ఐటీ ఉద్యోగం పోయింది : నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్‌ | techie success story opens mini supermarket in village now earns Rs 50k per day | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగం పోయింది : నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్‌

Jun 26 2026 5:10 PM | Updated on Jun 26 2026 5:36 PM

techie success story opens mini supermarket in village now earns Rs 50k per day

ఉద్యోగం పోయిందని ఏ మాత్రం బెంబేలెత్తిపోలేదు. అస్సలు అధైర్యపడలేదు. నిరాశ అంతకన్నా పడలేదు. మొదట్లో కాస్త కంగారుగా అనిపించాన, వెంటనే తన జీవనం కోసం కొత్త మార్గాలు ఏమున్నాయా అని అన్వేషించాడు. ఆ అన్వేషణ ఫలితమే అతనికి కొండంత ధైర్యాన్నిచ్చింది.  తన సొంత గ్రామంలోనే సూపర్ మార్కెట్ ప్రారంభించాడు.   కేవలం మూడు నెలల్లోనే విజయం సాధించిన శ్రీలంకకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్ఫూర్తిదాయక స్టోరీ ఇది.

శ్రీలంకకు చెందిన సమీత సులక్కన అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లింక్డ్‌ఇన్ (LinkedIn) వేదికగా పంచుకున్న తన విజయగాథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. కంపెనీలో జరిగిన లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నాడు.


ఐటీ ఉద్యోగం నుండి వ్యాపారం వైపు..
సమీత సులక్కన తన విజయ గాథను లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వివరించారు. దీని ప్రకారం ఇటీవల కంపెనీలో జరిగిన భారీ లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు సమిత. మిగిలిన వారిలాగే  భవిష్యత్తుపై  ఒక్కసారిగా అనిశ్చితి ఏర్పడింది.  టెకీలకు ఐటీ రంగంలోనే కెరీర్ ఉంటుందని భావించాడు. పైగా ఐటీ అనేది ప్యాషన్. కానీ, ఆ కష్టకాలంలో అవకాశాలు ఎప్పుడూ మనం అనుకున్న రూపంలోనే రావని చాలా తొందరగానే గ్రహించాడు. అందుకే మరో  టెక్‌ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా,  తన గ్రామంలో ప్రజలకు అవసరమైన సరుకులు అందించే ఒక మినీ సూపర్ మార్కెట్  కూడా లేదని గమనించి, ఒక కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని స్వయంగా ఒక స్టోర్‌ను ప్రారంభించాడు.

సంప్రదాయ వ్యాపారానికి టెక్నాలజీ హంగులు
తాను చదువుకున్న చదువును, టెక్నాలజీ నేపథ్యాన్ని తన వ్యాపారంలో ఉపయోగించాలని సమిత నిర్ణయించుకున్నాడు. సాధారణ కిరాణా దుకాణంలా కాకుండా భిన్నంగా ఆలోచించాడు. కస్టమర్ల సౌకర్యం కోసం 'క్యాష్ ఆన్ డెలివరీ' (COD) సదుపాయంతో కూడిన ఒక సాధారణ ఆన్‌లైన్ ఆర్డరింగ్ విధానాన్ని ఆయనే స్వయంగా డెవలప్ చేసుకున్నాడు. దీనివల్ల కస్టమర్లు ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేసుకునే వీలు కలిగింది. అంతే ఆర్డర్లు భారీగా వచ్చాయి. వ్యాపారం చాలా వేగంగా పుంజుకుంది. కేవలం మూడు నెలల్లోనే రోజువారీ టర్నోవర్ రూ. 50,000 దాటింది. ఈ సూపర్ మార్కెట్‌తో పాటు, తన గ్రామంలో 'ప్యూరిఫైడ్ వాటర్' (శుద్ధి చేసిన తాగునీరు) సరఫరా చేసే మరో వ్యాపారాన్ని కూడా ప్రారంభించాలని సమిత యోచిస్తున్నాడు.

ఇదీ చదవండి: ఇష్టం లేదని చెప్పినా కేతన్‌ వినలేదు : సియా, తల్లి షాకింగ్‌ రియాక్షన్‌

నిరుద్యోగులకు, యువతకు సమిత  సలహా
"ఈ అనుభవం నాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది: మనం మారడానికి, ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉంటే.. మనకు ఎదురయ్యే ఎదురుదెబ్బలే కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఉద్యోగ రంగంలో అనిశ్చితిని ఎదుర్కొంటున్న వారు ఎవరూ అందోళన పడకండి. ప్రణాళిక వేసుకోండి, అవసరమైతే చిన్నగా ప్రారంభించండి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. పరిస్థితులు అన్నీ అనుకూలంగా మారేవరకు వేచి చూస్తే విజయం రాదు. ఇతరులు అడుగు ముందుకు వేయడానికి భయపడు తున్నప్పుడు, మనం మొదటి అడుగు వేస్తేనే విజయం లభిస్తుంది." అంటూ తన లాంటివారికి సూచిస్తున్నారు సమిత.

ఇదీ చదవండి: తండ్రి చివరి కోరిక : వీడియో కాల్‌లోనే పెళ్లి, అంతలోనే..!

నెటిజన్ల ప్రశంసలు
సమిత తీసుకున్న నిర్ణయం, సాధించిన విజయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అద్భుతం, నువ్వు నిజంగా ఒక స్ఫూర్తివి సమిత అని ఒకరంటే,  "గతేడాది నాకూ ఇలాగే ఉద్యోగం పోయింది బ్రదర్. దాంతో నేను నా సొంత క్లాత్ బ్రాండ్ ప్రారంభించాను. నాణ్యత అనేది కేవలం సాఫ్ట్‌వేర్‌కే కాదు, మన చుట్టూ ఉన్న అన్నిటికీ వర్తిస్తుంది. ప్రస్తుతం నేను ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఓనర్‌ని" అంటూ మరో యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ,  సమితను అభినందించారు.

(ఆపరేషన్‌ సింధూర్‌లో అసువులు బాసిన సైనికులు వీరే!)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement