చిక్కబళ్లాపురం: ఆషాఢ మాసం చివరి సోమవారం కావడంతో ఇక్కడి ప్రసిద్ధ నంది కొండల ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో జరిగింది. వేలాది మంది ప్రజలు శివనామస్మరణ చేస్తు నందిగ్రామంలోని భోగనందీశ్వర ఆలయంలో మహాశివున్ని దర్శించుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. చిక్కబళ్లాపురం, దొడ్డబళ్లాపురం, బెంగళూరు, తుమకూరు, గౌరిబిదనూరు, విజయపుర, కోలారు తదితర ప్రాంతాల నుంచి భక్తజనం తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో పిల్లలు, పెద్దలు, మహిళలు అందరు పాల్గొన్నారు.
16 కిలోమీటర్లు
సుమారు 16 కి.మీ మేర గిరి ప్రదక్షిణ జరగ్గా ఓం నమః శివాయ అని నామస్మరణ చేస్తు నడక సాగించారు. మధ్య మధ్యలో కొందరు కళింగర పండ్లు, పానీయాలను భక్తులకు అందజేశారు. నందిగ్రామం నుండి కారహళ్లి క్రాస్ మీదుగా గాంధీగ్రామం నుంచి కణివె బసవణ్ణ ఆలయానికి వచ్చారు. అక్కడ బసవణ్ణ స్వామిని దర్శించుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి భోగనందీశ్వర ఆలయానికి చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ సమాప్తమైంది.
భక్తిశ్రద్ధలతో ఆషాఢ సోమవార
గిరి ప్రదక్షిణ
పాల్గొన్న వేలాది భక్తులు


