Jagan Govt Challenge AP High Court Stay Verdict On R-5 Zone - Sakshi
Sakshi News home page

ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణాలపై న్యాయపోరాటమే.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు జగన్‌ ప్రభుత్వం

Aug 3 2023 2:24 PM | Updated on Aug 3 2023 2:46 PM

Jagan Govt Challenge AP High Court Stay Verdict On R 5 Zone - Sakshi

కుట్ర పూరితంగా దాఖలైన వ్యాజ్యాల ఆధారంగా ఆర్‌-5 జోన్‌ పరిధిలో.. 

సాక్షి, గుంటూరు:  పేదల ఇళ్ల నిర్మాణంపై న్యాయపోరాటం చేయాలనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ క్రమంలో ఆర్‌-5 జోన్‌ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇవాళ ఏపీ హైకోర్టు వెల్లడించిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

రాజకీయ కుట్రలు, కోర్టు కేసుల ఆటంకాలు దాటుకుని ఇటీవలే అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో సీఎం జగన్‌ చేతుల మీదుగా పట్టాలు అందజేయించి మరీ ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది ప్రభుత్వం.  అయితే ఇళ్ల నిర్మాణాన్ని ఆపేలా కుట్రపూరితంగా కొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 

ఈ నేపథ్యంలో గురువారం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇళ్ల నిర్మాణాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. స్టే ద్వారా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ హైకోర్టు విధించిన స్టేను జగన్‌ సర్కార్‌ సవాల్‌ చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement