బెంగళూరులో మహిళపై సామూహిక అత్యాచారం | Three Were Arrested In Woman Assaulting Case In Bengaluru, Check More Details Inside | Sakshi
Sakshi News home page

బెంగళూరులో మహిళపై సామూహిక అత్యాచారం

Feb 21 2025 9:08 PM | Updated on Feb 22 2025 11:40 AM

Three Were Arrested In Woman Assaulting Case Bengaluru

బెంగళూరు: నగరంలో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగు చూసింది.  ఓ హోటల్‌లో 33 ఏళ్ల మహిళపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్యాటరింగ్  సర్వ్ చేసే మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జ్యోతి నివాస్ కాలేజ్ జంక్షన్ వద్ద వెయిట్ చేస్తున్న ఆ మహిళను  ఓ నలుగురు కుర్రాళ్లు ఫాలో అయ్యారు. వారంతా  హోటల్ తీసుకున్నామని, అక్కడకి డిన్నర్ కు భోజనం తీసుకురమ్మని చెప్పారు.  దాంతో ఆమె డిన్నర్‌కు భోజనం తీసుకెళ్లగా వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

డిన్నర్ చేసిన తర్వాత వారంతా ఆమెను లొంగదీసుకున్నట్లు ఆమె ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు.  ఆ హెటల్ టెర్రాస్ పై కి తీసుకెళ్లి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారన్నారు. ఈ   ఉదయం(శుక్రవారం) ఆరు గంటలకు ఆమెను వదిలేశారన్నారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేయటంతో పాటు పోలీసులకు చెప్పడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.

ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులంతా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ హోటల్లో పని చేయడానికి వచ్చిన వారిగా గుర్తించినట్లు సదరు పోలీస్ అధికారి చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement