24 ఏళ్ల త‌ర్వాత బ‌రిలోకి.. ట‌ర్కీకి షాక్ ఇచ్చిన ఆసీస్‌! | Australia Stuns Turkiye Who-Playing-FIFA WC-2026-After-24 Years | Sakshi
Sakshi News home page

24 ఏళ్ల త‌ర్వాత బ‌రిలోకి.. ట‌ర్కీకి షాక్ ఇచ్చిన ఆసీస్‌!

Jun 14 2026 2:59 PM | Updated on Jun 14 2026 3:51 PM

Australia Stuns Turkiye Who-Playing-FIFA WC-2026-After-24 Years

ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. కెనడాలోని వాంకోవర్ వేదికగా జరిగిన గ్రూప్-డి ఆరంభ మ్యాచ్‌లో టర్కీపై 2-0 తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ బరిలోకి దిగిన టర్కీ జట్టుకు ఆస్ట్రేలియా యువ ఆటగాళ్లు గట్టి షాక్ ఇచ్చారు. 

మ్యాచ్ ప్రారంభమైన 27వ నిమిషంలోనే ఆస్ట్రేలియా ఫార్వర్డ్ ఆటగాడు నెస్టోరీ ఇరాన్‌కుందా అద్భుతమైన కౌంటర్ ఎటాకింగ్ గోల్‌తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్‌తో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ చరిత్రలో ఆస్ట్రేలియా తరఫున గోల్ చేసిన అతి పిన్న వయస్కుడిగా ఇరాన్‌కుందా సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఆ తర్వాత టర్కీ ఆటగాళ్లు మ్యాచ్‌ను డ్రా చేయడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆస్ట్రేలియా డిఫెన్స్ దాన్ని తిప్పికొట్టింది. ముఖ్యంగా 75వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ కానర్ మెట్‌కాఫ్ బాక్స్ వెలుపల నుంచి ఒక అద్భుతమైన లో-షాట్‌తో రెండో గోల్ కొట్టి ఆస్ట్రేలియా విజయాన్ని పూర్తిగా ఖాయం చేశాడు. 

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 22 ఏళ్ల యువ గోల్‌కీపర్ పాట్రిక్ బీచ్ అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. టర్కీ జట్టు చేసిన పలు ప్రమాదకరమైన గోల్ ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకుని క్లీన్ షీట్ సాధించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో పరాగ్వేపై 4-1తో గెలిచిన అమెరికా జట్టు అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన వెస్టిండీస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement