రెండోసారి ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ సింగర్‌! | TV Actor Nakuul Mehta And His Wife Jankee Announce Second Pregnancy, Baby Bump Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Jankee Parekh Pregnancy: రెండోసారి ప్రెగ్నెన్సీ ప్రకటించిన సింగర్‌!

Jun 1 2025 1:51 PM | Updated on Jun 1 2025 3:07 PM

TV Actor Nakuul Mehta and His Wife Jankee announce second pregnancy

ప్రముఖ బాలీవుడ్ సింగర్ జాంకీ పరేఖ్‌ మరోసారి గుడ్‌ న్యూస్ చెప్పింది. బుల్లితెర నటుడు నకుల్ మెహతాను పెళ్లాడిన ముద్దుగుమ్మ రెండోసారి గర్భం ధరించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. కాగా.. ఈ జంటకు ఇప్పటికే ఓ కుమారుడు జన్మించారు. మా రెండో బిడ్డకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ పోస్ట్ చేశారు.

ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న పలువురు బాలీవుడ్ తారలు అభినందనలు చెబుతున్నారు. దియా మీర్జా, అదితి శర్మతో పాటు పలువురు సినీతారలు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేశారు. కాగా.. 13 ఏళ్ల క్రిత జాంకీ  పరేఖ్.. నకుల్ మెహతాను పెళ్లాడింది.

బుల్లితెర నటుడైన నకుల్ మెహతా 'ఇష్క్‌బాజ్', 'బడే అచ్చే లగ్తే హై 2' వంటి ప్రముఖ టీవీ షోలతో ఫేమస్ అయ్యారు. ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన బుల్లితెర నటుల్లో  ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీరియల్స్‌తో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నకుల్ మెహతా నటించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement