హండ్రెడ్ మహిళల కాంపిటేషన్- 2026లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు మూడో విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్‌హామ్ నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది.
సన్‌రైజర్స్ బౌలర్లలో దీప్తీ శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. కాట్ క్రాస్ రెండు, జానెసన్, సదర్లాండ్ తలా వికెట్ సాధించారు. ఫినిక్స్ బ్యాటర్లలో ఎమ్మా లాంబ్(47), కెప్టెన్ పెర్రీ(31) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
లిచ్‌ఫీల్డ్ విధ్వంసం
అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 69 బంతుల్లోనే ఊదిపడేసింది. యువ ఓపెనర్, ఆసీస్ స్టార్ ఫీబీ లిచ్‌ఫీల్డ్ విధ్వంసం సృష్టించింది. బర్మింగ్‌హామ్ బౌలర్లను ఉతికారేసింది. కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం సాధించి అందరిని ఆశ్చర్యపరించింది.
తద్వారా ది హండ్రెడ్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన మహిళా బ్యాటర్‌గా ఆమె రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత ఓపెనర్ షఫాలీ వర్మ పేరిట ఉండేది. 2021లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షఫాలీ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది.
తాజా మ్యాచ్‌లో షఫాలీ ఆల్‌టైమ్ రికార్డును లిచ్‌ఫీల్డ్ బ్రేక్ చేసింది. ఓవరాల్‌గా మ్యాచ్‌లో లిచ్‌ఫీల్డ్ 33 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
చదవండి: 'మూడేళ్లుగా తిరుగుతున్నా.. ప్లీజ్ హెల్ప్ చేయండి


