breaking news
Ghatikachalam Movie
-
సడన్‌గా రెండు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా
రీసెంట్ టైంలో కొత్త సినిమాలు ఓటీటీల్లోకి అనుకున్న దానికంటే త్వరగానే వచ్చేస్తున్నాయి. కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలైతే మరీ రెండు మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ ఇలానే ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. 'రాజాసాబ్' దర్శకుడు మారుతి దీన్ని సమర్పించడం విశేషం. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ప్రస్తుతం అందుబాటులో ఉంది?(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)'ఉయ్యాలా జంపాలా', 'బాహుబలి' తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఘటికాచలం'. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని తీసుకుని సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమర్ కామెపల్లి దర్శకత్వం వహించగా.. నిఖిల్‌తో పాటు ప్రభాకర్, ఆర్వికా గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ మూవీ రెండు ఓటీటీల్లోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది.మే 31న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు 20 రోజులకే అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ అంశాలు బాగున్నప్పటికీ చిన్న సినిమా కావడంతో జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు చూస్తారేమో? ఘటికాచలం విషయానికొస్తే.. తండ్రి కోరిక మేరకు మెడిసన్ చదివే ఓ కుర్రాడికి భయంకరమైన గొంతు వినిపిస్తూ ఉంటుంది. దీంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తాడు. ఇంతకీ అలా చేయడానికి కారణమేంటి? ఆ గొంతు ఎవరిది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలోకి వచ్చిన '8 వసంతాలు', 'కుబేర', 'సితారే జమీన్ పర్' సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో ఈ వీకెండ్ బిగ్ స్క్రీన్స్ కళకళలాడటం గ్యారంటీ. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ శుక్రవారం 24 వరకు కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి. వీటిలో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. ఘటికాచలం, హద్దులేదురా, జింఖానా, యుద్ధకాండ, లవ్లీ, గ్రౌండ్ జీరో సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీసు.. ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పుడు చెప్పిన వాటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఉన్నాయి. అలానే ఇతర భాషా చిత్రాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (జూన్ 20)అమెజాన్ ప్రైమ్యుద్ధకాండ ఛాప్టర్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమాలవ్లీ - మలయాళ మూవీఘటికాచలం - తెలుగు మూవీఆహాఅలప్పుజా జింఖానా - తెలుగు మూవీజిన్ ద పెట్ - తమిళ సినిమాసేవ్ నల్ల పసంగ - తమిళ సిరీస్యుగీ - తమిళ సినిమా నెట్ఫ్లిక్స్కె-పాప్ డీమన్ హంటర్స్ - కొరియన్ సినిమాఒలింపో - స్పానిష్ సిరీస్సెమీ సోయిటర్ - ఇంగ్లీష్ సినిమాఏ కింగ్ లైక్ మీ - ఇంగ్లీష్ మూవీగ్రీన్ బోన్స్ - తగలాన్ సినిమాబేబీ ఫార్మ్ సీజన్ 1 - నైజీరియన్ సిరీస్ఏ లాగోస్ లవ్ స్టోరీ - నైజీరియన్ మూవీద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 - హిందీ కామెడీ షో (జూన్ 21)హాట్స్టార్ఫౌండ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్జీ5డిటెక్టివ్ షెర్డిల్ - హిందీ సినిమాగ్రౌండ్ జీరో - హిందీ మూవీప్రిన్స్ అండ్ ఫ్యామిలీ - మలయాళ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్ఫస్ట్ కాపీ - హిందీ సిరీస్లయన్స్ గేట్ ప్లేకబోల్ - ఫ్రెంచ్ సిరీస్ఎలెవన్ - తమిళ మూవీబుక్ మై షోహద్దులేదురా - తెలుగు సినిమా(ఇదీ చదవండి: హిట్3 మేకర్స్‌పై కేసు వేసిన అభిమాని) -
‘ఘటికాచలం’ మూవీ రివ్యూ
నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన చిత్రం ‘ఘటికాచలం’. ఈ చిత్రానికి ఎం.సి.రాజు కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించారు. అమర్ కామెపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పై ప్రముఖ దర్శకుడు మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ నేడు(మే 31) రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కౌశిక్ (నిఖిల్ దేవాదుల) మెడిసన్ స్టూడెంట్.తనకు ఇష్టం లేకపోయినా నాన్న (ప్రభాకర్)కోసం డాక్టర్ కావాలనుకుంటాడు. కనీసం తనకు ఇష్టం అయిన వంట చేయమని తల్లితో చెప్పలేని ఇంట్రోవర్ట్. కాలేజీలో తోటి విద్యార్థిని సంయుక్తని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పడానికి భయపడతాడు. ఇష్టంలేని చదువు ఒకవైపు..ఇష్టమైన విషయాలు చెప్పలేక మరోవైపు మానసికంగా ఇబ్బంది పడతాడు. కొన్నాళ్లకు తనకి మాత్రమే ఓ భీకరమైన వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ అతన్ని కంట్రోల్ చేస్తుంది. చదుకోనివ్వదు.. రెబల్‌గా మార్చేస్తుంది. ఓ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తే.. సైకలాజికల్ ప్రాబ్లమ్ అని చెబుతారు. బాబాలు,మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్తే గాలి సోకిందని చెబుతారు. కౌశిక్‌తో మాట్లాడుతున్న వాయిస్ కొన్నేళ్ల క్రితం చనిపోయిన ఘటికాచలంది అని తెలుస్తుంది. అసలు ఘటికాచలం ఎవరు? కౌశిక్‌కి ఎలా పరిచయం అయ్యాడు? ఇంతకీ కౌశిక్‌కి దెయ్యం పట్టిందా లేదా మెంటల్ ప్రెజర్ తో అలా మారిపోయాడా? చివరకు కౌశిక్ ఆరోగ్యంగా బయటపడ్డాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే..చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలతో ఆకట్టుకున్న నిఖిల్ దేవాదులకి హీరోగా తొలి చిత్రం ఇది. ఫస్ట్ మూవీలోనే బలమైన పాత్ర పోషించాడు. ఈ పాత్ర కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. పాత్ర ఒక్కటే కానీ అందులోనే రెండు మూడు వేరియేషన్స్ ఉంటాయి. అలాంటి పాత్రకి నిఖిల్ పూర్తి న్యాయం చేశాడు. నటుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంటుంది. హీరో తండ్రిగా ప్రభాకర్, తల్లిగా దుర్గాదేవి ఉన్నంతలో బాగానే నటించారు. డాక్టర్‌గా ఆర్వికా గుప్తా తెరపై కనిపించేంది కాసేపే అయినా కథకి కీలకమైన పాత్ర ఆమెది. హీరోయిన్గా సంయుక్త రెడ్డి నటన ఓకే. జోగినాయుడు రెండు మూడు సీన్లలో కనిపించినా.. తన మార్క్ చూపించాడు.మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాకేంతికంగా సినిమా బాగుంది. ప్లేవియో కుకురోలో నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. హారర్ సన్నివేశాలకు ఆయన అందించిన బీజీఎం అదిరిపోయింది. ఎస్ ఎస్ మనోజ్ కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.