● రాష్ట్ర ఆహార గిడ్డంగిలో
రూ.86 లక్షల స్కాం
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర శివార్లలోని ఆనేకల్ తాలూకా, రామకృష్ణపురలో ఉన్న కర్ణాటక ఆహార, పౌర సరఫరాల సంస్థ గిడ్డంగిలో అధికారులు, సిబ్బంది కలిసి రూ.86.65 లక్షల విలువైన బియ్యం, గోధుమలు, రాగిని అమ్మేసుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. గిడ్డంగి మేనేజర్ శివకుమార్, సిబ్బంది నారాయణస్వామి, తిమ్మరాజు, రాజ్‌కుమార్, తౌసిక్‌లపై సూర్యనగర్ పీఎస్‌లో ఉన్నతాధికారులు కేసు పెట్టారు. ఇటీవల గోదాములో తనిఖీలు చేయగా బియ్యం, గోధుమలు, రాగిని అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైంది. వందలాది క్వింటాళ్లను అమ్మేసి డబ్బులు తినేశారని అనుమానాలున్నాయి. ఇప్పటికి లెక్కల ప్రకారం రూ.86.65 లక్షల విలువైన సరుకు దోపిడీకి గురైంది. స్కాం బయటపడడంతో నిందితులు పరారయ్యారు.


