కల్వకుర్తి రూరల్: సమస్త మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ పట్టణంలో 91వ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా మంగళవారం రాధాకృష్ణ శాంతి కల్యాణ మహోత్సవం, ఉట్లు కొట్టే కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణ కాలచక్రం, విష్ణు పంచాయతనం, ఆయుత చండీ అతిరుద్ర శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, చిత్రవేదపూర్వక మహాగణపతి మహాసౌర సుదర్శన లకీ్‌ష్మ్‌నారాయణ సహిత శ్రీమద్ భాగవత యాగ మహోత్సవాలు కనులపండుగగా సాగాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహించిన కల్యాణ మహోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం సందర్భంగా పండితులు చేసిన నృత్యం భక్తులను ఆకర్షించింది. హరీశ్వర దాండియా బృందం ఆడిన దాండియాను చూసి భక్తులు తన్మయత్వంలో మునిగితేలారు. 16 రోజులపాటు నిర్వహించిన హోమాలు, కల్యాణ మహోత్సవాల సందర్భంగా తరలివచ్చిన భక్తులకు మూడు పూటల అన్నప్రసాదం పంపిణీ చేశారు. ప్రతినిత్యం 5 వేల మందికి పైగా భక్తులు ఉత్సవాలను తిలకించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తో పాటు పెద్ద సంఖ్యలో ప్రముఖులు విచ్చేసి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ముగింపు కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో నిర్వాహకులు జూలూరు రమేష్ బాబు, బీచని బాలకృష్ణ, కొండూరు గోవర్ధన్, చిగుళ్లపల్లి సతీష్, పోలా సురేందర్, గుబ్బ వెంకటేష్, మాచిపెద్ది రామస్వామి, జూలూరు ప్రకాష్, కల్మిచర్ల గోపాల్, అశోక్, మురళి, జంగయ్య, పెద్దయ్య, వినయ్ రెడ్డి, గణేష్, సురేష్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
ఈ వృద్ధుడు.. మృత్యుంజయుడు


