కాటేసిన పామును బిస్కెట్‌ డబ్బాలో బంధించి.. వీడియో వైరల్‌ | A woman presence of mind after being bitten by a venomous snake in Odisha | Sakshi
Sakshi News home page

కాటేసిన పామును బిస్కెట్‌ డబ్బాలో బంధించి.. వీడియో వైరల్‌

Jun 26 2026 1:20 PM | Updated on Jun 26 2026 2:53 PM

A woman presence of mind after being bitten by a venomous snake in Odisha

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందిన మణిమ అనే మహిళ చూపిన సమయస్ఫూర్తి, తెగువ నెట్టింట వైరల్‌గా మారింది. ఎందుకంటే భారీ పామును చూస్తేనే అంతదూరం పారిపోతాం. కానీ అంత పెద్ద పాము కాటేసినా కూడా ఏ మాత్రం భయపడలేదు. సరికదా ఆ విష సర్పాన్ని బంధించి మరీ వైద్యుల వద్దకు రావడం అందరినీ ఆశ్చర్యపర్చింది. చికిత్సలో అతి ముఖ్యమైన యాంటీ-వెనమ్‌ను ఇంజక్షన్‌ అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

ఈ సంఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాకు మథిలి బ్లాక్ పరిధిలోని కురుంపాలి గ్రామంలో జరిగింది. మణిమా నాయక్ అనే ఆ మహిళ సాయంత్రం వేళ తన ఇంట్లో ఉండగా, ఒక విషపూరిత పాము ఆమె కాలిపై కాటు వేసింది. సాధారణంగాఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా భయపడతారు, కానీ మణిమా మాత్రం ప్రశాంతంగా ఉండటమేకాదు, అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించింది. ఆ పామును ఒక బిస్కెట్ డబ్బాలో బంధించి మరీ ఆసుపత్రికి చేరింది.

 ఈ సంఘటన తర్వాత, ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అంబులెన్స్‌లో మథిలి సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. రోగి బంధువులు ఆ సజీవ పామును కూడా ఆసుపత్రికి తీసుకురావడం వైద్యులను, సిబ్బందిని ఆశ్చర్యపరిచింది. ఇలా చేయడం వల్ల పాము జాతిని ఖచ్చితంగా గుర్తించి, అవసరమైన యాంటీ-వెనం (విష విరుగుడు మందు) అందించడానికి వీలుగా తాము ఆ పామును తీసుకువచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది  కూడా ఆమె సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని ప్రశంసించారు. వెంటనే వైద్యులు చికిత్స ప్రారంభించారు.

ప్రస్తుతం మణిమా వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త  ఆ ప్రాంతంలో శరవేగంగా వ్యాపించడంతో  తీవ్ర చర్చనీయాంశమైంది. పలువురు మణిమా  సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఆమె చర్య వైద్యులు పామును గుర్తించడంలో సహాయ పడటమే కాకుండా, పాము కాటుకు గురైనప్పుడు ప్రశాంతంగా ఉండి, వెంటనే వైద్య సహాయం పొందడం ఎంత ముఖ్యమో కూడా తెలియ జేశాయి.

ఇదీ చదవండి: ఇష్టం లేదని చెప్పినా కేతన్‌ వినలేదు : సియా, తల్లి షాకింగ్‌ రియాక్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement