బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరిపై పోసాని సీరియస్‌ కామెంట్స్‌ | Posani Krishna Murali Serious Comments On Chandrababu Naidu And Nara Lokesh - Sakshi
Sakshi News home page

చంద్రబాబు, లోకేశ్‌పై పోసాని సీరియస్‌ కామెంట్స్‌

Aug 29 2023 2:43 PM | Updated on Aug 29 2023 7:07 PM

Posani Krishna Murali Serious Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు అలవాట్లు అన్నీ ఇప్పుడు నారా లోకేశ్‌కు వచ్చాయని ఎద్దేవా చేశారు. 

కాగా, పోసాని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ముఖం మీద చంద్రబాబు చెప్పులు వేయించాడు. ఎన్టీఆర్‌ను చంపేసి ఇప్పుడు దండలు వేయడం సిగ్గుచేటు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబును.. పురంధేశ్వరి ఎందుకు నిలదీయలేదు. పురంధేశ్వరి, ఎన్టీఆర్‌ కొడుకులు తండ్రిని అవమానిస్తే ప్రశ్నించరా?. ఎన్టీఆర్‌ గొప్ప నటుడు ఆయన్ని అవమానించిన వెన్నుపోటుదారుడు చంద్రబాబు. వంగవీటి రంగాను చంపింది కూడా చంద్రబాబే. 

చంద్రబాబు నాయుడు అలవాట్లన్నీ ఇప్పుడు నారా లోకేశ్‌కు వచ్చాయి. లోకేశ్‌ తేడాగా మాట్లాడుతున్నాడు. లోకేశ్‌ అంత నీచంగా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడటం లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పథకాలిస్తాలిస్తుంటే చంద్రబాబు, లోకేశ్‌ బూతులు తిడుతున్నారు. పోలీసులను రౌడీలతో కొట్టించిన నీచుడు చంద్రబాబు. పోలీసులను కొట్టించి సిగ్గులేకుండా చంద్రబాబు, లోకేశ్‌లు పోలీసు సెక్యూరిటీతో తిరుగుతున్నారు. చంద్రబాబు కోసం రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు అడ్డమైన పనులు చేస్తున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర అవినీతిపరుడు. నాపై నరేంద్ర చేసిన ఆరోపణపై బహిరంగ చర్చకు సవాల్‌ చేస్తున్నాను. గుడిలో ప్రమాణం చేయడానికి నరేంద్ర సిద్ధమేనా అని ప్రశ్నించారు. 


ఇది కూడా చదవండి: రేపు రాజమండ్రికి సీఎం జగన్‌.. ఎమ్మెల్యే జ్యోతుల కుమార్తె వివాహానికి హాజరు

Advertisement
 
Advertisement
Advertisement