కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స భార్య, శిరంతి రాజపక్సను బుధవారం అవినీతి కేసులో అరెస్టు చేశారు. కోటి శ్రీలంక రూపాయల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణపై అవినీతి ఆరోపణల దర్యాప్తు కమిషన్ (సీఐఏబీఓసీ) ఈ చర్య తీసుకుంది. వైద్య చికిత్స అనంతరం రెండు రోజుల క్రితం విదేశాల నుంచి శ్రీలంక తిరిగివచ్చిన ఆమెను అధికారులు కిరులపోనెలోని నివాసంలో అరెస్టు చేశారు.
కొలంబో ప్రధాన మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అక్టోబర్ 13 వరకు కస్టడీకి ఆదేశించింది. బుధవారమే శిరంతి రాజపక్స కేసులో నేషనల్ సేవింగ్స్ బ్యాంకు మాజీ చైర్మన్ ప్రదీప్ కరియవాసం అరెస్ట్ కాగా... మరో కేసులో శ్రీలంక విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి రోహిత బొగొల్లగమ కూడా అరెస్ట్ అయ్యారు. శిరంతి రాజపక్సకు చెందిన ‘సిరిలియా సవియా’ స్వచ్ఛంద సంస్థ కొలంబోలోని లేడీ రిడ్జ్‌వే పిల్లల ఆసుపత్రికి సీటీ స్కానర్ అందించేందుకు ‘‘నేషనల్ సేవింగ్స్ బ్యాంకు’’ నుంచి నిధులు సేకరించి దుర్వినియోగం చేశారని కమిషన్ ఆరోపించింది. దాదాపు రూ. 10 మిలియన్లు (సుమారు 29.3 లక్షలు) సేకరించారు. సరైన నిబంధనలను పాటించకుండానే నేషనల్ సేవింగ్స్ బ్యాంక్ ద్వారా ఆ నిధులను 'సిరిలియ సావియ' ఖాతాకు మళ్లించారనే ఆరోపణలపై నేషనల్ సేవింగ్స్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ ప్రదీప్ కరియావసంను కూడా అరెస్టు చేసి, ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.
ఇదీ చదవండి: పాములు పట్టేవాడు.. పాముకాటుకు బలైపోయాడు!
Sri Lanka’s former first lady Shiranthi Rajapaksa, wife of ex-president Mahinda Rajapaksa, has been arrested over alleged misuse of charity donations meant for a government children's hospital. She has denied wrongdoing. https://t.co/5YRBO9SJ70
— Al Jazeera English (@AJEnglish) October 8, 2026
y"> కాగా మహింద రాజపక్స 2005 నుంచి 2015 వరకు దేశ అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే అవినీతి వ్యతిరేక విధానంలో భాగంగా గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అక్రమాలపై విచారణను వేగవంతం చేశారు . శ్రీలంకలో రాజపక్స కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు మరియు ఆమె కుమారులు నమల్ రాజపక్స, యోషిత రాజపక్స కూడా గతంలో వివిధ అవినీతి కేసులను ఎదుర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అవినీతి ఆరోపణలపై అరెస్టయిన శ్రీలంక చరిత్రలో తొలి మాజీ ప్రథమ మహిళగా శిరాంతి రాజపక్స నిలిచారు.
ఇదీ చదవండి: 5 కాసుల గోల్డ్ చైన్ కొట్టేసింది : యూట్యూబర్ మధుమితపై కేసు
ఇదీ చదవండి: నానా పటేకర్ లాస్ట్ మెసేజ్, చివరి ప్రసంగం: కన్నీళ్లు రాక మానవు!


