ఇల్లెందులో.. స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి అనురాధ! | - | Sakshi
Sakshi News home page

ఇల్లెందులో.. స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి అనురాధ!

Nov 5 2023 12:16 AM | Updated on Nov 5 2023 12:53 PM

- - Sakshi

గుమ్మడి అనురాధ

సాక్షి, భద్రాద్రి/ఇల్లెందు: ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు గుమ్మడి అనురాధ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. స్వతంత్రంగా పోటీ చేసే అనురాధకు తమ పార్టీ మద్దతు ఉంటుందని శనివారం సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రకటించారు. దీంతో ఐదుసార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా ఎన్నికై న గుమ్మడి నర్సయ్య ఈసారి పోటీ చేయటం లేదని తేలిపోయింది. కారేపల్లి మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి నర్సయ్య– అమ్మక్కల కుమార్తె ఉస్మానియా లా కళాశాల అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ పూర్తి చేశారు.
ఇవి చదవండి: సరిహద్దుల్లో పటిష్ట నిఘా! కలెక్టర్‌తో వ్యయ పరిశీలకుల భేటీ..

Advertisement
 
Advertisement
Advertisement