బాబూ.. ప్చ్‌.. నాలుగు సీట్లేనా!: విజయసాయిరెడ్డి | Sakshi
Sakshi News home page

బాబూ.. ప్చ్‌.. నాలుగు సీట్లేనా!: విజయసాయిరెడ్డి సెటైర్లు

Published Fri, May 24 2024 9:57 AM

YSRCP MP Vijaya Sai Reddy Satirical Comments On Chandrababu

సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికలకు పోలింగ్‌కు ముగిసింది. ఇక, జూన్‌ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, సర్వేలన్నీ ఏపీలో మళ్లీ వైఎస్సార్‌సీపీనే ఘన విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు.

కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..

‘చంద్రబాబు..!!
పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు
2019 ఎన్నికలలో  వచ్చింది 23 స్థానాలే
ఈసారి మా వాళ్ళను నలుగురిను (కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు
జూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నది
ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ?
ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే  పరిమితం కాబోతున్నావని తెలిసి.. నీ మీద జాలేస్తోంది’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

బాబూ.. ప్ట్.. నాలుగు సీట్లేనా! విజయసాయిరెడ్డి సెటైర్లు
 

 

Advertisement
 
Advertisement
 
Advertisement