కమ్ బ్యాక్ అంటే ఇది.. ఓడిన చోటే గెలిచింది | Samantha Come Back With Maa Inti Banagaram Movie | Sakshi
Sakshi News home page

Samantha: కంటెంట్‌తో కొట్టిన సామ్.. డబుల్ బొనాంజా

Jun 24 2026 12:26 PM | Updated on Jun 24 2026 1:04 PM

Samantha Come Back With Maa Inti Banagaram Movie

సమంత ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్. కానీ పరిస్థితుల కారణంగా కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైపోయింది. మరీ ముఖ్యంగా విడాకుల తర్వాత ఈమెపై విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఈమెనే దీనికి కారణమన్నట్లు చాలామంది నెటిజన్లు విమర్శలు కూడా చేశారు. అలా టాలీవుడ్‌లోనే చాలానే విమర్శలు సమంత.. ఇప్పుడు అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది? సామ్‌కి ఎక్కడ కలిసొచ్చింది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

చెన్నైకి చెందిన సమంత.. 'ఏ మాయ చేశావె'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలో చేసి జెస్సీ పాత్రకు మంచి పేరు రావడంతో సామ్ పేరు హైలైట్ అయిపోయింది. ఈ దెబ్బకు ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అవి హిట్ కావడంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్‌కి చెందిన నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ నాలుగేళ్లకే విడిపోవడంతో సమంతపైనే ఎక్కువగా విమర్శలు వచ్చాయి.

విడాకుల తర్వాత సమంత సినిమాలు చేయడం కూడా తగ్గించేసింది. 2022లో వచ్చిన 'శాకుంతలం' అయితే సమంత కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్ అయింది. తీసింది దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ ప్రమోషన్ల టైంలో తన వ్యాధి గురించి చెప్పడం, కన్నీళ్లు పెట్టుకోవడం లాంటి వీడియోల కారణంగా సమంతనే ఎ‍క్కువ టార్గెట్ అయింది. తర్వాత ఏడాది చేసిన 'ఖుషి' మూవీ పర్లేదనిపించినప్పటికీ పెద్ద సక్సెస్ కాలేదు.

(ఇదీ చదవండి: 'పెద్ది' సక్సెస్ ఈవెంట్.. జాన్వీతో పాటు వాళ్లెక్కడ?)

ఓటీటీలో చేసిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' హిట్ అయినప్పటికీ 'హనీ బన్నీ' సిరీస్ మాత్రం ఘోరాతీ ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇందులో సమంత కష్టపడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీని తర్వాత 'రక్త బ్రహ్మాండ' అనే సిరీస్ మొదలుపెట్టింది గానీ ఇది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో కెరీర్ పరంగా సమంత దాదాపు చివరకొచ్చేసిందని అంతా అనుకున్నారు.

అలాంటి టైంలో సమంత నిర్మాతగా మారి 'శుభం' అనే సినిమా తీసింది. ఇదేం పెద్దగా ఆకట్టుకోలేదు. గతేడాది డిసెంబరులో 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్ రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుంది. వెంటనే 'మా ఇంటి బంగారం' షూటింగ్‌లో దిగిపోయింది. సాధారణంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తెలుగులో పెద్దగా ఆదరణ ఉండదు. దీంతో సామ్ మూవీ ఏముంటుందిలే అని అంతా అనుకున్నారు. దానికి తోడు బిజీగా ఉండే జూన్ మధ్యలో రిలీజ్ పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా 'మా ఇంటి బంగారం'కి స్టడీగా కలెక్షన్స్ వస్తున్నాయి.

సమంత సినిమా ఇప్పటికే రూ.50 కోట్ల మార్క్ దాటేసింది. ఈ వారం కూడా వేరే మూవీస్ ఏం లేవు. కాబట్టి సమంత చిత్రానికి ప్లస్ అవ్వొచ్చు. ఒకవేళ ఇదే జరిగితే రన్ పూర్తయ్యేసరికి రూ.70-80 కోట్ల వరకు వసూళ్లు రావొచ్చు. ఈ మొత్తం వస్తే గనక తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సాధించిన మహిళా ప్రాధాన్య చిత్రం ఇది అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. అంటే సమంత గట్టి కమ్ బ్యాక్ ఇచ్చినట్లే. సామ్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉండటం ఫ్యాన్స్‌కి డబుల్ సర్‌ప్రైజ్.

(ఇదీ చదవండి: డెడ్లీ డాక్టర్‌గా రజనీకాంత్.. చాలా సెన్సిటివ్ స్టోరీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement