లఢఖ్‌లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు: అమిత్‌ షా | home minister amit shah says Ladakh Gets 5 New Districts | Sakshi
Sakshi News home page

లఢఖ్‌లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు: అమిత్‌ షా

Aug 26 2024 12:04 PM | Updated on Aug 26 2024 1:19 PM

home minister amit shah says Ladakh Gets 5 New Districts

ఢిల్లీ: లఢఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. కొత్తగా జన్స్కర్, ద్రాస్‌, షామ్‌, నుబ్రా, చాంగ్‌థాంగ్‌లను జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌ ప్రకారం లఢఖ్‌లో అభివృద్ధి, శ్రేయస్సు​ను కేంద్రం అందిస్తుందని తెలిపారు. ఇక.. కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుతాయని ‘ఎక్స్‌’ వేదికగా  పేర్కొన్నారు.

2019లో  పూర్వపు జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలితం ప్రాంతంగా లఢఖ్‌ను సాధారణ కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించిన విషయం తెలిసిదే. దీంతో  లఢఖ్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యక్ష పరిపాలనా కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement