నిజంగా విచారణ జరుగుతోందా?: ఎంపీ గురుమూర్తి | Ysrcp Mp Gurumurthy Tweet On Ed Behavior | Sakshi
Sakshi News home page

నిజంగా విచారణ జరుగుతోందా?: ఎంపీ గురుమూర్తి

Oct 7 2026 6:36 PM | Updated on Oct 7 2026 6:47 PM

Ysrcp Mp Gurumurthy Tweet On Ed Behavior

సాక్షి, తాడేపల్లి: ఈడీ వ్యవహార శైలిపై ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. ఈడీ స్వతంత్ర సంస్థానా..? చంద్రబాబు జేబు సంస్థా? అంటూ ట్వీట్ చేశారు. పలు వార్తా సంస్థలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన గురుమూర్తి.. ఈడీ అనేది దర్యాప్తు సంస్థా? చంద్రబాబు  ప్రభుత్వ ‘సిట్‌’కు పొడిగింపుగా మారిందా? అంటూ ప్రశ్నించారు.

‘‘ఈడీ వ్యవహార శైలి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నోటీసులు, దాడులకు సంబంధించిన వివరాలు ముందుగా ఎల్లో మీడియాలో ఎలా వస్తున్నాయి?. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అదే ప్రకారం ఈడీ చర్యలు ఉంటున్నాయి. అక్రమ మద్యం కేసుతో పాటు అనేక చంద్రబాబు ప్రభుత్వ ‘సిట్‌’ రూపొందించిన కథనాన్నే ఈడీ ముందుకు తీసుకెళ్తోంది. వైఎస్సార్‌సీపీ పార్టీయే లక్ష్యంగా  కక్ష సాధింపు చర్యలకు దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తారా?

..ఒక దర్యాప్తు సంస్థ స్వతంత్ర వ్యవస్థలా పని చేయాలి. అలా కుండా రాజకీయ కక్ష సాధింపు కోసమే పని చేస్తే ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతాయి. అసలు ఇక్కడ నిజంగా విచారణ జరుగుతోందా? కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు కొనసాగుతోందా?. దర్యాప్తు సంస్థలపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడాలంటే అవి స్వతంత్రంగా, పారదర్శకంగా పని చేయాలి. విచారణ ప్రక్రియ స్థానంలో రాజకీయంగా తయారైన స్క్రిప్టులు అమలవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడితే.. ముందుగా దెబ్బ తినేది ఆయా సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసమే’’ అంటూ గురుమూర్తి ట్వీట్‌ చేశారు.

ఇదీ  చదవండి: ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ లేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement