ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తాన్ని (₹27 కోట్లు) వెచ్చించి రిషబ్ పంత్‌ను సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీకి చేదు అనుభవం ఎదురైంది. రెండు సీజన్లలో (2025, 2026) పంత్ ఘోరంగా విఫలం కావడంతో ట్రేడ్ పేరుతో లక్నో అతన్ని వదిలించుకుంది.
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ట్రేడ్‌లో పంత్‌ను వదిలేసిన లక్నో, కుల్దీప్ యాదవ్‌ను అక్కడి నుంచి తెచ్చుకుంది. దీంతో రెండేళ్ల పంత్ ఎల్‌ఎస్‌జీ ప్రయాణం ముగిసింది.
రూ.54 కోట్ల ఒప్పందం.. మొత్తం ఆదాయం రూ.55.88 కోట్లు
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంత్‌ను ఎల్‌ఎస్‌జీ రికార్డు స్థాయిలో ₹27 కోట్లకు కొనుగోలు చేసింది. 2026 సీజన్‌లో కూడా అదే మొత్తాన్ని చెల్లించింది. రెండు సీజన్ల జీతం కలిపి ₹54 కోట్లు కాగా, మ్యాచ్ ఫీజులతో కలిపి అతని మొత్తం ఆదాయం సుమారు ₹55.88 కోట్లకు చేరింది.
రెండేళ్లలో చేసిన పరుగులు ఎన్ని..?
IPL 2025: 269 పరుగులు
IPL 2026: 312 పరుగులు
మొత్తం మ్యాచ్‌లు: 28
మొత్తం పరుగులు: 581
సగటు: 26.41
స్ట్రైక్‌రేట్: 135.74
2 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ
ఒక్కో పరుగుకు రూ.9.62 లక్షలు
పంత్ ఎల్‌ఎస్‌జీ నుంచి అందుకున్న మొత్తం పారితోషికం ₹55.88 కోట్లు. అతను చేసిన మొత్తం పరుగులు 581.
₹55.88 కోట్లు ÷ 581 పరుగులు = రూ.9.62 లక్షలు (సుమారు)
ఈ లెక్కన పంత్ ఎల్‌ఎస్‌జీ తరఫున చేసిన ప్రతి పరుగుకు ఫ్రాంచైజీకి దాదాపు రూ.9.62 లక్షల చెల్లించింది.
కెప్టెన్‌గానూ విఫలం
పంత్ నాయకత్వంలో ఎల్‌ఎస్‌జీ 2025లో ఏడో స్థానంలో నిలవగా, 2026లో చివరి స్థానానికి పడిపోయింది.
మళ్లీ ఢిల్లీ గూటికి
ట్రేడ్ డీల్‌లో భాగంగా పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు. 2016 నుంచి 2024 వరకు ఢిల్లీ తరఫున 111 మ్యాచ్‌లు ఆడిన అతడు, ఆ జట్టు చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు.


