జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): 2025–26కు సంబంధించిన వానాకాలం, యాసంగికి చెందిన సీఎంఆర్ డెలివరీలను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీహాల్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన జిల్లా పౌర సరఫరాల అధికారులు (డీసీఎస్‌ఓలు), జిల్లా మేనేజర్లు (డీఎంలు), ఎఫ్‌సీఐ అధికారులు, ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. మిల్లింగ్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి బియ్యం సరఫరాను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న డెలివరీలను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు, రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ఎప్పటికప్పుడు పురోగతిని పర్యవేక్షిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మహబూబ్‌నగర్ డీఎస్‌ఓ గంప శ్రీనివాస్ పాల్గొన్నారు.


