బిగ్‌బాస్‌లో అతనొక్కడే నాకు తెలుసు.. ఎందుకంటే?: బాలాదిత్య కామెంట్స్! | Baladitya Comments On Bigg Boss 7 Season Telugu Reality Show | Sakshi
Sakshi News home page

Baladitya: పల్లవి ప్రశాంత్- రతిక గురించి తెలుసు..కానీ: బాలాదిత్య

Oct 31 2023 3:58 PM | Updated on Oct 31 2023 4:17 PM

Baladitya Comments On Bigg Boss 7 Season Telugu Reality Show - Sakshi

టాలీవుడ్ నటుడు బాలాదిత్య గురించి పరిచయం అక్కర్లేదు. చంటిగాడు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గతేడాది బిగ్‌బాస్ సీజన్‌లో పాల్గొన్న బాలా.. గతంలో మా ఊరి పొలిమేర చిత్రంతో ప్రేక్షకులను ‍అలరించారు. ప్రస్తుతం ఈ ఏడాదిలో ఈ సినిమాకు  మా ఊరి పొలిమేర -2 పేరుతో సీక్వెల్ రాబోతోంది. బాలాదిత్య‌తో పాటు స‌త్యం రాజేష్‌, గెట‌ప్ శ్రీను, కామాక్షి భాస్క‌ర్ల‌, అక్ష‌త ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న  ఈ చిత్రం నవంబర్‌ 3న ప్రేక్షకులను అలరించనుంది. గతేడాది బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్య తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుత సీజన్‌లో బిగ్‌బాస్‌ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

బాలాదిత్యా మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నవారిలో అంబటి అర్జున్ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను, అతను జిమ్‌ మేట్స్. అర్జున్‌ బాగా స్మార్ట్‌గా ఆడుతున్నాడు. బిగ్‌బాస్ నాకు చాలా నేర్పించింది. ఈ రియాలిటీ షో అనేది ఓ గేమ్. ఇందులో కొంతమంది ఫేక్‌లానే అనిపిస్తారు. కొందరు జెన్యూన్‌లా కనిపిస్తారు. హౌస్‌లో ఎంత తెలివిగా ఆడుతున్నామనేదే మనకు ముఖ్యం. పల్లవి ప్రశాంత్, రతిక గురించి తెలుసు. హౌస్‌లో మన ఫర్మామెన్స్ మాత్రమే ఆడియన్స్ చూస్తారు. నువ్వు ఎంత లాజిక్‌గా ఆడుతున్నావనేదే ఆడియన్స్ గుర్తిస్తారు. ఐదు వారాలా తర్వాత వచ్చినవారికి కాస్తా అడ్వాంటేజ్ ఉంటుంది. అదే సమయంలో డిస్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. బిగ్‌ బాస్ ఇచ్చిన టాస్క్‌ను మీరు ఎంత బాగా ఆడుతున్నారనేదే ముఖ్యం ' అని చెప్పుకొచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement