విలన్లతో ప్రేమ గీతం | Actor Rajendra Prasad launches villian song from Police Vaari Hecharika | Sakshi
Sakshi News home page

విలన్లతో ప్రేమ గీతం

Apr 11 2025 12:50 AM | Updated on Apr 11 2025 12:50 AM

Actor Rajendra Prasad launches villian song from Police Vaari Hecharika

సన్నీ అఖిల్, అజయ్‌ ఘోష్, రవి కాలే, గిద్దెష్, ‘శుభలేఖ’ సుధాకర్, షాయాజీ షిండే, హిమజ, జయవాహిని, ‘శంకరాభరణం’ తులసి ముఖ్య తారలుగా నటించిన చిత్రం పోలీస్‌ వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్‌ నిర్మించారు. గజ్వేల్‌ వేణు సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఓ పాటని నటుడు రాజేంద్ర ప్రసాద్‌ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘సాధారణంగా సినిమాల్లో హీరో–హీరోయిన్లు ప్రేమ గీతాలు పాడుకుంటారు.

కానీ, ఈ సినిమాలో విలన్లు ప్రేమ గీతం పాడుకోవడం వైవిధ్యమైన ఆలోచన. ఈ చిత్రం విడుదలైన తర్వాత విలన్లకూ డ్యూయెట్‌లు పెట్టే ట్రెండ్‌ మొదలవుతుందని నా నమ్మకం’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభవాన్నిస్తుంది’’ అని బెల్లి జనార్థన్‌ చెప్పారు. ‘‘మా చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని బాబ్జీ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement