IND vs SL: శ్రీలంక గడ్డపై శతక్కొట్టిన పడిక్కల్‌ | IND vs SL Warm-up Match Day 2 Lunch: Devdutt Padikkal Slams Century | Sakshi
Sakshi News home page

IND vs SL: శ్రీలంక గడ్డపై శతక్కొట్టిన పడిక్కల్‌

Aug 8 2026 2:07 PM | Updated on Aug 8 2026 2:24 PM

IND vs SL Warm-up Match Day 2 Lunch: Devdutt Padikkal Slams Century

శతక్కొట్టిన పడిక్కల్‌ (PC: BCCI X)

శ్రీలంక ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ దేవదత్‌ పడిక్కల్‌ అద్భుత శతకంతో మెరిశాడు. కొలంబోలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా 121 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. 

ఈ సిరీస్‌ సన్నాహకాల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం ప్రాక్టీస్‌ మ్యాచ్‌ మొదలుపెట్టింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. రెండో రోజు ఆట సందర్భంగా 363 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. 

జైసూ డకౌట్‌
అనంతరం భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ డకౌట్‌ కాగా.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 67 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అయితే, కేశారా నువాంత బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు.

అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ మాత్రం సెంచరీతో దుమ్ములేపాడు. 61 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. మరో 60 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. 

ఫోర్‌ బాది సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్‌.. 103 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు ఉన్నాయి. ఇక పడిక్కల్‌ స్థానంలో.. రవీంద్ర జడేజాకు తోడుగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ క్రీజులోకి వచ్చాడు.  

పంత్‌ విఫలం
అయితే, పంత్‌ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. 42 ఓవర్ల ఆట ముగిసేసరికి జడ్డూ 23 పరుగులతో ఉండగా.. ధ్రువ్‌ జురెల్‌ క్రీజులోకి వచ్చాడు.

చదవండి:  మూడేళ్లుగా తిరుగుతున్నా.. సాయం చేయండి సీఎం గారూ: పంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement