పదిహేనేళ్లు మాతోనే ఉంటాడు!.. రెండేళ్లకే వదిలేశారుగా! | 15 saal khelenge: Sanjiv Goenka old Video Viral after LSG trade Rishabh | Sakshi
Sakshi News home page

పదిహేనేళ్లు మాతోనే ఉంటాడు!.. రెండేళ్లకే వదిలేశారుగా

Jun 23 2026 7:17 PM | Updated on Jun 23 2026 7:46 PM

15 saal khelenge: Sanjiv Goenka old Video Viral after LSG trade Rishabh

ఊహాగానాలే నిజమయ్యాయి. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను వదులుకుంది. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌కి ట్రేడ్‌ చేసి బదులుగా.. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంది. కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో భాగంగా లక్నో పంత్‌ కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడ్డ సంగతి తెలిసిందే.

రూ. 27 కోట్లకు సొంతం
ఈ క్రమంలో ఎక్కడా తగ్గకుండా ధరను పెంచుకుంటూ పోయిన లక్నో.. ఏకంగా రూ. 27 కోట్లకు పంత్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా అతడు నిలిచాడు. ఇక పంత్‌ను తమ జట్టు కెప్టెన్‌గా నియమించిన లక్నోకు రెండు సీజన్లలో తీవ్రమైన నిరాశే మిగిలింది.

గతేడాది పంత్‌ కెప్టెన్సీలో పద్నాలుగు ఆరు మ్యాచ్‌లే గెలిచిన లక్నో.. ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. వ్యక్తిగతంగా పంత్‌ 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 269 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

అట్టడుగున పదో స్థానంలో
ఇక ఈ ఏడాది 13 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 312 పరుగులు చేసిన పంత్‌... జట్టును అట్టడుగున పదో స్థానంలో నిలిపాడు. అతడి సారథ్యంలో లక్నో పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో పంత్‌ను రూ. 15 కోట్లకు లక్నో ట్రేడ్‌ చేసింది.

పదిహేనేళ్ల పాటు ఆడతాడు
ఈ నేపథ్యంలో లక్నో జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘పంత్‌ లక్నోకు దాదాపు పదిహేనేళ్ల పాటు ఆడతాడు. ఈ ప్రయాణంలో కనీసం నాలుగు నుంచి ఆరు ఐపీఎల్‌ టైటిళ్లు సాధిస్తాడు. ముంబై, చెన్నై జట్లను విజయవంతమైన జట్లుగా ప్రజలు చూస్తారు.

మహీ (ధోని), రోహిత్‌ శర్మ  ఈ రెండు జట్లను ఉన్నత శిఖరాలకు చేర్చారు. పదేళ్ల తర్వాత మహీ, రోహిత్‌ తర్వాత రిషభ్‌ పేరునే అందరూ చెప్తారు. నా మాటలు రాసిపెట్టుకోండి’’ అంటూ సంజీవ్‌ గోయెంకా పంత్‌ను ఆకాశానికెత్తాడు. అయితే, రెండేళ్లకే అతడిని వేరే జట్టుకు బదిలీ చేయించాడు.

విమర్శలు
ఈ నేపథ్యంలో సంజీవ్‌ గోయెంకాపై మరోసారి ట్రోల్స్‌ వస్తున్నాయి. లక్నో మొట్టమొదటి కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను మైదానంలోనే సంజీవ్‌ తిట్టినట్లుగా ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఆ తర్వాత అతడు జట్టును వీడాడు. ఇక పంత్‌ విషయంలోనూ గోయెంకా ఇలాగే వ్యవహరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పంత్‌ కూడా జట్టును వీడటంతో గోయెంకాపై విమర్శలు ఎక్కువయ్యాయి.

చదవండి: ఎమ్మెల్సీగా తిలక్‌ వర్మ ఫ్రెండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement