మమ్మల్ని బలిపశువులను చేసింది: అక్కినేని అఖిల్‌ | Akhil Akkineni Reacts On Konda Surekha Over Her Comments On His Family, Post Goes Viral | Sakshi
Sakshi News home page

Akhil Akkineni: మమ్మల్ని బలిపశువులను చేసింది

Oct 4 2024 12:29 PM | Updated on Oct 4 2024 12:59 PM

Akhil Akkineni Comments On Konda Surekha

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన  వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే చాలామంది తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రియాక్ట్‌  అయ్యారు. ఈ క్రమంలో  అఖిల్ అక్కినేని  కూడా అమల చేసిన ట్వీట్‌నే షేర్‌ చేశాడు. అయితే, ఈ క్రమంలో తాజాగా ఆయన మరోసారి కొండ సురేఖపై ఘాటుగానే స్పందించారు.

కొండా సురేఖ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. కుటుంబ సభ్యుడిగా, సినీ ఇండస్ట్రీ సభ్యుడిగా నేను మౌనంగా ఉండలేను. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని శిక్షించాలి. ఆమె చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాలని భావించిన ఆమె తన నైతికత, సామాజిక సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకుంది. 

ఆమె వ్యాఖ్యల వల్ల మా కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా బాధపడ్డారు. ఆమె స్వార్థపూరితంగా నడుచుకుంటుంది. రాజకీయ యుద్ధంలో ఆమె తన కంటే చాలా ఉన్నతమైన విలువలు, సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై సిగ్గు లేకుండా ఇలాంటి దాడి చేసి బలిపశువులను చేసింది. మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు చోటు, గౌరవం లేదు. ఎవరూ సహించలేని ఆమె తీరు ఎప్పటికీ  క్షమించబడదు.' అని అఖిల్ అక్కినేని ఘాటుగా స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement