సడన్‌గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా | Ghatikachalam Movie Released In OTT, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Ghatikachalam OTT: 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది

Jun 21 2025 7:22 AM | Updated on Jun 21 2025 10:50 AM

Ghatikachalam Movie Ott Streaming Now

రీసెంట్ టైంలో కొత్త సినిమాలు ఓటీటీల్లోకి అనుకున్న దానికంటే త్వరగానే వచ్చేస్తున్నాయి. కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలైతే మరీ రెండు మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ ఇలానే ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. 'రాజాసాబ్'  దర్శకుడు మారుతి దీన్ని సమర్పించడం విశేషం. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ప్రస్తుతం అందుబాటులో ఉంది?

(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)

'ఉయ్యాలా జంపాలా', 'బాహుబలి' తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఘటికాచలం'. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని తీసుకుని సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమర్ కామెపల్లి దర్శకత్వం వహించగా.. నిఖిల్‌తో పాటు ప్రభాకర్, ఆర్వికా గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ మూవీ రెండు ఓటీటీల్లోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది.

మే 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు 20 రోజులకే అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ అంశాలు బాగున్నప్పటికీ చిన్న సినిమా కావడంతో జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి ఆసక్తి  ఉన్నవాళ్లు చూస్తారేమో?  ఘటికాచలం విషయానికొస్తే.. తండ్రి కోరిక మేరకు మెడిసన్ చదివే ఓ కుర్రాడికి భయంకరమైన గొంతు వినిపిస్తూ ఉంటుంది. దీంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తాడు. ఇంతకీ అలా చేయడానికి కారణమేంటి? ఆ గొంతు ఎవరిది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)

Advertisement
 
Advertisement
Advertisement