'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్.. అధికారిక ప్రకటన | Pawan Kalyan Hari Hara Veera Mallu Movie New Release Date Announced, Poster Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Hari Hara Veera Mallu: ఈసారైనా రిలీజ్ చేస్తారా.. లేదంటే మళ్లీ

Jun 21 2025 7:42 AM | Updated on Jun 21 2025 9:10 AM

Hari Hara Veera Mallu Movie New Release Date

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా ఐదేళ్లుగా పురిటి నొప్పులు పడుతూనే ఉంది. అప్పుడెప్పుడో 2020లో షూటింగ్ మొదలుపెడితే కొన్నాళ్ల క్రితం దాన్ని పూర్తి చేశారు. ఈ మధ్యలో చిత్రీకరణ వాయిదా మీద వాయిదా పడుతూ వచ్చింది. సరే అంతా పూర్తయింది అనుకుంటే ఇప్పుడు రిలీజ్ విషయంలో ఎడతెగని వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఫైనల్‌గా ఇప్పుడు ఓ విడుదల తేదీని ప్రకటించారు.

జూలై 24న మూవీ రిలీజ్ కాబోతుందని ప్రకటించారు. ఈసారి పవన్ కల్యాణ్‌తో పాటు సినిమాలో విలన్‌గా నటించిన బాబీ డియోల్ ఫొటోని కూడా పోస్టర్‌లో ఉంచారు. ఈసారి కూడా రిలీజ్ చేస్తారా లేదంటే వాయిదా వేస్తారా అనే అనుమానం అభిమానుల్లో ఉండనే ఉంది. ఎందుకంటే ఓటీటీ సంస్థతో ఇంకా డిస్కషన్ జరగలేదు.

(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)

లెక్క ప్రకారం ఈ ఏడాది మార్చి 27న మూవీ వస్తుందని తొలుత ప్రకటించారు. షూటింగ్ పూర్తికాకపోవడంతో మే 30కి వాయిదా పడింది. అప్పటికీ పనులు కాకపోవడంతో జూన్ 12న థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కూడా ఈ మేరకు ఒప్పుకొంది. ఈ తేదీ దాటితే మాత్రం డీల్‌లో మాట్లాడుకున్న డబ్బులు కట్ చేస్తారనే టాక్ వినిపించింది. తర్వాత కొన్నిరోజులకు అనుకున్నదే జరిగింది. మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు జూలై 24న రాబోతున్నట్లు ప్రకటించారు.

ఓటీటీ సంస్థ ఈసారి రిలీజ్ విషయంలో ఏం చేస్తుందో చూడాలి? ఒకవేళ చర్చలు సఫలం అయితే సరేసరి. లేదంటే మాత్రం మళ్లీ వాయిదా పడుతుందేమో? ఈ సమస్య కాదన్నట్లు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు బయ్యర్లు దొరకడం లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకే జూన్ 12 నుంచి వాయిదా వేసినట్లు కూడా అప్పట్లో రూమర్స్ వచ్చాయి. మరి ఈసారైనా ఎలాంటి అడ్డంకి లేకుండా 'హరిహర వీరమల్లు' రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: సడన్‌గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement