శివాజీనగర: బెంగళూరులో విలాసవంత హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఆ హోటళ్ల వంటగదులలో గడువు ముగిసిన మాంసం, చేపలు, పాలు, పెరుగు, నాసిరకం ఆహార పదార్థాలు బయటపడ్డాయి. రాయల్ చైన్ హోటల్లో గడువు దాటిన సుమారు 50 కిలోల మాంసాహారం సీజ్ చేశారు. యూబీ సిటీలోని 16వ అంతస్తులో ఉన్న స్ట్రైక్ లాంజ్‌లో కుళ్లిన మాంసం 45 కేజీలు, నూనెల నిల్వలు సీజ్ చేశారు. ఆహార భద్రతా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించే హోటళ్లకు రూ.5 లక్షల జరిమానా విధిస్తామన్నారు.
సెలబ్రిటీలను అనుసరించవద్దు
ఆరోగ్య శాఖ మంత్రి ఖాదర్ మాట్లాడుతూ తాము ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని అన్నారు. ప్రజారోగ్యం, పరిశుభ్రత కోసం దాడులు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని హోటళ్లలో విదేశాల నుంచి నాణ్యత లేని మటన్‌ను తెప్పించినట్లు తెలిసిందన్నారు. సెలబ్రిటీలు తాగే పానీయాలను చూసి పిల్లలు, తల్లిదండ్రులు వాటిని వాడకూడదన్నారు. సెలబ్రిటీలు ఆ పానీయాలను తాగరు, ప్రకటనల కోసమే అలా చేస్తారన్నారు.
స్టార్ హోటళ్లపై దాడుల్లో గుట్టురట్టు


