Telangana Crime News: సుత్తితో మోదీ.. దుప్పట్లో చుట్టి.. భార్య దారుణ హత్య!
Sakshi News home page

సుత్తితో మోదీ.. దుప్పట్లో చుట్టి.. భార్య దారుణ హత్య!

Sep 16 2023 1:36 AM | Updated on Sep 16 2023 8:58 AM

- - Sakshi

మహబూబాబాద్‌: కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన తండ సత్తయ్య, రంగమ్మ(65) దంపతులకు ముగ్గురు కుమారులు.

కొన్ని సంవత్సరాల క్రితం ఒక కుమారుడు మృతి చెందగా మరో ఇద్దరు బతుకుదెరువుకోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఈక్రమంలో తండ సత్తయ్యకు మతిస్థితిమితం సరిగా లేకపోవడంతో ఏడు సంవత్సరాలుగా వైద్యం అందించారు. మాములు స్థితికి చేరిన సత్తయ్య తాగుడుకు బానిస అయ్యాడు. గురువారం సత్తయ్య మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య రంగమ్మతో గొడవకు దిగి ఇంట్లో ఉన్న సుత్తితో మెడపై మోదీ హతమార్చాడు. ఎవరికి అనుమానం రాకుండా దుప్పట్లో చుట్టి మంచం పక్కన ఉంచాడు.

ఉదయం ఎంతసేపటికీ రంగమ్మ లేవకపోవడంతో చుట్టుపక్కలవారు ఇంట్లోకి వెళ్లి చూసే సరికి రంగమ్మ విఘతజీవిగా పడి ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై రమేష్‌బాబు, సిబ్బంది తొర్రూర్‌ డీఎస్పీ వెంకటేష్‌బాబుకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని రంగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement