పార్టీలో చేరకపోతే పాత కేసులు తిరగేస్తాం! | Pulivendula TDP Struggles to Find Candidates for Wards | Sakshi
Sakshi News home page

పార్టీలో చేరకపోతే పాత కేసులు తిరగేస్తాం!

Oct 7 2026 11:11 AM | Updated on Oct 7 2026 11:20 AM

TDP Temptations Pulivendula Municipal Elections

వైఎస్‌ఆర్‌ జిల్లా: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో టీడీపీ పడరానిపాట్లు పడుతోంది. ప్రతి వార్డు నుంచి టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. పార్టీలో చేరాలంటూ సాధారణ స్థాయి నుంచి దినసరి కూలీల వరకూ.. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. పార్టీలో చేరతామంటే ఫ్లెక్సీల ఏర్పాటు దగ్గర నుంచి టపాసుల ఖర్చు వరకు టీడీపీనే భరిస్తుందంటూ లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షల వరకు బేరసారాలు టీడీపీ నేతలు సాగిస్తున్నారు. ఇటీవల ఒక యువకుడిని టీడీపీలో చేరకపోతే పాత కేసులు తిరగతోడుతామంటూ ఒక పోలీస్‌ ఉన్నతాధికారి ద్వారా బెదిరించి పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం ఇచ్చిన నిధులు శూన్యం
పులివెందులలో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పులివెందుల మెడికల్‌ కాలేజీకి మంజూరైన 50 ఎంబీబీఎస్‌ సీట్లను రద్దు చేయడం, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా.. పులివెందులకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు శూన్యమని తెలియడంతో.. అసంతృప్తితో రగిలిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ కౌన్సిల్‌ రద్దయిన తర్వాత గత మూడు నెలలుగా పులివెందుల మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, కనీసం చెత్త సేకరణ వాహనాలకు డీజిల్‌ కూడా పట్టించే పరిస్థితి లేదని తెలుస్తోంది. చెత్త సేకరణ వాహనాలను రిపేర్‌ చేయడానికి కూడా డబ్బులు లేక మూలన పడే స్థాయికి మున్సిపాలిటీ చేరిందని, వీధి దీపాలు, భూగర్భ జలాలు అడుగంటి ప్రజలకు తాగు నీరు ఇచ్చే మోటార్లు కాలిపోతే వాటిని కూడా రిపేర్‌ చేసే పరిస్థితి లేదు.

అధికారంలో లేకున్నా..
మరమ్మతులకు గురైన మోటార్లకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మున్సిపల్‌ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డిలు సొంత నిధులతో పనులు చేయడం జరుగుతోంది. అధికారంలో లేని సమయంలో కూడా పులివెందుల అభివృద్ధికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిలు అండగా నిలిచి దాదాపు రూ.2.50 కోట్ల మేర పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్‌ పనులు పూర్తి చేశారు. పులివెందుల నియోజకవర్గంలో కానీ, పులివెందుల మున్సిపాలిటీలో కానీ వైఎస్‌ కుటుంబం గత 40 ఏళ్లుగా చిత్తశుద్ధితో ప్రజల కోసం పని చేస్తోందని పులివెందుల ప్రాంత ప్రజలకు తెలిసిన విషయమే. అయితే అధికారంలో ఉన్నా పులివెందుల టీడీపీ నాయకులు పులివెందుల మున్సిపాలిటీకి కానీ, నియోజకవర్గానికి కానీ చేసిందేమి లేదు. కానీ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ మీడియాలో షో చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పోలీసులను నమ్ముకున్న టీడీపీ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పోలీసులను నమ్ముకుంది. ఇక్కడ సబ్‌ డివిజనల్‌ అధికారి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా తొత్తుగా వ్యవహరించడమే కాకుండా.. టీడీపీ నాయకుడిగా çపని చేస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో కేవలం ఆ అధికారి అండతో పోలీసులను అడ్డు పెట్టుకుని గట్టెక్కాలని టీడీపీ ప్రయత్నం చేస్తోంది. టీడీపీ నాయకులకు పులివెందుల ప్రజలు తమకు ఓటు వేస్తారనే నమ్మకం ఎంతమాత్రం లేదు. అందుకే ప్రజలను విస్మరించి పోలీసుల ద్వారా ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement