రాజకీయ మనుగడ కోసమే చంద్రబాబు కొత్త నాటకాలు: మంత్రి మేరుగ | Merugu Nagarjuna Serious Comments Over Chandrababu | Sakshi
Sakshi News home page

రాజకీయ మనుగడ కోసమే చంద్రబాబు కొత్త నాటకాలు: మంత్రి మేరుగ

Dec 22 2023 2:46 PM | Updated on Dec 22 2023 2:46 PM

Merugu Nagarjuna Serious Comments Over Chandrababu - Sakshi

సాక్షి, కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి మేరుగు నాగార్జున. తమ గురించే మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని సీరియస్‌ అయ్యారు. చంద్రబాబు ఓ గజదొంగ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

కాగా, మంత్రి మేరుగు నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు మతిస్థిమితంలేదని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం. ఇతరులు ఆస్తులు కాజేస్తున్నామని మాపై ఆరోపణలు చేశారు. మా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. ఇతరుల ఆస్తుల కోసం వెంపర్లడింది చంద్రబాబు, టీడీపీ నాయకులు. రాజకీయంగా తమ మనుగడ కోసం చంద్రబాబు మాట్లాడుతున్నారు. గుంటూరు, విజయవాడలో ఎన్ని ఆస్తులు అమ్ముకున్నారో రండి మేము చూపిస్తాం. 

ఎన్నికలు వస్తున్నాయని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఓ గజదొంగ. మా మీద దాడులు, అఘాయిత్యాలు చేయించారు. చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయి. దళితులపై అమానుషంగా కేసులు పెట్టారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం వారిపై కేసులు ఎత్తివేశారు. చంద్రబాబుకు అసలు మానవత్వం ఉందా?. చంద్రబాబు కుట్రలు, కుతంత్రలు పన్నుతున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల ఇస్తామంటే కేసులు పెట్టారు. నాడు-నేడు కింద స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ బాగుచేసిన చరిత్ర వైఎస్‌ జగన్‌ది. వైఎస్సార్‌సీపీకి దళితుల సంపూర్ణ మద్దతు ఉంది అని వ్యాఖ్యలు చేశారు. దళితులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంది.

ఇది కూడా చదవండి: బాలయ్య మిస్సింగ్‌.. ‘ఆంధ్రజ్యోతి’పై భగ్గుమన్న ఫ్యాన్స్‌

Advertisement
 
Advertisement
Advertisement