తండ్రి చివరి కోరిక : వీడియో కాల్‌లోనే పెళ్లి, అంతలోనే..! | A Wedding A Video Call And A Fathers Final Goodbye | Sakshi
Sakshi News home page

తండ్రి చివరి కోరిక : వీడియో కాల్‌లోనే పెళ్లి, అంతలోనే..!

Jun 26 2026 3:44 PM | Updated on Jun 26 2026 4:46 PM

A Wedding A Video Call And A Fathers Final Goodbye

ఒకవైపు కన్నకూతురి పెళ్లి కళ్లారా చూడాలన్న కన్నతండ్రి  కోరిక, మరవైపు అనూహ్యంగా తీవ్ర అనారోగ్యం బారిన తండ్రి. చివరికి ఆసుపత్రి బెడ్‌పై నుంచే వీడియో కాల్లో కూతురి పెళ్లి చూసి సంతోషంగా ఆనంద బాష్పాలు రాల్చాడు. కానీ అంతలోనే తీవ్ర విషాదం అలుముకుంది.

బిహార్‌లోని సీతామఢీ జిల్లా సోన్‌బర్సాకు చెందిన లాల్‌బాబు మహతో ఒక ట్రావెల్ కంపెనీలో బస్సు కండక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. తన చిన్న కూతురు నిధి కుమారి వివాహాన్ని ఘనంగా జరిపించాలని ఎన్నో కలలు కన్నారు. ఈ శుభఘడియ కోసం ఏళ్లుగా ఎదురు చూశారు.  అయితే పెళ్లికి సరిగ్గా మూడు రోజుల ముందు ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీనితో ఆయన్ను లక్నోలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. లాల్‌బాబు మహతో చివరి కోరిక తీర్చేందుకు కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన భార్య మీనూ దేవి, కుమారుడు రాజేష్ కలిసి ఆసుపత్రి నుండే వీడియో కాల్‌  ద్వారా నిధి పెళ్లి చూసే  ఏర్పాటు చేశారు.

అలా కూతురి వివాహ వేడుకను ఆసుపత్రి బెడ్‌పై నుండి వీడియో కాల్ ద్వారా వీక్షించారు. ప్రతి ముఖ్యమైన ఘట్టాన్ని హల్దీ వేడుక, పూలదండలు మార్చుకోవడం, ప్రధాన వివాహ ఘట్టం వరకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూసి తన కోరిక నెరవేర్చుకున్నారు.  కొత్త పెళ్లికూతురిగా కుమార్తె అలా అత్తగారింటికి వీడ్కోలు తీసుకున్న మరుక్షణమే ఒక తండ్రి గుండె ఆగిపోయింది. ఆసుపత్రి నుండే వీడియో కాల్ ద్వారా ఆమె కూతురి వీడ్కోలు వేడుక ముగిసి, ఇల్లు వదిలి వెళ్తుండగా ఆ తండ్రి కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. అలాగా చివరి శ్వాస విడిచారు. ఈ ఊహించని పరిణామం కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది కంట కన్నీరు తెప్పించింది. 

(ఆపరేషన్‌ సింధూర్‌లో అసువులు బాసిన సైనికులు వీరే!)

ఒకేరోజు చెల్లి పెళ్లి.. తండ్రి మరణం
లాల్‌బాబు కుమారుడు రాజేష్ కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఒకవైపు చెల్లి వీడ్కోలును, మరోవైపు తండ్రి మరణాన్ని చూడాల్సి వచ్చింది. నిధి సీతామఢీ జిల్లాలోని మోహన్‌పూర్‌కు చెందిన తన భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అత్తగారింటికి బయలుదేరి వెళ్లడం,  మరోవైపు తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఆ అన్న ఆవేదనకు అంతులేకుండా పోయింది. లాల్‌బాబు మహతోకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇదీ చదవండి: కాటేసిన పామును బిస్కెట్‌ డబ్బాలో బంధించి.. వీడియో వైరల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement