ భాగస్వామ్యం
కేప్ టౌన్ టెస్ట్‌లో స్టోక్స్ 198 బంతుల్లో 258 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇది టెస్ట్ క్రికెట్‌లో అత్యంత విధ్వంసకర డబుల్ సెంచరీల్లో ఒకటి. ఆ మ్యాచ్‌లో అతడు జానీ బెయర్‌స్టోతో కలిసి 399 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

3) టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్
పాకిస్థాన్‌పై 138 లక్ష్య ఛేదనలో స్టోక్స్ (52* పరుగులతో) ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపాడు. ఆ మ్యాచ్‌లో స్టోక్స్‌ పాటించిన సంయమనం ఇంగ్లండ్‌ను పొట్టి ప్రపంచకప్‌ విజేతగా నిలిపింది.

2) యాషెస్ 2023లో 155 vs ఆస్ట్రేలియా
లార్డ్స్‌లో 371 లక్ష్య ఛేదనలో స్టోక్స్ 155 పరుగుల ఒంటరి పోరాటం చేశాడు. 9 ఫోర్లు, 9 సిక్సులతో ఆస్ట్రేలియా బౌలింగ్ దాడిని ఎదుర్కొన్నా, ఇంగ్లండ్ 43 పరుగుల తేడాతో ఓడింది. కానీ ఆ ఇన్నింగ్స్ స్టోక్స్‌ కెరీర్‌ అత్యుత్తమాల్లో ఒకటిగా నిలిచింది.

1) హెడింగ్లీ 2019 – 135* vs ఆస్ట్రేలియా
ఇది స్టోక్స్ కెరీర్‌లోనే అత్యంత ఐకానిక్ ఇన్నింగ్స్‌గా చెప్పబడుతోంది. ఆ మ్యాచ్‌లో 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 286 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయి ఓటమి అంచుల్లో ఉండింది. అయితే స్టోక్స్‌ జాక్‌ లీచ్‌తో కలిసి ఒంటరిపోరాటం​ (135 నాటౌట్‌;  8 సిక్సులు, 11 ఫోర్లు) చేసి ఇంగ్లండ్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌ టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమైన వాటిలో ఒకటిగా నిలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement