జడ్చర్ల: రైలు కింద పడి గుర్తుతెలియని యువకుడు (45) మృతిచెందినట్లు రైల్వే ఎస్‌ఐ రాజు తెలిపారు. ఆయన వివరాల మేరకు.. జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు వెళ్తున్న సమయంలో సదరు యువకుడు ఆకస్మికంగా పట్టాలపైకి వెళ్లడంతో ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే అతడు పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురయ్యాడా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, రెడ్ టీషర్ట్ ధరించి ఉన్నాడని.. కుడి చేతిపై ఇంగ్లిష్‌లో పీఓడబ్ల్యూఈఆర్ (పవర్) అక్షరాలతో పాటు స్టార్ గుర్తు పచ్చబొట్టుగా వేసుకున్నాడన్నారు. ఎడమ చేతిపై హిందీలో జానీ అనే పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించామని.. వివరాలు తెలిసిన వారు 87126 58597 నంబర్‌ను సంప్రదించాలని ఎస్‌ఐ సూచించారు.
యాసిడ్ ట్యాంకర్ బోల్తా: తప్పిన ప్రమాదం
కేటీదొడ్డి: ప్రమాదవశాత్తు యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన మండలంలోని నందిన్నె శివారులో రాయిచూర్ ప్రధాన రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కర్నూల్ నుంచి ముంబై వైపు హైడ్రోక్లోరిక్ యాసిడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్ నిద్రమత్తులో కారణంగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుంచి యాసిడ్ లీకై పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు, తహసీల్దార్ కర్ణాకర్ ప్రమాద స్థలానికి చేరుకుని యాసిడ్ పొగతో శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండటంతో వాహనదారులు, స్థానికులను అప్రమత్తం చేశారు. రాయిచూర్ రహదారిపై వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలిపి వేసి వేరే మార్గంలోకి మళ్లించారు. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ట్యాంకర్ కర్నూల్ లోని కెమికల్ కంపెనీకి చెందినదిగా గుర్తించా రు. కర్నూల్ నుంచి మరో ట్యాంకర్‌ను రప్పించి లీకవుతున్న యాసిడ్‌ను అందులోకి మార్చినట్లు అధికారులు పేర్కోన్నారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరుగకుండా ముందస్తుగా ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచామన్నారు.
చికిత్స పొందుతూ
మేస్త్రీ మృతి
రాజాపూర్: మండల కేంద్రంలోని సంతలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు మోటార్‌సైకిల్‌పై వ చ్చిన వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం రాజాపూర్ చోటు చేసు కుంది. వివరాల్లోకి వెళ్తే.. మల్లేపల్లి గ్రామానికి చెందిన బోయ లింగం (45) రోజు మాదిరిగా మేసీ్త్ర పని ముగించుకుని సోమవారం సాయంత్రం సంతలో కూరగాయలు తీసుకుని తన మోటర్‌సైకిల్‌పై యాదయ్యతో కలిసి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వీరి బైక్‌ను హైదరా బాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఓవర్‌టేక్ చేసి వెళ్తుండగా.. డ్రైవర్ సడన్‌బ్రేక్ వేయడంతో మోటార్ సైకిల్‌కు తగిలి లింగం కింద పడిపోయాడు. దీంతో తలకు, భుజానికి తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రుడని స్థానికులు 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకో సం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి తీసుకెళ్లగా.. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.


