శివాజీనగర: రాష్ట్ర మంత్రివర్గంలో చిన్న చిన్న మార్పులు, నూతన మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ ఆదివారం రాత్రి ఢిల్లీలో హైకమాండ్ నాయకులతో చర్చలు జరిపారు. దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో సుదీర్ఘంగా చర్చించారు. సోమవారం ఉదయం ఏఐసీసీ నేత వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. మహిళలకు మంత్రి పదవులు కట్టబెట్టడానికి చిన్నపాటి పునర్వ్యవస్థీకరణ చేయాలని అనుకున్నట్లు తెలిసింది. గురువారం నుంచి శాసనసభా వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా, ఆరోజుకల్లా శాఖలను ప్రకటించడం అనివార్యం. అందువల్ల ఆ పనిమీద దృష్టి సారించారు. మంత్రి పదవులు దక్కని అసంతృప్త ఎమ్మెల్యేలను సంతృప్తి పరచడానికి ఏం చేయాలనేది చర్చకు వచ్చింది. మంత్రి పదవులు కోల్పోయిన ఎమ్మెల్యేలకు అవే పీఠాలు దక్కే చాన్సు దాదాపు లేదని, బోర్డుల, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులతో బుజ్జగించాలని భావిస్తున్నారు.
నూతన మంత్రులకు ఈ శాఖలు
కొత్త మంత్రులు బసవరాజ రాయరెడ్డి న్యాయ– అసెంబ్లీ వ్యవహారాలు; ఎస్.ఎస్.మల్లికార్జున– ఉద్యానవన, మైనింగ్; ఎన్.చలువరాయస్వామి– వ్యవసాయం; ఎం.శివలింగేగౌడ– గృహవసతి; లక్ష్మణ సవది– సహకార, చక్కెర; మధు బంగారప్ప– ప్రాథమిక విద్యాశాఖ, జమీర్ అహ్మద్‌ఖాన్– మైనార్టీ, హజ్ శాఖ; కే.ఎన్.బసవంతప్ప– చేనేత, వస్త్ర పరిశ్రమ, వ్యవసాయ మార్కెటింగ్; అజయ్‌సింగ్– చిన్న పరిశ్రమలు; రుద్రప్ప లమాణి– ఎకై ్సజ్, హెచ్.సీ.బాలకృష్ణ– అటవీ, సైన్స్, పర్యావరణం; రిజ్వాన్ హర్షద్– ఉన్నత విద్య, పుట్టరంగశెట్టి– పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ; బి.నాగేంద్ర– మత్స్య, ఓడరేవులు; సంతోష్ ఎస్.లాడ్– కార్మిక శాఖ, శివరాజ్ తంగడగి– బీసీ సంక్షేమం, కన్నడ– సంస్కృతి; టి.రఘుమూర్తి– ఎస్సీ సంక్షేమ శాఖలు ఖరారైనట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాలలోగా శాఖలు: సీఎం
కోలారు: రాబోయే శాసనసభ సమావేశాలలోగా నూతన మంత్రులకు పోర్టుపోలియోల కేటాయింపు జరుగుతుందని, ఢిల్లీలో చర్చలు పూర్తయ్యాయని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. సోమవారం మాలూరు తాలూకాలో సాధన సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత మరో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తామని తెలిపారు. బిడది టౌన్‌షిప్ వద్దంటూ ప్రతిపక్షాలు చేస్తున్న పాదయాత్ర రాజకీయ లబ్ధి కోసమే తప్ప రైతులపై ప్రేమతో కాదని అన్నారు. పాదయాత్రలో రైతులు ఎవరూ లేరని, పక్క నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను పిలిపించి పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. టౌన్‌షిప్‌ను గతంలో వారి ప్రభుత్వమే ప్రారంభించి మధ్యలో వదిలేస్తే, దానినే తాము కొనసాగిస్తున్నామమని, ఇదేమీ కొత్త పథకం కాదని అన్నారు.
శాఖల కేటాయింపు ఓ కొలిక్కి!
కేసులు లేనివారెవరు?
● మంత్రి నాగేంద్రకు సీఎం డీకే అండ
శివాజీనగర: వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ నిధుల స్వాహా కేసులో నిందితునిగా ఉన్న బి.నాగేంద్రకు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ ఆరోపణలు చేస్తుండగా, కేసులు లేనివారెవరు? అని సీఎం డీకే శివకుమార్ అన్నారు. సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన, దేశంలో కేసులు లేనివారున్నారా?, బెయిల్ పొంది మంత్రులుగా కొనసాగడం లేదా? అని ప్రశ్నించారు. హెచ్.డీ.కుమారస్వామికి బెయిల్ రాలేదా అన్నారు. నాగేంద్ర కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కర్ణాటకను విడిచి వెళ్లాడనేది తన దృష్టికి రాలేదన్నారు. పరిషత్ సభాపతి బసవరాజ్ హొరట్టి స్వయంగా తన వద్దకు వచ్చి రాజీనామా చేస్తానని చెప్పారని, సగౌరవంగా రాజీనామాను ఆమోదించామని తెలిపారు. ఆయన తప్పుకోకపోతే తామే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేవాళ్లమని తెలిపారు. మంత్రి యూ.టీ.ఖాదర్, తాను గవర్నర్‌ను కలసి పూర్తి వివరణ ఇచ్చామన్నారు. బీజేపీ తమ పార్టీలోని సీనియర్ నాయకులను వేధిస్తోందని హైకమాండ్, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
కేబినెట్‌లో చిన్నపాటి మార్పులు
సీఎం ఢిల్లీ చర్చల్లో నిర్ణయం
పాత మంత్రులకు మార్పులు
పాత మంత్రుల్లో ఒకరిద్దరి శాఖలు మారినా మారవచ్చు. ముగ్గురు మంత్రులు సాంఘిక సంక్షేమ శాఖను కోరుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి యూ.టీ.ఖాదర్, పట్టణాభివృద్ధి మంత్రి యతీంద్ర సిద్దరామయ్యల శాఖల్ని పరస్పరం మారుస్తారని తెలిసింది. యతీంద్ర ఆరోగ్యశాఖను కోరినట్లు తెలిసింది.
14న స్పీకర్ ఎన్నిక
బనశంకరి: విధానసభ స్పీకర్ ఎన్నిక ఈ నెల 14వ తేదీ జరుగుతుందని లోక్‌భవన్ నుంచి ప్రకటన వెలువడింది. అసెంబ్లీ సమావేశాలు 13 నుంచి ప్రారంభమవుతాయి. మరుసటి రోజు ఎన్నిక జరుగుతుంది. అంతవకు సీనియర్ ఎమ్మెల్యే టీబీ.జయచంద్ర ప్రొటెం స్పీకర్‌గా ఉంటారు. స్పీకర్‌గా రోణ ఎమ్మెల్యే జీఎస్.పాటిల్, డిప్యూటీ స్పీకర్‌గా ఏఎస్.పొన్నణ్ణ ఖరారయ్యారు.


