‘మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’ | congress jagga reddy slams brs over social media | Sakshi
Sakshi News home page

‘మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’

Oct 26 2024 1:12 PM | Updated on Oct 26 2024 4:00 PM

congress jagga reddy slams brs over social media

హైదరాబాద్‌, సాక్షి: బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం ముఠాలా తయారైందని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.  అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్, హరీష్ రావులకు పిచ్చిపట్టిందని ఎద్దేవా చేశారు. శనివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

‘‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే కేటీఆర్‌, హరీశ్‌రావు పనిగా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా చర్యలతో కేటీఆర్, హరీశ్‌రావులు తిట్లు తింటుంన్నారు. అమెరికా, సింగపూర్‌ల నుంచి సోషల్ మీడియా నడపడం కాదు. దమ్ముంటే ధైర్యంగా ముందుకు రండి. సమస్యలపై పోరాడితే తప్పులేదు. కానీ వ్యక్తిగత అంశాలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. 

..బీఆర్ఎస్ హాయాంలో ఇద్దరు కలెక్టర్లకు పది సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. తిట్టినా.. తప్పేంటి? నేను తిట్టింది గత ప్రభుత్వంలో ఇప్పుడు కాదు. సీఎం వ్యాఖ్యలు అననివి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఫైటర్స్. బీఆర్ఎస్ నేతలు ఇలానే వ్యవహరిస్తే.. మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement