rangamma
-
టీడీపీ హనీ ట్రాప్ సీక్రెట్స్ మొత్తం చెప్పేసిన రంగమ్మ
-
టీడీపీ గ్యాంగ్ హనీట్రాప్!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని అవినీతి, అక్రమాలు, మైనింగ్ మాఫియా, ఇతరత్రా దందాలతో టీడీపీ నేతలు సాగిస్తున్న దౌర్జన్యకాండ శ్రుతిమించింది. ఇవన్నీ చాలవన్నట్లు డబ్బున్న వారికి అమ్మాయిలను ఎర వేసి, హనీ ట్రాప్ (వలపు వల)లో ఇరికించి, డబ్బు గుంజి, ఆర్థికంగా దివాలా తీయిస్తోంది. ఈ దందాలో ఏకంగా పలువురు పోలీసు అధికారులను భాగస్వాములుగా చేసుకోవడం దిగ్భ్రాంతి పరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ వెనుక అసలు దోషి తెలుగుదేశం పార్టీ అని తేలింది. హనీట్రాప్ ముఠా లీడర్ రంగమ్మ రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతకు ముఖ్య అనుచరురాలు. రంగమ్మకు అండగా ఉంటూ బాధితులపై దాడి చేసి, వీడియోలు తీసిన మరో కీలక వ్యక్తి రాజేశ్ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ మేయర్ మదమంచి స్వరూపకు కీలక అనుచరుడు. వీరిద్దరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురు టీడీపీ నేతలు అండదండలు అందించడం వల్లే వందలాది మందిని వీరు వలపువలలో ఇరికించి ఆర్థికంగా దివాలా తీయించారని స్పష్టమైంది. ఈ దందాలో రాప్తాడు సీఐ శ్రీహర్షది కీలక పాత్ర. ఈ వలపువల దందాపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. టీడీపీ నేతలు రంగమ్మ, రాజేశ్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఇద్దరు సీఐలను వీఆర్‌కు పంపారు. మరికొందరు పోలీసు అధికారులు, పోలీసులకు కూడా ఈ దందాతో సంబంధం ఉందని తేలింది. వీరిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. రంగమ్మను బుధవారమే అరెస్టు చూపిస్తే, మరో నలుగురిని గురువారం అరెస్టు చేసినట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు విలేకరులకు వెల్లడించారు. ఎవరెవరి పాత్ర ఏంటంటే.. డబ్బున్న వ్యక్తులు, వ్యాపారులు, రియల్టర్లను గుర్తించడం, వారి ఫోన్ నంబర్లు సంపాదించి వారిని హనీ ట్రాప్ చేయడం, ఇంకొందరిని పని ఉన్నట్లు ఏకాంతంగా గదికి పిలిపించేలా చేయడం రంగమ్మ ఆధ్వర్యంలోని అమ్మాయిల బృందం పని. వ్యక్తులు వచ్చిన తర్వాత వారిపై దాడి చేసి, బట్టలు విప్పించి వీడియోలు తీయడం రాజేశ్ పని. వీడియోలు తీసిన తర్వాత వారివద్ద ఉన్న బంగారం దోచుకోవడంతో పాటు స్థాయిని బట్టి ముఠా సభ్యుల నుంచి అప్పు తీసుకున్నట్లు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్రామిసరీ నోట్లు రాయించుకుంటారు. బాధితులతో పాత తేదీలతో బాండ్లు రాయించుకున్న తర్వాత రంగమ్మ సీఐ శ్రీహర్షను కలిసి ఫిర్యాదు చేస్తుంది. శ్రీ హర్ష బాధితులను పిలిపించి ప్రామిసరీ నోట్లో పేర్కొన్న డబ్బును బెదిరించి, పంచాయితీ చేసి ఇప్పిస్తారు. ఇలా ఒక్కరూ ఇద్దరూ కాదు.. వందల మంది బాధితులు ఈ వలపు వలలో చిక్కుకుని ఆర్థికంగా చితికిపోయారు. రూరల్ మండలానికి చెందిన ఓ వ్యక్తి వీరి ఒత్తిడి భరించలేక ఏకంగా ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేయకుండా కన్నీటిని దిగమింగి వేదన పడుతున్నారు. మరో నలుగురు సీఐల పాత్ర!హనీట్రాప్ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నెల 19 నుంచి వరుస కథనాలను ప్రచురించింది. దీంతో వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ జగదీశ్ రూరల్ సీఐ శేఖర్ ఆధ్వర్యంలో సమగ్రంగా విచారణ చేయించారు. ఇందులో రంగమ్మ, రాజేశ్‌తో పాటు మరో ఏడుగురు నిందితులను ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో సీఐలు శ్రీహర్ష, రాజేంద్రనాథ్ యాదవ్‌లను వీఆర్‌కు పంపారు. మరో తొమ్మిది మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై కూడా సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ వ్యవహారంలో మరో నలుగురు సీఐలు, 15 మంది కానిస్టేబుళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం వీఆర్‌కు పంపడం కాకుండా హనీట్రాప్ ముఠా సభ్యుల తరహాలోనే పోలీసులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చార్జిషీట్లో వారి పేర్లు ఎందుకు చేర్చలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి!హనీట్రాప్ వ్యవహారంలో మరికొంత మంది టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. హంపాపురం సమీపంలోని 7 హిల్స్ హోటల్‌ను రంగమ్మ నిర్వహించేది. హనీట్రాప్‌కు సంబంధించిన పంచాయితీలన్నీ ఈ హోటల్లోనే జరిగేవని తెలుస్తోంది. సీఐ శ్రీహర్ష కూడా హోటల్ వద్దకు తరుచూ వచ్చేవారని తెలుస్తోంది. అలాగే ఈ హోటల్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు ధర్మవరం మురళి, పరిటాల మహీంద్ర, బైటీఎన్ ప్రసాద్ కూడా రాప్తాడు సీఐ శ్రీహర్షతో పాటు రెగ్యులర్‌గా కూర్చునే వారని పోలీసు, టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ నేతల ప్రమేయం, ఆదేశాలతోనే సీఐ శ్రీహర్ష హనీట్రాప్ ముఠా పంచాయతీలను చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో మరింత లోతుగా వెళితే పలువురు టీడీపీ నేతల బాగోతం బట్టబయలు అవుతోందని గ్రహించిన టీడీపీ పెద్దలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురై ఈ వ్యవహారాన్ని ఇంతటితోనే ముగించాలని ఆదేశించినట్లు సమాచారం. హోం మంత్రి ఆ మేరకు పోలీసు అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని చిన్నదిగా చూపేందుకు పోలీసులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం.రూ.13 లక్షలు, రెండు కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనంహనీట్రాప్ వ్యవహారంపై డీఎస్పీ శ్రీనివాసులు గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. ‘గార్లదిన్నె వాసి కుంచం ఉదయ్‌భాస్కర్‌రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. ఐదు నెలల కిందట ఉదయభాస్కర్రెడ్డికి మంగలి జయలక్ష్మి ఫోన్ చేసింది. డ్రోన్ ద్వారా వెంచర్‌ను సర్వే చేయాలని భాగ్యనగర్‌కు పిలిచింది. ఇంట్లోకి రాగానే సర్వే కొటేషన్ వివరాలు ఆరా తీస్తుండగా, దబ్బర రాజేష్ అక్కడికి వచ్చి తాను జయలక్ష్మి భర్తను అని, తన భార్యతో ఏం చేస్తున్నావ్ అని ఉదయ్ భాస్కర్‌రెడ్డిపై దాడి చేసి దుస్తులు విప్పించాడు. అంతలో జయలక్ష్మీ కూడా దుస్తులు తీసేసింది. ఇద్దరూ నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీశాడు. ఇంతలో రంగమ్మ అక్కడికి చేరుకుని.. ‘ఎందుకు ఇలా చేశావు. మీ ఊరిలో, మీ కుటుంబంలో ఈ విషయం తెలిస్తే నీ పరువు పోతుంది.. వాళ్లు ఏమైనా చేసుకుని చనిపోతారు.. ఇది బయటకు రాకుండా ఉండాలంటే రూ.4 లక్షలు ఇవ్వు’ అని ఉదయ్‌భాస్కర్‌ను ఆదేశించింది. డబ్బులు ఇవ్వకపోతే కత్తి చూపించి చంపుతామని బెదిరించారు. రూ.4 లక్షలు సమర్పించుకుని వారి నుంచి ఉదయ్ బయటపడ్డాడు’ అని డీఎస్పీ తెలిపారు. దీనిపై బాధితుడు రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీఐ విచారణ చేపట్టారు. ఎస్పీ జగదీష్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందడంతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులను గుర్తించామన్నారు.వీరిలో మామిళ్లపల్లి రంగమ్మ అలియాస్ రంగమ్మనాయుడు అలియాస్ చిన్నీని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. తాజాగా దబ్బర రాజేష్, మంగలి జయలక్ష్మీ, చంద్రకళ, అనంతకుమారిని అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి ఇప్పటి దాకా రూ.13 లక్షల నగదు, రెండు కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నామని చెప్పారు. 20 మందిని హనీట్రాప్‌కు గురిచేసినట్లు ఇప్పటి వరకు తేలిందన్నారు. వారిని బెదిరించి భారీగా వసూళ్లు చేశారన్నారు. రంగమ్మ అలియాస్ చిన్నీపై సుమారు 10 కేసులున్నాయన్నారు. మిగిలిన వారిపై తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పలు కేసులున్నాయని తెలిపారు.పోలీసుల అదుపులో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరుడు హనీట్రాప్ వ్యవహారంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచరుడు, రుద్రంపేట మాజీ సర్పంచ్ నరేంద్రరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. -
అనంత హనీట్రాప్.. రంగమ్మ అరెస్ట్, వీఆర్‌కు సీఐలు..
సాక్షి, రాప్తాడు: అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ‘నయా హనీట్రాప్’ దందాపై పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. సూత్రధారులు, పాత్రధారులతో పాటు వారికి సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఇక, హానీట్రాప్ కేసులో లెడీడాన్ రంగమ్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే, 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, హానీట్రాప్ ముఠా.. మహిళను ఎరగా వేసి అమాయకుల నుంచి రెండు కోట్లు వసూలు చేసింది.జిల్లాలో హానీట్రాప్ వెలుగులోకి తేవడంతో ఈ దందాపై ఎస్పీ జగదీష్ కొరడా ఝళిపించారు. కొందరు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదులు చేయడంతో సమగ్ర విచారణకు ఆదేశించారు. రాప్తాడు సీఐ శ్రీహర్షకు హనీ ముఠా సభ్యులతో సత్సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే బాధితుల ఫిర్యాదులపై కేసు నమోదులో అనంతపురం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీరిద్దరినీ వీఆర్‌కు పంపుతూ బుధవారం డీఐజీ షిమోషీ ఉత్తర్వులు జారీ చేశారు.ఇంకా కొందరు పోలీసులు ముఠా సభ్యులతో సన్నిహితంగా ఉండడంతోపాటు బాధితులను బెదిరించారనే ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. దాదాపు 10 మంది పోలీసులను సస్పెండ్ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ముఠాలీడరుగా వ్యవ హరించిన రంగమ్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఎస్పీపై భరోసాతో బాధితులు పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కుతూ ఫిర్యాదులు చేస్తున్నారు.కవ్వించి.. కాటేస్తారు ముఠా లీడర్లు.. సమాజంలో గౌరవంగా జీవిస్తున్న వ్యక్తుల కుటుంబం, ఆర్థిక స్థితి, సామాజిక ప్రతిష్టలను గమనించి, బలహీనతలను అంచనా వేస్తారు. తర్వాత కొందరి మహిళలను రంగంలోకి దింపి, ఫోన్ కాల్స్, చాట్లతో పరిచయం పెంచి, నమ్మకం కలిగిస్తారు. తర్వాత ఇంటికి పిలుస్తారు. ఏకాంత సమయంలో ముఠా సభ్యులు రంగప్రవేశం చేస్తారు. అప్పటికే బాధితుడిని న్యూడ్‌గా ఉండేలా చేస్తారు. ఆయన ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేస్తారు. అక్కడితో ఆగకుండా కథకు కొత్త మలుపు ఇస్తారు. తర్వాత ‘నీ వీడియోలు సోషల్ మీడియాలో పెడతాం. నీ కుటుంబాన్ని చంపేస్తాం’ అంటూ బెదిరింపులు మొదలవుతాయి. దీంతో బాధి తులు తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఇదే అదనుగా బాధితుడి స్తోమతను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తారు. -
సుత్తితో మోదీ.. దుప్పట్లో చుట్టి.. భార్య దారుణ హత్య!
మహబూబాబాద్: కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన తండ సత్తయ్య, రంగమ్మ(65) దంపతులకు ముగ్గురు కుమారులు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కుమారుడు మృతి చెందగా మరో ఇద్దరు బతుకుదెరువుకోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఈక్రమంలో తండ సత్తయ్యకు మతిస్థితిమితం సరిగా లేకపోవడంతో ఏడు సంవత్సరాలుగా వైద్యం అందించారు. మాములు స్థితికి చేరిన సత్తయ్య తాగుడుకు బానిస అయ్యాడు. గురువారం సత్తయ్య మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య రంగమ్మతో గొడవకు దిగి ఇంట్లో ఉన్న సుత్తితో మెడపై మోదీ హతమార్చాడు. ఎవరికి అనుమానం రాకుండా దుప్పట్లో చుట్టి మంచం పక్కన ఉంచాడు. ఉదయం ఎంతసేపటికీ రంగమ్మ లేవకపోవడంతో చుట్టుపక్కలవారు ఇంట్లోకి వెళ్లి చూసే సరికి రంగమ్మ విఘతజీవిగా పడి ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై రమేష్‌బాబు, సిబ్బంది తొర్రూర్ డీఎస్పీ వెంకటేష్‌బాబుకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని రంగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘అమ్మో’ ఆ విషయం చెప్పను : అనసూయ
సీతంపేట: రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త క్యారెక్టర్లో ఒదిగిపోయి సినీ ప్రేక్షకుల మది దోచుకున్న అనసూయ భరద్వాజ్ శుక్రవారం సాయంత్రం నగరంలో సందడి చేశారు. గురుద్వార కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘మగువ’ బొటిక్‌ను ఆమె ప్రారంభించారు. అక్కడ డిస్ప్లే చేసిన కలెక్షన్ తిలకించిన అనంతరం మాట్లాడుతూ బొటిక్‌లో శారీస్, చుడీదార్స్, హ్యాండ్లూమ్ కలెక్షన్, హ్యాండ్‌బ్యాగ్స్, టాప్స్ అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. హైదరాబాద్ తర్వాత వైజాగ్ తనని బాగా ఎక్సైట్ చేసే ప్రదేశమని, అందుకే విశాఖ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ‘అమ్మో’ చెప్పను ప్రస్తుతం 5సినిమాలతో బాగా బిజీ గా ఉన్నానని అనసూయ చెప్పారు. ఎవరితో నటిస్తున్నారని అడగ్గా అమ్మో... చెప్పనని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇద్దరు ప్రముఖ డైరెక్టర్ల వద్ద సినిమాలు చేశానని, మరో ముగ్గురు దర్శకుల వద్ద సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆ దర్శకుల పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు. నా భర్తే ఫేవరెట్ హీరో ఏ హీరో ఇష్టమని అడగ్గా తన భర్త భరద్వాజ్ ఇష్టమని సమాధానమిచ్చారు అనసూయ. తనకు డ్రీమ్‌రోల్ అంటూ ఏమీ లేదని, రంగమ్మత్తలా మంచి క్యారెక్టర్స్‌తో గుర్తింపు తెచ్చుకోవాలని ఉందన్నారు. హీరోయిన్‌కు తానేమీ తక్కువ కాదని, ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రతి మహిళ హీరోయిన్ అంటూ తెలివిగా సమాధానమిచ్చారు. నా కోసం నిరీక్షిస్తున్న వారిని చూసి వైజాగ్‌లో నాకు చాలా మంది అభిమానులున్నారని ఈ రోజే తెలిసిందని మురిసిపోయారు. రంగమ్మత్తగా గుర్తింపు ఆనందాన్నిచ్చింది రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్‌తో మంచి పేరు వచ్చిందని, ఎక్కడకు వెళ్లినా రంగమ్మత్త అని పిలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అనసూయ. జబర్దస్త్ షోలో ఒకలా, రంగస్థలం సినిమాలో మరొకలా ఉన్నానని, ఇపుడు చాలా మంది తనను ప్రత్యేకంగా చూడటానికి ఆహ్వానిస్తుండటం సంతోషంగా ఉందని తెలిపారు. -
సమంత సిస్టర్.. మీ పాట ఎంతో పాపులర్
-
హత్య కేసు నిందితుడి అరెస్టు
అగళి(మడకశిర): అగళి మండలం ఆర్.జి.పల్లిలో గొల్ల రంగమ్మ(35)ను హత్య చేసిన కేసులో అనుమనపల్లికి చెందిన పూజారి రంగప్పను మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ దేవానంద్ తెలిపారు. అగళి, రొళ్ల ఎస్ఐలు రాంబాబు, నాగన్న, అగళి ఏఎస్ఐ ఖలీల్‌బాషాతో కలసి నిందితుడ్ని మీడియా ఎదుట హాజరుపరిచారు. గొల్ల రంగమ్మను ఈ నెల 16న అత్యంత దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. హత్యకు గల కారణాలను నిందితుడు తమ విచారణలో అంగీకరించాడని సీఐ తెలిపారు. ఆయన కథనం ప్రకా రం... రంగమ్మ భర్త మైసూర్లో గొర్రెల కాపరిగా పనికి కుదిరాడు. వారి కుమారుడు ఉపాధి కోసం బెంగళూరు వెళ్లాడు. ఒంటరిగా ఉంటున్న రంగమ్మ సైతం ఇటుకల తయారీకి వెళ్లేది. ఈ క్రమంలో అనుమనపల్లికి చెందిన పూజారి రంగప్పతో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే కొన్నాళ్ల తరువాత మనసు మార్చుకున్న ఆమె అతన్ని దూరం ఉంచుతూ వచ్చింది. ఇక నుంచి రావొద్దంటూ ఆమె ఈ నెల 16న గట్టిగా చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోయిన రంగప్ప బండరాయితో హత్య చేశాడు. ఆ తరువాత ఇంటిలోని బీరువాలో నుంచి రూ.30 వేల నగదు, చెవి కమ్మలను ఎత్తుకెళ్లాడు. హతురాలి కుమారుడు ఉమేశ్ ఫిర్యాదు మేరకు రంగప్పపై దృష్టి పెట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆ హత్య తానే చేశానంటూ అంగీకరించాడని సీఐ తెలిపారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా, 15 రోజుల పాటు రిమాండ్‌కు జడ్జి ఆదేశించారని వివరించారు. -
ఉసురు తీసిన విద్యుత్
కొలిమిగుండ్ల, న్యూస్‌లైన్ : పని చేస్తున్న చోటే మృత్యువు పొంచి ఉందని, అది ఆమెను కబలిస్తుందని ఎవరికి తెలుసు. ఆ ప్రాంతం మీదుగా మరోచోటుకు వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగిలి తెగిపోవడం, సమీప ధోబీఘాట్‌లో బట్టలుతుకుతున్న ఓ మహిళ వాటికి బలి కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. మృత్యువొడి చేరేందుకేనన్నట్టు ధోబిఘాట్‌లోని మిగతా వారంతా భోజనం చేసి సేద తీరుతుండగా ఆమె మాత్రం అక్కడే ఉండిపోయింది. కాసేపటికే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చాకలి నడిపి నాగన్న భార్య రంగమ్మ (45) కులవృత్తి ద్వారా జీవనం సాగిస్తోంది. రోజులాగే ఆదివారం కూడా బట్టలుతికేందుకు స్థానిక ప్రాథమిక పాఠశాల సమీపంలోని ధోబి ఘాట్‌కు వెళ్లింది. మధ్యాహ్న సమయంలో అందరూ భోజనం చేసి సేదతీరుతుండగా రంగమ్మ అప్పుడే బట్టలుతికేందుకు ధోబీఘాట్లోకి దిగింది. ఇంతలో గ్రామ పొలాల్లో కొనుగోలు చేసిన శనగ పొట్టును జమ్మలమడుగు తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ పాఠశాల సమీపానికి చేరగానే విద్యుత్ తీగలు తగిలి తెగిపడ్డాయి. సరిగ్గా తీగల కిందే ధోబీఘాట్‌లో రంగమ్మ ఉండడంతో క్షణాల్లో ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ప్రమాదం జరిగిన తర్వాత కూడా తీగలకు విద్యుత్ సరఫరా ఉండడంతో స్థానికులు అక్కడికి వెళ్లే సాహసం చేయలేదు. మరోవైపు ట్రాక్టర్లో ఉన్నోళ్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. తర్వాత విద్యుత్ సిబ్బంది సరఫరా నిలిపేయడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్ల ముందే తల్లి రంగమ్మ గిలాగిలా కొట్టుకుంటూ మరణించడాన్ని తట్టుకోలేక ఆమె కూతురు ఆర్తనాదాలు చేసింది. ఎస్ఐ రాజ్‌కుమార్ సిబ్బందితో ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు తప్పిన ముప్పు.. తీగలు తెగిపడిన సమయంలో స్కూల్ బయట విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు అటు వెళ్లకుండా హెచ్ఎం సుంకన్న జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం.. తీగలు కిందుగా వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నా విద్యుత్ సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా ఒక నిండు ప్రాణం బలై పోయిందని గ్రామస్తులు ఆవేదన చెందారు. రజకులందరూ పనిలో ఉన్నా, తరగతుల విరామ సమయంలో ఘటన జరిగి ఉన్నా ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు.


