ఆదిలాబాద్: ఆమె ఒక గ్రామానికి సర్పంచ్. గ్రామంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతూ, ఎందరికో న్యాయం చేసింది. కానీ తన ఇంట్లో జరిగిన చిన్న గొడవకు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకొని తన ఇద్దరు చిన్నారులకు తీవ్ర అన్యాయం చేసింది. ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు క్షణికావేశంలో బోరిగాం గ్రామానికి చెందిన సర్పంచ్ పల్లె జ్యోతి (25) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి జ్యోతి ఆమె భర్త విఠల్‌ల మధ్య పిల్లలను పాఠశాలకు పంపించే విషయమై చిన్నపాటి గొడవ జరిగింది.
మనస్తాపానికి గురైన జ్యోతి అందరూ నిద్రిస్తున్న సమయంలో సోమవారం తెల్లవారుజామున వంట గదిలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచా రం అందించడంతో సీఐ రవీందర్ నాయక్, ఎస్సై షేక్ జుబేర్‌లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జ్యోతి తండ్రి మాదు ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై వెల్లడించారు. ఆమెకు నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారన్న విషయాన్ని మరిచి తల్లి ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


