breaking news
Dharmasthala
-
పుర్రె రహస్యం గుట్టురట్టు?
కర్ణాటక: ధర్మస్థలలో వందలాది శవాలను పూడ్చిపెట్టినట్లు చెప్పిన ముసుగు మనిషి చిన్నయ్య నుంచి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్నాయి. అతడు మొదట్లో తీసుకువచ్చిన పుర్రె ఎక్కడిది అనే ప్రశ్నకు సమాధానం లభించింది. చిన్నయ్యను సిట్ అధికారులు విచారణ కోసం 10 రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. శనివారం నుంచి ప్రశ్నలతో సతమతం చేస్తున్నారు. పుర్రెను ఢిల్లీ నుంచి తీసుకువచ్చినట్లు చెప్పాడని తెలిసింది. కుట్ర చేసిన ముఠా తనను ఢిల్లీకి తీసుకువెళ్లి అక్కడ ప్రముఖ వ్యక్తులను కలిసి పుర్రె ఇచ్చారన్నాడు. పుర్రెను ముందు పెట్టుకుని కోర్టు నుంచి భద్రత తీసుకున్నానని చెప్పాడని సమాచారం. పుర్రె దొరికినది ధర్మస్థలలో తవ్వకాలు జరిగిన చోట కాదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. పుర్రెలో ఉన్న మట్టిని బట్టి ఆ అంచనాకు వచ్చారు. ఆపై చిన్నయ్యను గట్టిగా ప్రశ్నించగా పుర్రె ను వేరే చోట నుంచి తీసుకువచ్చినట్లు తెలిపాడు. ఇతరులు చెప్పినట్లు నేను చేశానని, కానీ సూత్రధారి వేరేవారని నోరువిప్పాడు. సదరు ముఠా నుంచి నుంచి రూ.2 లక్షలు నగదు తీసుకుని నాటకమాడినట్లు చెప్పాడు. 2023 డిసెంబరులో ఆ గ్యాంగ్ తనను సంప్రదించి ఈ వ్యవహారం నడపాలని కోరింది. ఈ అసత్య ప్రచారం చేసే గ్యాంగ్‌లో మహేశ్‌శెట్టి తిమరోడి, గిరీశ్ మట్టణ్ణవర్లు ఉన్నట్లు తెలిపాడు. చిన్నయ్య మరింత విచారించి సమాచారం సేకరించడంలో తలమునకలయ్యారు.సుజాతభట్ ను ఇంట్లోనే విచారణ! కూతురు అనన్య భట్ అదృశ్యమైందని, ఆమె ఆచూకీ కనిపెట్టాలని, వీలు కాకపోతే కనీసం అస్థికలనైనా ఇవ్వాలని ధర్మస్థలలో రభస చేసిన వృద్ధురాలు సుజాత భట్‌ను ఇంట్లోనే త్వరలో విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. బెంగళూరు బనశంకరిలో ఆమె నివాసానికి గట్టి పోలీస్ భద్రత కలి్పంచారు. ఒకటి రెండు రోజుల్లో ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తారు. ఆమె చెప్పేది నిజమా, అబద్దమా తదితరాలను ఆరా తీస్తారు. మాస్కుమ్యాన్ చూపించిన 17 ప్రదేశాల్లో తన కుమార్తె అనన్యభట్ ను పూడ్చిన స్థలం ఉందని సుజాత భట్ ఆరోపించింది. గతంలో మిస్సింగ్ ఫిర్యాదు ఇస్తే ధర్మస్థల పోలీసులు అస్సలు పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు చేయడం చాలా ప్రచారమైంది. ఈమె వ్యాఖ్యలతో ధర్మస్థల కేసు బలపడుతుందనే సమయంలో ఆమెకు పిల్లలు లేరని తేలింది. ఈ విషయమై ప్రశ్నించగా.. మణిపాల్‌లో తన తాత ఆస్తి ఉండేది. ఆ ఆస్తిని తమ కుటుంబసభ్యులు ధర్మస్థల ధర్మాధికారులకు ఇచ్చారని, దీంతో నేను ఈ విధంగా అబద్ధం చెప్పానన్నారు. తరువాత ఆ మాటలు తనవి కాదని ప్రకటించింది. ఇలా నిత్యం విరుద్ధ ప్రకటనలు ఆమె ఎందుకు చేస్తోందో పోలీసులకు అంతుబట్టడం లేదు. పూర్తి వివరాలు కావాలని, విచారణకు రావాలని సిట్ నోటీసులు పంపగా ఆమె విచారణకు రాలేదు. రెండు మూడు రోజుల్లో ఇంటికెళ్లి విచారించాలని తీర్మానించారు.యూట్యూబర్ సమీర్ విచారణశివాజీనగర: ధర్మస్థల మీద అభూత కల్పనలతో వీడియోలు చేశాడనే కేసులో బళ్లారి యుట్యూబర్ సమీర్ ఆదివారం బెళ్తంగడి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యాడు. ఉదయం 10–30 గంటలకు వస్తానని చెప్పి, మధ్యాహ్నం 1 గంటకు న్యాయవాదితో కలిసి వచ్చాడు. ధర్మస్థల దేవాలయం విరుద్ధంగా అప ప్రచారం చేసినందుకు, పలు వర్గాలను రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో కోర్టులో ముందస్తు బెయిలు తెచ్చుకున్నాడు. ధర్మస్థలలో తనకు ప్రాణ బెదిరింపు ఉందని సమీర్ చెప్పుకొన్నాడు. సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. -
Dharmasthala: ధర్మస్థళ ‘చిన్నయ్య’.. మామూలోడు కాదు
బెంగళూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో ఊహించని మలుపు తిరిగింది. ప్రధాన ఫిర్యాదుదారుడు చిన్నయ్య పచ్చి అబద్ధాల కోరుగా బయటపడినట్లు తెలుస్తోంది. డబ్బు కోసం ధర్మస్థళపై సామూహిక ఖననాల కథలు అల్లినట్లు అతని మాజీ భార్య రత్నమ్మ ఆరోపించారు. ఇప్పటికే చిన్నయ్య చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా తేలడంతో, సిట్ అధికారులు అతనిని అరెస్ట్ చేశారు. అతని మాజీ భార్య కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఈ కేసులో మరింత ఆసక్తికరంగా మలుపు తిరిగింది. ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో సిట్ అధికారులు చిన్నయ్యను అరెస్ట్ చేయడంపై అతని మాజీ రత్నమ్మ స్పందించారు. ‘చిన్నయ్య తప్పుడు మనిషి. ఆయనకు అబద్ధాలు చెప్పడం కొత్తేమీ కాదు. చిన్నయ్య నుంచి విడాకులు కోరుతూ నేను కోర్టును ఆశ్రయించా.అయితే, కోర్టు విచారణ సమయంలో నాకు భరణం ఇవ్వాల్సి వస్తుందేమోనని కోర్టులో నా గురించి తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో నాకు అన్యాయం జరిగింది. కొన్నాళ్లు నా తల్లే నన్ను సాకింది. ఆ తర్వాత బిడ్డల అండతో జీవిస్తున్నట్లు పేర్కొంది.గ్రామస్థులు సైతం చిన్నయ్యపై పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. చిన్నయ్య నిత్య పెళ్లికొడుకు. ధర్మస్థళలో ఉంటున్నప్పుడే అతనికి మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ముగ్గురు భార్యలు అతనికి విడాకులు ఇచ్చినట్లు పలు స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది మరోవైపు ధర్మస్థళ గురించి చెప్పేవన్నీ తేలడంతో సిట్ అధికారులు చిన్నయ్యను అరెస్ట్ చేశారు. దీనిపై ధర్మస్థళ గ్రామం, మంజునాథేశ్వరుడు, తమ కుటుంబానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే పేర్కొన్నారు. సిట్ అధికారులు చిన్నయ్యను బెల్తంగడి కోర్టులో హాజరుపరిచిన తర్వాత..వీరేంద్ర హెగ్గడే మీడియాతో మాట్లాడారు.నిజం నిలకడ మీద తెలుస్తుంది అనడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. శైవ క్షేత్రంపై వచ్చిన ఆరోపణలు భక్తులను బాధించాయని, కానీ వాస్తవాలు గెలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.చిన్నయ్య.. గతంలో తాను ధర్మస్థళలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేశానని, అనేక మృతదేహాలను ఖననం చేశానని ఆరోపించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కానీ తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో, అతని ఆరోపణలు అబద్ధమని తేలడంతో సిట్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. -
'ధర్మస్థల' కేసులో మరో భారీ ట్విస్ట్
-
Dharmasthala Case: మరో ట్విస్ట్.. ముసుగు వ్యక్తి అరెస్ట్
ధర్మస్థళ: కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ వ్యవహారంలో తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించిన ముసుగు వ్యక్తి భీమాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ధర్మస్థళకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు.లభించని మృతదేహాల ఆనవాళ్లుఇటీవలి కాలంలో ధర్మస్థళ వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపింది. ధర్మస్థళ ప్రాంతంలో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా అధికారులకు తెలిపాడు. ఆ మృతదేహాల్లో ఎక్కువగా అత్యాచారం, హత్యలకు గురైన మహిళలవే ఉన్నాయన్నాడు. దీంతో అతను చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకుని రంగంలోకి దిగిన సిట్ అధికారులు అతను చెప్పిన ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభించారు. అయితే మృతదేహాలకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు అధికారులకు లభించలేదు.మాయమాటలతో వ్యవస్థను నమ్మించి..మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమాను శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సిట్ ప్రధాన అధికారి అయిన ప్రణబ్ మహంతి మరోమారు విచారించారు. ఈ నేపధ్యంలో అతను మాయమాటల చెప్పి వ్యవస్థను నమ్మించి, ఇప్పుడు తనకు ఏమీ తెలియదని అంటున్నాడని విచారణలో గుర్తించారు. ఈ నేపద్యంలోనే అధికారులు భీమాను అరెస్టు చేశారు. నేడు (శనివారం) అతనిని కోర్టుకు హాజరుపరచనున్నారు. దీనికి ముందు భీమా.. తనకు ఒకరు పుర్రె ఇచ్చి, సిట్ అధికారులకు ఇవ్వాలని చెప్పారని.. కోర్టులో కేసు కూడా వారే చేయించారని చెప్పాడు.సుజాత భట్ చెప్పిందీ కట్టుకథే..మరోవైపు సుజాత భట్ తాను గతంలో ధర్మస్థళకు వెళ్లినప్పుడు తన కూతురు మిస్ అయిందని తాను చెప్పినవన్నీ కట్టుకథలే అని సిట్ అధికారులమందు నిజం వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛాన్‌ల్‌తో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని చెప్పారు. తనకు అసలు అనన్య భట్ అనే కూతురే లేదని.. ధర్మస్థళ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తనతో అలా చెప్పించినట్లు ఆమె పేర్కొంది. అనన్య మిస్ అయినట్లు వచ్చిన ఫొటోలు కూడా కొత్తగా సృష్టించినవేనన్నారు. విచారణకు రాలేను: యూట్యూబర్ సమీర్ ధర్మస్థళ గురించి అపప్రచారం చేసిన ఆరోపణల కేసులో అరెస్ట్ భయాన్ని ఎదుర్కొంటున్న యూట్యూబర్ సమీర్‌కు మంగళూరులో జిల్లా సెషన్స్ న్యాయస్థానం గురువారం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం సమీర్‌కు వ్యతిరేకంగా చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. అరెస్ట్ భయంతో యూట్యూబర్ ఎండీ.సమీర్ బెళ్తంగడి సర్కిల్ ఇన్స్పెక్టర్కు లేఖ రాశాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించి లేఖ రాస్తున్నానని, తాను ధర్మస్థల స్టేషన్‌కు రావటానికి సాధ్యం కాదని తెలిపాడు. తన స్నేహితునిపై దాడి జరిగిందని తెలిపాడు. తనకు ప్రాణ హాని ఉందని భావించి, సెషన్ న్యాయస్థానంలో బెయిల్‌కు దరఖాస్తు చేశానని సమీర్ తెలిపాడు. ఒకవేళ తాను ధర్మస్థళ పోలీస్ స్టేషన్‌కు వస్తే, తనకు భద్రత కల్పించాలని కోరాడు. 15 రోజులలోగా విచారణకు హాజరవుతానని, దయచేసి తనకు భద్రత కల్పించాలని ఆ లేఖలో సమీర్ కోరాడు. -
అతడొక దుర్మార్గుడు: ముసుగు మనిషి భార్య
కర్ణాటక : డబ్బుల కోసం ఆశపడి ఎవరో అన్నమాటలను పట్టుకొని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల పేరుకు మాయని మచ్చ తెచ్చేలా తన మాజీ భర్త ప్రవర్తించాడని ఫిర్యాదిదారు, ముసుగుమనిషి ఒకప్పటి భార్య ఆరోపించింది. అతనితో విడాకులు తీసుకున్న మండ్య జిల్లా నాగమంగళకు చెందిన మహిళ తన మాజీ భర్త గురించి మీడియాతో మాట్లాడారు. అతనిది కూడా మండ్య జిల్లానే. 25 ఏళ్ల కిందట మేం పెళ్ళి చేసుకున్నాం, అతడు నేత్రావతి స్నానాల ఘాట్లను శుభ్రం చేసే పనిలో ఉండేవాడు. 7 సంవత్సరాలపాటు కలిసి ఉన్నాం, మాకు ఒక మగ, ఒక ఆడ పిల్ల ఉన్నారు, కుమార్తెకు పెళ్లయింది. నా మాజీ భర్త నా మీద నిత్యం అనుమానంతో గొడవపడేవాడు, అతని బాధలు పడలేక విడాకులు తీసుకున్నా. అతడు ధర్మస్థల గురించి చెప్పేవన్నీ అబద్ధాలే అని మండిపడింది. ఆ మాటలే వినలేదు ధర్మస్థలలో అత్యాచారాలు జరిగేవని, నది పక్కన శవాలు పాతిపెట్టారని, నగలు దోచుకునేవారని నేను ఎప్పుడూ వినలేదు. నాతో భర్త ఎప్పుడూ అలా చెప్పలేదు. జరిగే ప్రచారమంతా అబద్ధం అని ఆమె పేర్కొంది. ఆ పుణ్యక్షేత్రం మీద ఏదో చేయడానికి కుట్రతో ఇలా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. తాము విడిపోయిన తరువాత అతడు మరొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. భరణం కోసం కోర్టుకు వెళ్తే, నాకు జీతమే రాదు, భోజనం మాత్రమే పెడతారు, ఏమీ ఇవ్వలేను అని కోర్టులో చెప్పాడన్నారు. పుట్టింటిలో తల్లి, పిల్లలతో కలిసి ఉంటున్నట్లు తెలిపింది. -
ధర్మస్థళ కేసులో ట్విస్ట్.. తవ్వకాల నిలిపివేత
ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వందల మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు మాట మార్చాడు. తనతో బలవంతంగా ఈ ప్రకటన చేయించారని సిట్ ఎదుట మరో ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో.. ఆ వ్యక్తిని మరోసారి ప్రశ్నించడంతోపాటు తవ్వకాలను ఆపేయాలని సిట్ నిరణయించింది. ‘నాకు ఒకరు పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారు. న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారు. నేను 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నా’ అని సోమవారం ఆ వ్యకతి ప్రకటించాడు. దీంతో ముసుగు వ్యక్తిని ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్ నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతీ తెలిపారు. మరోవైపు.. భీమా, చిన్నయ్యగా కన్నడ మీడియా పిలుస్తున్న ముసుగు మనిషికి లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలని కర్ణాటక విధానసభలో బీజేపీ సభ్యులు సోమవారం డిమాండ్ చేశారు. అతడు చూపించిన అన్ని ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరిపారని, ఒక ప్రదేశంలో మినహా మరెక్కడా కళేబరాలు, అస్థిపంజరాలు లభించలేని హోంమంత్రి పరమేశ్వర్ ప్రకటించారు. యూట్యూబర్లు ఇకపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే.. సిట్ తవ్వకాలు నిలిచిపోవడంపైనా ఆయన స్పందించారు. ఇప్పటిదాకా తవ్వకాల్లో దొరికిన అవశేషాల విశ్లేషణ పూర్తై.. ఆ నివేదిక వచ్చేదాకా సిట్ తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారాయన. అయితే.. అది పూర్తిగా సిట్ సొంత నిర్ణయమని, ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పారాయన. -
‘ధర్మస్థళ తవ్వకాల’ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ
సామూహిక ఖననాల నేపథ్యంలో తవ్వకాలు జరిపిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం.. కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వనుందా? అనే ఆసక్తి నెలకొంది. అదే సమయంలో.. తవ్వకాలపై ప్రభుత్వం తరఫున కర్ణాటక అసెంబ్లీలో మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువనుండగా.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ధరస్థళ తవ్వకాల వ్యవహారం.. కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతోంది. ధర్మస్థళ పుణ్యక్షేత్రంపై భారీ కుట్ర జరుగుతోందని, క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సిట్ విచారణలో వాస్తవాలు బయటపడతాయని, ఆరోపణలు ఉత్తవేనని తేలితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. ఈ క్రమంలో.. ఇదే తరహా ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ.. డీఎకేఎస్ కామెంట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూస్తోంది.ధర్మస్థళ తవ్వకాలను బీజేపీ మొదటి నుంచి ఖండిస్తోంది. దివారం సుమారు 20 మంది చట్టసభ్యులు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రతో కలిసి ధర్మస్థళ పెద్దలను కలిశారు. వాళ్లు కలిసిన వాళ్లలో ఆలయ ధర్మకర్త, రాజ్యసభ ఎంపీ వీరేంద్ర హెగ్డే కూడా ఉన్నారు. ఆధ్యాత్మిక పట్టణం విషయంలో జరుగుతున్న విషప్రచారాన్ని అడ్డుకోవడంలో సీఎం సిద్ధరామయ్య విఫలమయ్యారని, తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని వాళ్లంతా డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం శివకుమార్ నిజమైన మంజునాథుడి భక్తుడే అయితే.. జరిగిన ఆ కుట్ర ఏంటో, దానివెనక ఎవరున్నారో బయటపెట్టాలి అని డిమాండ్ చేశారు.అదే సమయంలో ఇప్పటిదాకా జరిగిన సిట్ తవ్వకాలపై మధ్యంతర నివేదికను బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎవరో.. ఏదో చెప్పారని.. ప్రభుత్వం తవ్వకాలు చేయించడం ఏంటి?. పోనీ ఇప్పటిదాకా జరిగిన తవ్వకాల్లో ఏమైనా బయటపడ్డాయా? అంటే అదీ లేదు. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి.. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు. నిజాలు.. నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది అని బీజేపీ అంటోంది. ఈ క్రమంలో.. శాసనసభ ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ సంచలన ఆరోపణలకు దిగారు.వామపక్ష భావజాలం ఉన్న ఓ అర్బన్ నక్సల్స్ గ్యాంగ్.. ధర్మస్థళపై తప్పుడు ప్రచారానికి దిగింది. హిందువులకు, ధర్మస్థళకు వ్యతిరేకంగా విషప్రచారం చేస్తోంది. ఆ దండుపాళ్య ముఠా చేసిన ప్రచారానికి ప్రభుత్వం తలొగ్గింది. దీనంతటికి సీఎం సిద్ధరామయ్యే కారణం. ఆయన అధికారంలోకి రాకముందు.. వాళ్లంతా అడవుల్లో తిండి కోసం కష్టాలు పడేవారు. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ధర్మస్థళ ఆలయంపైకే జేసీబీలను నడిపిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. సౌజన్య కేసులోనో.. సిట్ దర్యాప్తునకో మేం అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. కానీ, ఏవరో ఏదో చెప్పారని సీఎం సిట్‌ను ఏర్పాటు చేయించడమే ఇక్కడ విడ్డూరంగా ఉంది. ఇధి ధర్మస్థళ ప్రతిష్టను దెబ్బ తీసే చర్యనే. అందుకే దానినే మేం వ్యతిరేకిస్తున్నాం అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ధర్మస్థళ వ్యవహారంలో సిట్ మధ్యంతర నివేదికను బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే హోం మంత్రి పరమేశ్వర మాత్రం ఈ వ్యవహారంలో పూర్తి స్వేచ్ఛ సిట్కే ఉందని తేల్చి చెప్పారు. ‘‘ఈ వ్యవహారంలో మధ్యంతర, తుది నివేదిక ఇవ్వడమనేది సిట్ చేతుల్లోనే ఉంది. మేం ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోం’’ అని అన్నారు. మరికాసేపట్లో ఆయన అసెంబ్లీలో తవ్వకాల వ్యవహారంపై ప్రకటన చేయబోతున్నారు.1995-2014 మధ్య వందలాది హత్యలు జరిగాయని, వాటి మృతదేహాలను తానే ఖననం చేశానంటూ గతంలో ధర్మస్థళ క్షేత్రంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన ఓ వ్యక్తి(61) ఆరోపణలకు దిగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆలయ పెద్దల ఆదేశాల మేరకు తాను ఆ పని చేశానంటూ చెప్పుకొస్తున్నాడా వ్యక్తి. ఈ క్రమంలో.. 2022లో ట్రిప్ కోసం ధర్మస్థళకు వెళ్లిన తన 22 ఏళ్ల కూతురు తిరిగి రాలేదంటూ బెంగళూరుకు చెందిన సుజాత భట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేగు(విజిల్ బ్లోయర్ ) ఆరోపణలు, సుజాత ఫిర్యాదు నేపథ్యంలో.. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక బృందంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తోంది. ఆ వ్యక్తి తొలుత చూపించినట్లు 13 చోట్ల మాత్రమే కాకుండా.. ఆపై గుర్తించిన మరో నాలుగు చోట్ల కూడా సిట్ తవ్వకాలు జరిపించింది. అత్యాధునిక సాంకేతికత సాయం తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో రెండు చోట్ల మాత్రమే అస్థిపంజరాల అవశేషాలు బయటపడినట్లు తెలుస్తోంది. అయితే పశ్చిమ కనుమల్లో పుట్టిన నేత్రావతి నదీ.. గత దశాబ్దంన్నరకాలంగా తీవ్ర వరదలతో ప్రభావితం అయ్యింది. దీంతో తీర ప్రాంతం కోతకు గురై సమూలంగా మారిపోయిందని, బహుశా ఆ అవశేషాలు కొట్టుకుపోయి ఉంటాయని చెబుతున్నాడతను. మరోవైపు.. సుజాత తన కూతురు అనన్య ఫొటోను తొలిసారిగా మీడియాకు విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో ఈ కేసు మిస్టరీ ఎలా ముగుస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
ధర్మస్థళ తవ్వకాలపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారిన సామూహిక ఖననం కేసుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాల తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించారు. ధర్మస్థళ పుణ్యక్షేత్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, త్వరలోనే నిజం నిలకడ మీద తెలుస్తుందని అన్నారాయన.ధర్మస్థళలో రెండు దశాబ్దాల కిందట.. హత్యలు, అత్యాచారాలు జరిగాయని, వందల సంఖ్యలో మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారని ఓ వ్యక్తి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్షేత్రంలో మాజీ పారిశుద్ధ్య కార్మికుడిగా చెబుతున్న ఆ 61 ఏళ్ల వ్యక్తి ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయించి అతను చూపించిన చోటల్లా తవ్వకాలు జరిపిస్తోంది. అయితే.. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలకు దిగడంతో.. డిప్యూటీ సీఎం శివకుమార్ స్పందించారు. సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం ఉందని, త్వరలోనే ధర్మస్థళపై జరుగుతున్న కుట్ర బయటకు వస్తుందని, ఆ ఆరోపణలు రుజువుకాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తనతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని శివకుమార్ వెల్లడించారు. అయితే.. ‘‘నేను ఇప్పటికీ ధర్మస్థళ మంజునాథస్వామి భక్తుడినే. ధర్మస్థల వీరేంద్రహెగ్డే చేసిన సేవలను గౌరవిస్తాం. భక్తునికి– దేవునికి ఉన్న సంబంధానికి మనం భంగం కలిగించరాదు. అలాగని నేనేం ధర్మస్థళకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో మాట్లాడడం లేదు. చట్టానికి ఎవరూ అతీతులు కారని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకవేళ ధర్మస్థళపై నిజంగా కుట్ర జరిగి ఉంటే విచారణలో బయటపడుతుంది. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించకతప్పదు. ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో.. ఈ అంశంపై హోం మంత్రి పరమేశ్వర సోమవారం కర్ణాటక అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేస్తారు’’ అని శివకుమార్ వెల్లడించారు. గురువారం ధర్మస్థళ తవ్వకాలపై అసెంబ్లీలో హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడారు. ‘‘ఫిర్యాదు ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఆ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు జూన్ 19 సిట్ ను ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించాం. ఇది పూర్తి కావడానికి కాలపరిమితి ఉంటుంది. ఈలోపు సిట్ దర్యాప్తునకు భంగం కలిగించేలా వ్యవహరించకూడదని భావిస్తున్నాం’’ అని అన్నారాయన. 1995-2014 మధ్య తాను పని చేస్తున్న సమయంలో ధర్మస్థళ ఆలయ నిర్వాహకుల ఆదేశాల మేరకు తానే స్వయంగా ఆ మృతదేహాలను పాతిపెట్టినట్లు సదరు వ్యక్తి చెబుతున్నాడు. అందులో మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలు అధికంగా ఉన్నాయని, కొందరిపై లైంగిక దాడి జరిగినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ముసుగు ధరించిన ఆ వేగు(Whistleblower)ను.. ‘భీమా’.. ‘చిన్నయ్య’.. అని కర్ణాటక మీడియా వ్యవహరిస్తోంది. విక్టిమ్ ప్రొటెక్షన్ కింద సిట్ అతనికి రక్షణ కల్పిస్తోంది కూడా. ఇప్పటిదాకా నేత్రావతి నదీ తీరం వెంబడి అతను చూపించిన చోట్లలో సిట్ తవ్వకాలు జరిపింది. అందులో రెండు చోట్ల మాత్రమే అస్తిపంజరాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు ఆ వ్యక్తి. ఇదీ చదవండి: ఆలయ నిర్వాహకులే పూడ్చాలని.. సిట్ నన్ను నమ్మడం లేదుఇదిలా ఉంటే.. తీవ్ర చర్చకు దారితీసిన ధర్మస్థలలో మృతదేహాల కోసం తవ్వకాల కేసులో గురువారం విధానసభ దద్దరిల్లింది. ధర్మస్థల మీద అసత్య ప్రచారం చేస్తున్న ప్రభుత్వం కూకటి వేళ్లతో కూలిపోతుందని బీజేపీ, జేడీఎస్ నాయకులు శాపాలు పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి 10, 15 ఏళ్ల క్రితం ధర్మస్థల లో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పడం ద్వారా పవిత్ర ధర్మక్షేత్రానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా కుట్ర జరుగుతోంది. అస్థికల కోసం తవ్వకాలంటూ హిందూ ధార్మిక కేంద్రాలపై జరుగుతున్న అసత్య ప్రచారం సహించడం సాధ్యం కాదు. ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రజలు ఆవేశం చెంది పోరాటం చేసే స్థితి తీసుకురాకూడదు.. .. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది దర్యాప్తా, హిందూ పుణ్యక్షేత్రంపై జరుగుతున్న కుట్రలో అసత్య ప్రచారంలో కాంగ్రెస్ యూట్యూబర్లు, ఇతర మతస్తుల చేతిలో కీలుబొమ్మగా మారుతోందా?’’ అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో సిట్ దర్యాప్తు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అలాగని ధర్మస్థళను టార్గెట్ చేయడం సరికాదన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మాటలు విని గుంతలు తవ్వే పనిచేస్తున్నారని, ధర్మస్థల పవిత్రతను కాపాడటానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్ని రోజులు ఎన్ని గుంతలు తవ్వారు, ఎన్ని అస్థిపంజరాలు దొరికాయి అనేది చెప్పాలని సునీల్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. -
ఆలయ నిర్వాహకులే పూడ్చాలని ఆదేశించారు
బెంగళూరు: కర్ణాటకలో అత్యంత వివాదాస్పదంగా మారిన మృతదేహాల పూడ్చివేత ఉదంతంలో ధర్మస్థల ఆలయ నిర్వాహకులే గుర్తుతెలియని మృతదేహాలను అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టాలని తనను ఆదేశించారని మాజీ పారిశుద్ధ్యకార్మీకుడు భీమ తాజాగా ప్రకటించారు. ఇండియాటుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భీమ ఇలాంటి సంచలన విషయాలను తొలిసారిగా పంచుకున్నారు. ‘‘నేను, నాతోపాటు మరికొందరం కలిసి డజన్ల కొద్దీ మృతదేహాలను 1995 నుంచి 2014కాలంలో అటవీ ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల పూడ్చిపెట్టాం. మృతుల్లో చాలావరకు మహిళలు, చిన్నారులే. ఆనాడు పారిశుద్ధ్యకార్మీకునిగా పనిచేశా. అయితే మృతదేహాలను పూడ్చిపెట్టాలని స్థానిక ప్రభుత్వ యంత్రాంగం నుంచిగానీ గ్రామపంచాయితీ అధికారులుగానీ ఆదేశించలేదు. కేవలం ధర్మస్థల ఆలయ సమాచార కేంద్రం నిర్వాహకులు, అధికారులే మాకు ఈ ఆదేశాలిచ్చారు. మేం ఏ ఒక్క మృతదేహాన్ని స్మశానవాటికలో ఖననంచేయలేదు. అన్నింటినీ అడవిలోనే పాతిపెట్టాం. పాత రోడ్లు, నదీ పరివాహక ప్రాంతాల్లో పూడ్చిపెట్టాం. బాహుబలి కొండల్లో ఒక మహిళను పూడ్చిపెట్టాం. నేత్రావతి స్నానఘట్టం సమీపంలో ఏకంగా 70 మృతదేహాలను పాతిపెట్టాం. ఇప్పటికే అధికారులు తవ్వకాలు జరిపిన 13వ చోట అయితే నాకు గుర్తుండి దాదాపు 70, 80 మృతదేహాలను పూడ్చిపెట్టాం. కొన్ని సార్లు పూడ్చేటప్పుడు స్థానికులు మమ్మల్ని గమనించారు. కానీ ఎవరూ మాకు అడ్డుచెప్పలేదు’అని ప్రజావేగుగా మారిన భీమ చెప్పారు. లైంగిక వేధింపుల గుర్తులు ‘‘మృతదేహాలను చూస్తే హింసకు, లైంగిక వేధింపులకు గురైనట్లు స్పష్టంగా తెలిసేది. మృతదేహాలపై గాయాలైన గుర్తులుండేవి. హింసించి చంపేశారని అర్థమయ్యేది. కానీ వాస్తవంగా లైంగిక వేధింపులు జరిగాయో లేదో వైద్యనిపుణులే చెప్పగలరు’’అని భీమ అన్నారు. ‘‘చిన్నారుల మొదలు వృద్దుల దాకా అన్ని వయసుల వాళ్ల మృతదేహాలను మేం పూడ్చిపెట్టాం. వంద మృతదేహాల్లో దాదాపు 90 దాకా మహిళలవే. అడవిలో వర్షాల కారణంగా నేల కోతకు గురవ్వడం, అటవీ ప్రాంతందాకా నివాసభవన నిర్మాణాలు జరగడంతో ఇప్పుడు కొన్ని పూడ్చిన స్థలాలను గుర్తుపట్టడం కష్టమే. గతంలో నేను గుర్తుపట్టడానికి అక్కడో రోడ్డు ఉండేది. జేసీబీ తవ్వకాలతో ఇప్పుడా రహదారి మార్గం గుర్తించలేని పరిస్థితి తలెత్తింది. గతంలో కొన్ని చోట్ల చెట్లు తక్కువ ఉండేవి. ఇప్పుడు బాగా చెట్లు పెరిగి ఆ ప్రాంతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది’’అని అన్నారు. నేను సిట్‌ను నమ్మినా వాళ్లు నన్ను నమ్మట్లేరు ‘‘ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణను నేను పూర్తిగా నమ్ముతున్నా. కానీ సిట్ అధికారులు నేను చెప్పేది విశ్వసించట్లేరు. వాళ్ల దర్యాప్తు ధోరణి చూస్తుంటే నాకు విసుగొస్తోంది. నాకు గుర్తున్నమేరకు ఆయా చోట్లను చూపిస్తున్నా. సిట్ అధికారులు పైపైన తవ్వేసి ఏమీ దొరకట్లేదని నాపై నమ్మకం పోగొట్టుకుంటున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిన ఆయా ప్రాంతాల్లో మరింత విస్తృతస్థాయిలో తవ్వకాలు జరిపితే ఆధారాలు లభిస్తాయి. 13వ నంబర్ స్పాట్‌సహా కనీసం మరో నాలుగైదు చోట్ల తవ్వాల్సిందే. నాతోపాటు మృతదేహాలు పూడ్చినవాళ్లను సిట్ రప్పిస్తే ఈ వెతుకులాట సులభమవుతుంది. పశ్చాత్తాపంతోనే రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ధర్మస్థలకు వచ్చి పచ్చి నిజాలు బయటపెట్టా. కలలో ఎప్పుడూ అస్తిపంజరాలే కనిపించేవి. అనామకులను పూడ్చిపెట్టానన్న పాపభీతి నన్ను వెంటాడింది. ఆ భయం, భారం తగ్గించుకునేందుకు మీడియా ముందుకొచ్చి జరిగిందంతా చెబుతున్నా. పూడ్చిన కళేబరాలకు ఇకనైనా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా అంతిమసంస్కారాలు జరగాలని ఆశిస్తున్నా. ధర్మస్థల ఆలయ పరువును మంటగలపడం నా ఉద్దేశం కానేకాదు. నేనెక్కిడికీ పారిపోవాల్సిన అవసరం లేదు. పూడ్చిన ప్రాంతాల గుర్తింపునకు సాయపడతా. తర్వాత నా స్వస్థలానికి వెళ్లిపోతా. మృతదేహాలపై ఉండే బంగారు ఆభరణాలను నేను దొంగతనం చేశానన్న ఆరోపణల్లో నిజం లేదు. బంగారమే దోచేస్తే ఇన్నాళ్లూ పారిశుద్ధ్యకార్మీకునిగా బతుకీడ్చాలిన అగత్యమెందుకు?. నేను అలాంటి తప్పుడు పనులు చేయను. నేను హిందువును. అందులోనూ షెడ్యూల్డ్ కులస్తుడను’’అని భీమ అన్నారు.70 శవాలను నేనే పూడ్చా ‘‘దాదాపు 70, 80 మృతదేహాలను స్వయంగా నేనే పూడ్చిపెట్టా. కొన్నింటిని నేలలో చాలా లోతులో పూడ్చిపెట్టాం. మరికొన్నింటిని కొండల మీద పాతిపెట్టాం. ఆలయ ఇన్ఫర్మేషన్ సెంటర్ యాజమాన్యం సూచించిన ప్రాంతాల్లో మాత్రమే శవాలను పూడ్చిపెట్టాం. ఆలయ మేనేజర్ ఎప్పుడూ నన్ను నేరుగా కలవలేదు. రూమ్ బాయ్ ద్వారా మాకు ఆదేశాలు అందేవి. వాటిని మేం అమలుచేసేవాళ్లం. మేం పూడ్చిన ప్రాంతాల్లోనే భవన నిర్మాణాలు జరిగాయి. అందుకే సిట్ తవ్వకాలు జరిపిన చోట్ల మృతదేహాల ఆనవాళ్లు లభించట్లేదేమో. పట్టపగలే మేం మృతదేహాలను పూడ్చాం’’అని భీమ చెప్పారు. -
‘సిట్ నన్ను నమ్మడం లేదు’.. ధర్మస్థళ ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్
బెంగళూరు: కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు ఊహించని మలుపు తిరిగింది. పారిశుధ్య కార్మికుడిగా (విజిల్‌బ్లోయర్) విధులు నిర్వహించే సమయంలో ధర్మస్థళలో వందలాది శవాలను తాను ఖననం చేశానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ‘భీమ’ (స్థానికులు పిలుస్తున్న పేరు) మీడియా ముందుకు వచ్చారు.ధర్మస్థళలో అవశేషాల కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు తనని నమ్మడం లేదని, నేను వారిని నమ్ముతున్నానని అన్నారు. అంతేకాదు తాను ఖననం చేసిన వారి అస్థిపంజరాలు తన కల్లోకి కూడా వచ్చేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థళ కేసు పురోగతిపై ఇండియా టుడే పారిశుధ్య కార్మికుడిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలను బహిర్ఘతం చేశారు.ధర్మస్థళలో 1995-2014 మధ్య కాలంలో నేను పారిశుధ్య కార్మికునిగా పని చేసే సమయంలో వందల మంది బాధితుల మృతదేహాల్ని ఖననం చేశాను. ఆ మృతదేహాలపై హింస,లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశా. మృతదేహాలను ఖననం చేయాలని ఆలయ ప్రతినిధులు మాకు ఆ పని పురమాయించారు. మృతదేహాల ఖననం విషయంలో ప్రభుత్వం,గ్రామ పంచాయతీ పెద్దలు ఎప్పుడూ మాకు చెప్పింది లేదు. ఎవరి మృతదేహాలను ఎక్కడ ఖననం చేయాలో.. ఎక్కడ దహనం చేయాలో మొత్తం ఆలయ అధికారులే ఆదేశించారు. అడవులు,నదీ తీరంలో ఖననాలుధర్మస్థళ దేవాలయం అధికారుల ఆదేశాలకు అనుగుణంగా మేం మృతదేహాలను ఖననం చేసే వాళ్లం.పూడ్చి పెట్టేవాళ్లం.ఈ పనిలో నాతో పాటు మరో ముగ్గురు పాల్గొన్నారు.మహిళల మృతదేహాలను స్మశాన వాటికల్లో కాకుండా అడవుల్లో,పాతబడిన రోడ్లు,నదీ సమీపంలో పాతిపెట్టేవాళ్ళం.మేము బాహుబలి కొండలపై ఒక మహిళను,నేత్రావతి స్నాన ఘాట్‌లో దాదాపు 70 మృతదేహాలను ఖననం చేశాం. నేను చెప్పిన స్పాట్ నెంబర్ 13లో సుమారు 70 నుండి 80 మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాలను ఖననం చేసే సమయంలో స్థానికులు మమ్మల్ని చూసేవారు. కానీ వాళ్లెప్పుడూ జోక్యం చేసుకోలేదు.పై నుంచి ఆదేశాలు వచ్చేవి. మృతదేహాలను ఖననం చేసేవాళ్లం. అదే మా పని.ధర్మస్థల ఆలయం నుండి కిలోమీటర్ దూరంలో ఓ కొండపైన దిగంబర్ జైన విగ్రహం ఉంది. దానిని బాహుబలికొండ అని పిలుస్తారు. దిగంబర్ జైన్ విగ్రహం చేరుకోవాలంటే కింది నుంచి 300మెట్లు ఎక్కాల్సి ఉంది.100 మృతదేహాలలో 90 వారివేఖననం లేదంటే దహనం చేసిన మహిళలు,యువతులు,బాలికల మరణానికి కారణాలేంటనేది చెప్పలేదు. అయితే ఆ మృతదేహాలపై హింస, లైంగిక దాడికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. కొన్ని మృతదేహాలపై స్పష్టమైన గుర్తులు ఉన్నాయి. వారిపై దాడి జరిగినట్లు అనిపించింది. బాధితులపై లైంగిక దాడి జరిగిందా? లేదా? అన్నది వైద్యలు మాత్రమే గుర్తించగలరు. మృతదేహాల్లో పిల్లలు,వృద్ధుల ఎక్కువగా ఉన్నారు. మహిళలు ఎక్కువ మంది ఉండగా.. ఖననం చేసినట్లు పేర్కొన్న 100 మృతదేహాలలో 90 మంది వారే ఉండటం గమనార్హం.మారిన స్థలాలు..ఆధారాలు మాయం ధర్మస్థళ పరిసర ప్రాంతాల్లో నాడు ఖననం చేసిన ప్రాంతాల వరకు ఆచూకీ కనిపించడం లేదు. 1995-2014 మధ్య కాలంలో మృతదేహాలను ఖననం చేసే సమయంలో ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉండేవి. ఇప్పుడు ఎటుచూసినా చెట్లు మొలిచాయి. నిర్మాణాలు ఏర్పడ్డాయి.అయినప్పటికీ వాటిల్లో ఓ పాత రహదారి ఇప్పటికీ అలాగే సజీవంగా ఉంది. కాకపోతే ఆ ప్రాంతం అంతా అడవిలా మారింది. ఇప్పటికే నేను కొన్ని ప్రదేశాలు గుర్తించాను. జేసీబీ సాయంతో మరిన్ని మృతదేహాలను గుర్తిస్తానని మాజీ పారిశుధ్య కార్మికుడు చెబుతున్నాడు.మీరు వందల మందిని ఖననం చేశామని చెబుతున్నారు సరే.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం 13 ప్రదేశాల్లో పాక్షికంగా మృతదేహాల అవశేషాలను గుర్తించింది. వారిలో ఒక పురుషుడు మాత్రమేనని తెలుస్తోంది.మరి మిగిలిన మృతదేహాల మాటేమిటీ అని ప్రశ్నిస్తే.. బాధితుల్ని ఖననం చేసింది మేమే.. నేను నిజమే చెబుతున్నాను అని తనని తాను సమర్ధించుకున్నారు.‘నేను సిట్‌ను నమ్ముతాను..సిట్ నన్ను నమ్మదు’ఈ సందర్భంగా సిట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు దర్యాప్తు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పర్యవేక్షణలో కొనసాగుతోంది. వారిలో సిట్ బృందానికి ఐపీఎస్ డాక్టర్ ప్రణవ్ మొహంతి నేతృత్వం వహిస్తున్నారు. ఐపీఎస్ అధికారాలు అనుచేత్,జితేంద్ర కుమార్ దయామ, ఎస్పీ సైమన్, పుత్తూరు తహసీల్దారు స్టెల్లా వర్గీస్, బెళ్తంగడి తహసీల్దారు పృథ్వీ సానికంలు ఉన్నారు. వీరితో పాటు వైద్య పరీక్షల కోసం మంగళూరు కేఎంసీ వైద్యులు,అవశేషాల పరిశీలన కోసం ఫోరెన్సిక్ నిపుణులు సైతం ఉన్నారు. ఇప్పుడు అదే సిట్‌ను మాజీ పారిశుధ్యకార్మికుడు సంచలన ఆరోపణలు చేశారు. సిట్ బృందాన్ని తాను నమ్ముతున్నట్లు.. వారి విధానంపై నిరాశను వ్యక్తం చేస్తూ.. నేను సిట్‌ను నమ్ముతాను. వాళ్లు నన్ను నమ్మట్లేదు. నాకు గుర్తున్నంత వరకు ఖననం చేసిన ప్రదేశాల్ని చూపించడానికి వచ్చాను. సంవత్సరాలు గడిచిన కారణంగా మృతదేహాల గుర్తింపు ఆలస్యం అవుతుంది. గుర్తించేందుకు నావంతు కృషి చేస్తున్నాను. అవశేషాల గుర్తించాలంటే జేసీబీ పనితీరులో వేగం పుంజుకోవాలి. స్పాట్ 13తో సహా ఇంకా నాలుగు నుండి ఐదు ప్రదేశాలను గుర్తించాల్సి ఉంది. సిట్ బృందం నాతో పాటు పనిచేసిన వారిని కూడా గుర్తించాలి.వాళ్లొస్తే.. మృతదేహాల గుర్తింపు సులభం అవుతుంది. వేగం అవుతుందన్నారు. సౌజన్య హత్య కేసుసిట్ బృందం పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే 2012లో ధర్మస్థళ సమీప నిర్మానుష్య ప్రదేశంలో 17 ఏళ్ల సౌజన్య హత్య జరిగిన నాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకున్నారు. సౌజన్య హత్యకు గురైన రాత్రి నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నేను ఎక్కడ ఉన్నాననేది అవతల వ్యక్తి ఆరా తీశాడు. నేను సెలవు తీసుకుని ఊరికి వచ్చానని చెప్పడంతో ఫోన్లోని అవతలి వ్యక్తి నాపై గట్టిగా అరిచాడు. మరుసటి రోజు, హత్యకు గురైన అమ్మాయి మృతదేహాన్ని నేను చూశాను’అని విచారం వ్యక్తం చేశారు. అస్థి పంజరాలు కల్లోకి వచ్చేవి ఓసారి నా కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికనుపై అధికారులు లైంగికంగా వేధించారు. దాంతో ధర్మస్థళ నుంచి 2014లో పారిపోయినట్లు పారిశుధ్య కార్మికుడు చెప్పాడు. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉండేది.కొన్నిసార్లు మృతదేహాల అస్థిపంజరాలు నాకు కల్లోకి వచ్చేవి.అందుకే బాధితులకు న్యాయం చేయాలని సంకల్పంతో ప్రాణాల్ని ఫణంగా పెట్టి ముందుకు వచ్చాను. నా ఉద్దేశ్యం ఆలయాన్ని కించపరచడం కాదు, మృతదేహాలను గుర్తించడం.. వాటికి అంతిమ సంస్కారాలు నిర్వహించడమేనని మరోసారి స్పష్టం చేసిన ఆయన .. తనపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. మృతదేహాల నుంచి ఆభరణాలను దొంగిలించడమే కాదు.. ఆలయాన్ని కించపరచడానికి ప్రయత్నం చేస్తున్నాంటూ తనపై వస్తున్న ఆరోపణల్ని పారిశుధ్య కార్మికుడు ఖండించారు. నేను దొంగతనం చేసి బతకాలనిపిస్తే.. ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని. ఆలయంలో ఎందుకు విధులు నిర్వహించేవాడిని అని అన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు విషయానికొస్తే.. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు 16 ప్రదేశాల్లో తవ్వకాలు జరిపింది. వాటిలో 6,11స్పాట్లలో అస్థిపంజర అవశేషాలు లభ్యమయ్యాయి. 13వ స్పాట్లో అత్యధిక మృతదేహాలు ఉన్నాయని భీమ పేర్కొన్నారు. అక్కడ తవ్వకాలు సాంకేతిక కారణాలతో నిలిపివేశారు. ఇప్పటి వరకు భీమ 15 ప్రదేశాలను గుర్తించగా.. వాటిలో 8 నేత్రావతి నది ఒడ్డున, మిగిలినవి హైవే పక్కన ఉన్నాయి. -
ఈ ముసుగు మనిషి కాదు
శివాజీనగర: ధర్మస్థలలో బుధవారం 13వ పాయింట్లో తవ్వకాలు సాగాయి. అక్కడికి పాండురంగ, తుకారాంగౌడ అనే ఇద్దరు వచ్చారు. 2009లో శవాలను పూడ్చిపెట్టినది చూశాం. సహాయవాణికి, సిట్‌కు ఫిర్యాదు చేశాం. అయితే శవాన్ని పూడ్చింది ఈ ముసుగుమనిషి కాదు, అతనిని తాము చూడనే లేదు అని చెప్పారు. హోంమంత్రితో సిట్ చీఫ్ భేటీ ధర్మస్థల కేసులో సిట్ చీఫ్ ప్రణవ్ మొహంతి హోం మంత్రి పరమేశ్వర్‌ను భేటీ చేశారు. విధానసౌధలో కలిసి అర్ధ గంటకు పై చర్చలు జరిపారు. కేసు సమాచారం గురించి చర్చించారు.పుణ్యక్షేత్రం మీద అపనిందలా? ధర్మస్థలపై దు్రష్పచారం తగదు పలు నగరాలలో భక్తుల ర్యాలీలు శివాజీనగర: ధర్మస్థలకు విరుద్ధంగా అపప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలు బుధవారం రాష్ట్రంలో ధర్నాలు చేశారు. మైసూరు, బెళగావి, చిక్కమగళూరు, చామరాజనగర, గదగ, కల్బుర్గి, తుమకూరులో నిరసనలు జరిగాయి. ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే మీద తప్పుడు ప్రచారం సాగుతోందన్నారు. పురాణ ప్రసిద్ధ క్షేత్రమైన ధర్మస్థల ప్రతిష్టకు భంగం కలిగించే దూషణలు, అవమానకర పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారు? వారికి ఆర్థిక సహాయం ఇస్తున్నవారు ఎవరనేది తనిఖీ చేయాలన్నారు. నిరసనలు, ధర్నాలు బెళగావిలో చిన్నమ్మ సర్కిల్ నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు పాదయాత్ర జరిపి, జిల్లాధికారికి వినతి పత్రాన్ని సమరి్పంచారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చెబితే తవ్వకాలు జరుగుతున్నాయి. ఎవరో వచ్చి విధానసౌధలో నిధి ఉందంటే తవ్వుతారా? అని భక్తులు ప్రశ్నించారు. చిక్కమగళూరులో 2 వేల మందికి పైగా భక్తులు ఆజాద్ పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. మైసూరులో వేలాదిమంది ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు. -
Dharmasthala: 13వ సైట్లో నిగూఢ రహస్యాలు? ఆచితూచి అడుగువేస్తున్న సిట్..
ధర్మస్థళ: కర్ణాటకలోని ధర్మస్థళలో సామూహిక ఖననాల కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ ఘటనపై ప్రత్యేక బృందం (సిట్) దర్యాప్తు చేస్తుండగా, పలు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ పారిశుద్ధ్య కార్మికుడొకరు తాను వివిధ ప్రాంతాల్లో మృతదేహాలను ఖననం చేశానని చెప్పిన మీదట సిట్ అధికారులు నిజానిజాలు తేల్చేందుకు ఆయా ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే 13వ సైట్లో తవ్వకాల పనులు నిలిచిపోయాయి. 16వ ప్రదేశంలోనూ తవ్వకాలు పూర్తిచేసిన సిట్ అధికారులు 13వ సైట్లో తవ్వకాలు జరిపే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ ఖననాలపై ఫిర్యాదు చేసిన స్వీపర్ తాను 13 వ సైట్లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలను పాతిపెట్టానని సిట్ అధికారులకు తెలిపాడు. దీంతో ఇక్కడ తవ్వకాలపై అధికారులు ఆచితూచి అడుగు వేస్తున్నారు. కాగా బాహుబలి కొండలలో సిట్ అధికారులు 10 అడుగుల లోతు, 20 అడుగుల వెడల్పు గల కందకం తవ్వించినప్పటికీ అక్కడ ఎటువంటి మృతదేహం గానీ, మానవ అవశేషాలు గానీ లభ్యం కాలేదు. ఇప్పటివరకు 16 వేర్వేరు ప్రదేశాలలో తవ్వకాలు జరిగాయి. వీటిలో సైట్ నంబర్ 6,11 వద్ద అస్థిపంజర అవశేషాలు లభ్యమయ్యాయి. అయితే సాంకేతిక ఇబ్బందుల కారణంగా సైట్ నంబర్ 13 వద్ద తవ్వకాలు నిలిపివేశామని సిట్ అధికారులు చెబుతున్నారు.తాజాగా ఈ కేసులో ఒక మహిళ ఆ పారిశుద్ధ్య కార్మికుని వాదనను ధృవీకరించింది. తాను ఒకసారి ఆ పారిశుధ్య కార్మికుడు మృతదేహాన్ని పూడ్చిపెడుతుండటాన్ని చూశానని సిట్ అధికారులకు తెలిపింది. మరోవైపు ధర్మస్థళపై దురుద్దేశపూరిత ప్రచారం జరుగుతోందని గౌరిబిదనూర్ బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ పేర్కొన్నారు. దీనికి నిరసనగా ఆగస్టు 16న యెలహంక నుండి ధర్మస్థల వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ధర్మస్థళలో వందలాది మృతదేహాలను ఖననం చేశారనే వాదన అబద్ధమని, ఇది హిందూ సమాజాన్ని అవమానించడమేనన్నారు. దీనిపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి, అతని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ధర్మస్థళపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తిరుమల: కర్ణాటకలోని ధర్మస్థళలో అనుమానాస్పద మిస్టరీ మరణాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రస్ట్ చైర్మన్, సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 500 మంది అమ్మాయిలపై లైంగిక దాడి చేసి, హత్య చేసి పూడ్చి పెట్టారంటూ ఆరోపణలు చేశారు.సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ..‘కర్నాటకలోని ధర్మస్థళ ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉంది. ధర్మస్థళ ట్రస్ట్‌కు ఏడాదికి రూ.100 కోట్లు ఆదాయం వస్తుంది. ట్రస్ట్ చైర్మన్, సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలి. ట్రస్ట్‌ను ఎండోమెంట్ విభాగం స్వాధీనం చేసుకోవాలి. 500 మందిపై లైంగిక దాడి చేసి హత్య చేసి పూడ్చి పెట్టారు. అది దేవస్థానమా లేక స్మశాన వాటికా?. తవ్వే కొద్దీ పుర్రెలు, ఎముకలు బయటపడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సిట్ వేశారు.. మరో ప్రభుత్వం అయితే ఇది బయటకు వచ్చేది కాదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ తవ్వకాలు.. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కర్ణాటకలోని ధర్మస్థళ ఖననాల కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మరో కొత్త ప్రదేశంలో తవ్వకాలను చేపట్టింది. గుర్తు తెలియని ఫిర్యాదుదారుడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ ప్రదేశంలో తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఆ ప్రాంతంలో సిట్‌తో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, సాంకేతిక సిబ్బంది కూడా ఉన్నారు. ఈ తవ్వకాలు కఠినమైన భద్రత మధ్య నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. అయితే ఆ స్థలం నుంచి కనుగొన్న వాటి గురించి ఇప్పటివరకు వెల్లడించలేదు. అన్ని ఆధారాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని అన్నారు. తదుపరి చర్యలు, ఫోరెన్సిక్ నివేదికలు చట్టపరమైన ప్రక్రియల ఆధారంగా ఉంటాయని తెలిపారు. అయితే, ఈ దర్యాప్తు ప్రజలు, రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చలకు దారి తీసిందని అధికారులు అన్నారు.సుప్రీం కోర్టు కీలక నిర్ణయంమరోవైపు ధర్మస్థలలో సామూహిక అంత్యక్రియల కేసును నివేదించకుండా మీడియాను నిరోధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆలయాన్ని నిర్వహిస్తున్న కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని మీడియా కథనాలు వస్తున్నాయని ధర్మస్థళ ఆలయ కార్యదర్శి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు పేర్కొంది. పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ ధర్మస్థళ ఆలయ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌ను పునఃపరిశీలించాలని కర్ణాటకలోని ట్రయల్ కోర్టును ఆదేశించింది. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే గ్యాగ్ ఆర్డర్లు జారీ చేస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. అన్ని విషయాలను ట్రయల్ కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్‌ను ఆదేశించింది. -
ధర్మస్థలలో కొనసాగుతున్న తవ్వకాలు
కర్ణాటక : కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం పరిసరాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ వందలాది మందిని హత్య చేసి, మృతదేహాలను ఖననం చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పారిశుధ్య కార్మికుడు చెప్పిన 13 పాయింట్లకుగాను 10 ప్రదేశాల్లో తవ్వకాలు జరిగాయి. మంగళవారం 11వ పాయింట్లో సిట్ అధికారులు, పోలీసులు కూలీలతో తవ్వించారు. అక్కడ అస్థిపంజరాలేవీ లభించలేదని సమాచారం. సోమవారం 10వ పాయింట్ వద్ద కొన్ని అస్థిపంజరాల అవశేషాలు దొరికాయి. దీంతో మంగళవారం ఇంకా ఎక్కువ ఆధారాలేమైనా దొరుకుతాయా? అనే ఉత్కంఠ ఏర్పడింది. 11వ పాయింట్లో రెండున్నర గంటల పాటు ఆరు అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపారు. ఎలాంటి కళేబరాలు లభించలేదు. తరువాత ఆ గుంతను పూడ్చివేశారు. మధ్యాహ్నం తర్వాత 12వ పాయింట్లో తవ్వకాలు చేపట్టగా, భారీ వర్షం కురవడంతో ఆటంకం ఏర్పడింది. కార్మికులు మట్టిని తోడే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటిదాకా ఆరు పాయింట్లలో మానవ అస్థిపంజరాల అవశేషాలు లభించాయి. 13వ పాయింట్లో తవ్వాల్సి ఉంది. -
Dharmasthala Mystery: ధర్మస్థల మరణాల మిస్టరీలో ఇది రెండో ఆధారం
-
Dharmasthala case: బయటపడిన ఎముకలు, పుర్రె.. హత్యలు నిజమే?
ధర్మస్థళ: కర్ణాటకలోని మంగళూరు జిల్లాలోగల ధర్మస్థళ పుణ్యక్షేత్రం పరిధిలో సామూహిక ఖననాల ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తాను వందలాది మృతదేహాలను ఇదే ప్రాంతంలో ఖననం చేశానంటూ అధికారులకు ఫిర్యాదు చేసిన దరిమిలా దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆ పారిశుద్ధ్య కార్మికుడు సూచించిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టింది.11 వ సమాధి స్థలంలో..ఈ నేపధ్యంలో సిట్ అధికారులు తాము ఈ ప్రాంతంలో ఆరో రోజున సోమవారం కూడా తవ్వకాలు జరిపామన్నారు. ఈ తవ్వకాల్లో పలు ఎముకలు, ఒక పుర్రె లభ్యమయ్యిందని వెల్లడించారు. 11వ సమాధి స్థలంలో తవ్వకాలు ప్రారంభించిన కొద్దిసేపటికే, ఒక వ్యక్తి తమ దగ్గరకు వచ్చి, సమీపంలోని వేరే ప్రదేశానికి తీసుకెళ్లాడన్నారు. అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు అనేక ఎముకలు, ఒక పుర్రె దొరికాయన్నారు. తాము భోజన విరామం తీసుకోకుండా, గంటల తరబడి తవ్వకాలు జరిపామని సిట్ అధికారులు తెలిపారు. అయితే లభ్యమైన ఎముకలు, పుర్రెకు సంబంధించిన వివరాలపై వారు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. సిట్ అధికారులు తాము గుర్తించిన 13 సమాధులలో తవ్వకం పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్న 11 వ సమాధి స్థలంలో తవ్వకాలు పూర్తయ్యాయా? లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే తాజాగా లభ్యమైన ఆధారాలు ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా భావిస్తున్నారు.మరో ఫిర్యాదు..ఇదిలా ఉండగా, మంగళూరు జిల్లాలోని ఇచిలంపాడి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త టి. జయంత్ సోమవారం సిట్ అధికారులకు ఒక ఫిర్యాదు సమర్పించారు. చట్టపరమైన విధానాలను పాటించకుండా మైనర్ బాలిక మృతదేహాన్ని ఒక పోలీసు అధికారి ఇక్కడ పూడ్చిపెట్టారని ఆరోపించారు. దీనిపై కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు తానే ప్రత్యక్ష సాక్షినని, భయం కారణంగా ఆ సమయంలో ఎవరికీ ఈ విషయం చెప్పలేదన్నారు. ఈ ఫిర్యాదు అందిన తర్వాత అధికారులు.. ఫిర్యాదుదారు జయంత్‌ను దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేయాలని సూచించారు.ఫోరెన్సిక్ పరీక్షలకు ఎముకలుసిట్ తాజాగా నేత్రావతి నది సమీపంలో జరిపిన తవ్వకాల్లో మానవ ఎముకలు లభ్యమయ్యాయి. నాలుగు అడుగుల లోతున 15 ముక్కలుగా ఉన్న ఎముకలను కనుగొన్నారు. అవి పురుషునికి చెందినవిగా భావిస్తున్నారు. వయస్సు, లింగం, మరణానికి కారణాన్ని నిర్ధారించేందుకు ఆ ఎముకలను ఫోరెన్సిక్ నిపుణుల పరీక్షలకు పంపారు. దీనికిముందు 2000–2015 మధ్యకాలంలో ఇక్కడ చోటచేసుకున్న మరణ రికార్డులను బెల్తంగడి పోలీసులు తొలగించారనే ఆరోపణలు వినిపించాయి. ఇది స్థానికుల్లో ఆందోళన కలిగించింది. మరోవైపు ఈ ఘటనపై యూట్యూబ్ ఛానళ్లు వివరాలను నివేదించేందుకు అనుమతిస్తూ కర్ణాటక హైకోర్టు మీడియా గ్యాగ్ ఆర్డర్‌ను ఎత్తివేసింది. మరోవైపు సిట్ మంగళూరులో తమ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. స్థానికుల సలహాలు, సూచనల కోసం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.ఇది కూడా చదవండి: ధర్మస్థళ మిస్టరీ: ఆధారాలపై షాకిచ్చిన ఆర్టీఐ సమాధానం -
ధర్మస్థళ కేసు: అదే సస్పెన్స్.. తెరపైకి జీపీఆర్ టెక్నాలజీ!
కర్ణాటక దైవక్షేత్రం ధర్మస్థళ సామూహిక ఖననాల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. మొత్తం 13 పాయింట్లలో.. మిగిలిన పాయింట్లలో ఆరో రోజు సిట్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ మూడు పాయింట్లు హైవేను ఆనుకుని ఉండడం గమనార్హం. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడి(Whistleblower)ని వెంటపెట్టుకుని అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు.ధర్మస్థళలో ఇవాళ 11, 12వ ప్రాంతాల్లో మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం 8, 9, 10వ పాయింట్ల వద్ద 8 ఫీట్ల లోతులో తవ్వకాలు జరిపినా ఏం లభించలేదు. ఆదివారం రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులకు సెలవు కావడంతో తవ్వకాలు జరపలేదు. అదే సమయంలో.. ఆయా పాయింట్లలో యాంటీ నక్సల్ ఫోర్స్ (ANF)ను కాపలాగా ఉంచారు.1998 నుంచి 2004 మధ్య ప్రముఖ దైవక్షేత్రం ధర్మస్థళంలో వందలాది మృతదేహాల ఖననం జరిగిందని, బలవంతంగా తనతో ఆ మృతదేహాలను పూడ్చి పెట్టించారని ఓ వ్యక్తి ముందుకు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అతను చూపించిన చోట్లలో అధికారులు తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీ చిన్న విషయం కేసుకు కీలకంగానే మారింది.నేత్రావతి నది ఒడ్డున ఉన్న ఆరో పాయింట్లో మనిషి ఎముకలు బయటపడ్డాయి. కానీ పుర్రె మాత్రం లభించలేదు. ఫోరెన్సిక్ పరీక్షలు ద్వారా వయస్సు, లింగం, మరణ కారణం నిర్ధారణ కావాల్సి ఉంది. అదే సమయంలో.. కొన్ని స్థావరాల్లో PAN కార్డు, ATM కార్డు లభించాయి. PAN కార్డు నెలమంగళ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. అతను జాండిస్‌తో మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. అయితే.. ఏటీఎం కార్డు వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.జీపీఆర్ టెక్నాలజీతో..2003 సమయంలో కోల్‌కతాకు చెందిన అనన్య భట్ అనే మెడికో ధర్మస్థళంలో అనూహ్య రీతిలో అదృశ్యమైంది. అయితే అనన్య హత్యాచారానికి గురైందని, ప్రస్తుత తవ్వకాల్లో అవశేషాలు బయటపడే అవకాశం ఉందని ఆమె తల్లి సుజాత భట్ ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆమె దక్షిణ కన్నడ జిల్లా బెత్తంగడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉంటే.. వర్షాలు, మట్టి తడిగా ఉండటం వల్ల తవ్వకాల్లో ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ కేసులో సుజాత భట్ తరఫున ఆమె న్యాయవాది మంజునాథ్ ‘జీపీఆర్(Ground Penetrating Radar)’ టెక్నాలజీ వాడే అవకాశాన్ని పరిశీలించమని సిట్‌ను కోరుతున్నారు.జీపీఆర్ టెక్నాలజీ.. బాంబ్ డిటెక్టర్ తరహాలో ఉండే పరికరం. ఇది ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలను భూమిలోకి పంపుతుంది. అది భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి.. ఎముకలు, కేవిటీస్, తదితర మార్పులను గుర్తిస్తుంది. తద్వారా అనవసర తవ్వకాలను నియంత్రిస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు, ఆర్కియాలజీవాళ్లు ఈ సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ధర్మస్థళ కేసుకు ఇది ఎందుకు అవసరం అనే వాదనలోకి వెళ్తే.. ఈ కేసులో కీలకంగా ఉన్న పారిశుద్ధ్య మాజీ కార్మికుడు 13 పాయింట్లు చూపించాడు. అవి 2014 కంటే ముందు ప్రాంతాలని చెబుతున్నాడు. అయితే ఈ పదేళ్ల కాలంలో అక్కడ చాలా మార్పులు సంభవించాయి. భారీ వర్షం, మట్టి కొట్టుకుపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎక్కడ మానవ దేహాలను ఖననం చేశారో గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ధర్మస్థళం కేసులో జీపీఆర్ వినియోగం ఇప్పుడు కీలకంగా మారందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ డిమాండ్‌పై సిట్ ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టే ఆధారపడి ఉంటుంది. పైగా.. జీపీఆర్ ఉపయోగం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రాథమికంగానే.. రూ.10-15 లక్షలు అవుతుంది. అదే అడ్వాన్స్డ్ వ్యవస్థలు రూ.30-50 లక్షల మధ్య ఉండొచ్చు. అద్దె బేస్డ్గా కూడా వీటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే వీటి వినియోగానికి శిక్షణ తప్పనిసరి. తప్పుకున్న జడ్జిజులై 18వ తేదీన సిటీ సివిల్ కోర్టు అదనపు జడ్జి విజయ్ కుమార్ రాయ్.. ధర్మస్థళంపై వచ్చిన కథనాలకు సంబంధించిన 8,842 వెబ్ లింకులను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు నిలుపుదల చేసింది. ఈలోపు.. ఈ కేసులో 332 మంది డిఫెండెంట్స్లో 25వ వ్యక్తి నవీన్ సూరింజే ఆసక్తికరమైన వాదన తెర మీదకు తెచ్చాడు.విజయ్ కుమార్ రాయ్ గతంలో(25 ఏళ్ల కిందట) మంగుళూరులోని ఎస్డీఎం(శ్రీ ధర్మస్థళ మంజునాథేశ్వర లా కాలేజీ)లో చదివారని, ఇక్కడ పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుతో వ్యక్తిగతంగా సంబంధం లేకున్నా తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జడ్జి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘‘న్యాయం జరగాలి మాత్రమే కాదు, అది జరుగుతున్నట్లు కనిపించాలి కూడా’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.ఐటీఆర్‌తో గుట్టురట్టుధర్మస్థళ, చుట్టుపక్కల ఊర్లకు సంబంధించి 2000–2015 మధ్య అసహజ మరణాల రిజిస్టర్ (UDR), పోస్టుమార్టం నివేదికలు, ఫోటోలు ఏవీ లేకపోవడం ఇప్పుడు అక్కడ ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు.. చట్టవిరుద్ధంగా కొందరు పోలీస్ అధికారులే ఓ బాలిక మృతదేహాన్ని ఖననం చేయడం తాను కళ్లారా చూశానని అంటున్నారాయన. అయితే ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. -
‘ధర్మస్థల’ దారుణాలపై సాక్ష్యాధారాలు ధ్వంసం
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థలలో సామూహిక ఖననాల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. మహిళలపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి, మృతదేహాలను సామూహికంగా ఖననం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ధర్మస్థలలో వందకు పైగా మహిళల మృతదేహాలను స్వయంగా ఖననం చేశానని ఓ పారిశుధ్య కార్మీకుడు ప్రకటించడంతో సంచలనం రేగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ధర్మస్థలలో 2000 సంవత్సరం నుంచి 2015 వరకు.. 15 ఏళ్లలో అసహజ మరణాల రికార్డులు కనిపించకుండాపోయాయి. దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి పోలీసులు వాటిని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లు తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం(ఆరీ్టఐ) కార్యకర్త జయంత్ ఈ విషయం బహిర్గతం చేశారు. 2000 నుంచి 2015 దాకా అసహజ మరణాల రిజిస్టర్(యూడీఆర్)లో నమోదైన అన్ని ఎంట్రీలను పోలీసులు ఒక పద్ధతి ప్రకారం డిలీట్ చేసినట్లు వెల్లడయ్యింది. ధర్మస్థలలో అదే సమయంలో పెద్ద సంఖ్యలో అనుమానాస్పద, నమోదు కాని మరణాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారుల సమక్షంలోనే ఖననం ఒక యువతి మృతదేహాన్ని చట్టవిరుద్ధంగా, రహస్యంగా ఖననం చేస్తుండగా అనుకోకుండా తాను చూశానని ఆర్టీఐ కార్యకర్త జయంత్ చెప్పారు. దీనిపై ఈ నెల 2వ తేదీన సిట్‌కు ఫిర్యాదు చేశారనని వివరించారు. ఆ ఖననం జరుగుతున్న సమయంలో పలువురు అధికారులు అక్కడే ఉన్నారని, చట్టబద్ధమైన ప్రక్రియ పాటించలేదని చెప్పారు. జయంత్ ఫిర్యాదుపై సిట్ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. పోలీసుల పనితీరును తెలుసుకోవడానికి జయంత్ చాలాకాలంగా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. ధర్మస్థలలో అదృశ్యమైన మహిళలు, యువతుల పూర్తి వివరాలు, ఫోటోలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద బెళ్తంగడి పోలీసులను కోరగా, వారు అందుకు నిరాకరించారని జయంత్ చెప్పా రు. సంబంధిత డాక్యుమెంట్లు, పోస్ట్‌మార్టం రిపోర్టులు, వాల్ పోస్టర్లు, నోటీసులు, ఫోటోలను నాశనం చేసినట్లు వారు బదులిచ్చారని పేర్కొన్నారు. గుర్తించని మృతదేహాలకు సంబంధించిన ఆధారాలేవీ లేవని, రొటీన్ ప్రక్రియలో భాగంగానే వాటిని నాశనం చేశామంటూ చెప్పారని స్పష్టంచేశారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది అధికారుల సమక్షంలోనే యువతి మృతదేహాన్ని చనిపోయిన శునకాన్ని ఖననం చేసినట్టుగా చేశారని, ఆ సంఘటన చాలాకాలం తనను వెంటాడిందని జయంత్ తెలియజేశారు. ఆ అధికారుల పేర్లు కూడా చెప్పగలనని అన్నారు. ధర్మస్థలలో మరణాలపై దర్యాప్తు బాధ్యతను నిజాయతీ గల అధికారులకు అప్పగించకపోతే తనకు నిజాలు బయటపెడతానని రెండేళ్ల క్రితం హెచ్చరించానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందన్నారు. అందుకే సిట్‌కు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తన వెనుక ఎవరూ లేరని, తనను ఎవరూ ప్రభావితం చేయడం లేదని తేల్చిచెప్పారు. నేటి టెక్నాలజీ యుగంలో సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తవ్వకాల్లో అస్తిపంజరం బయటపడితే అది ఎవరిదో ఎలా గుర్తిస్తారని అన్నారు. సంబంధిత డాక్యుమెంట్లు, ఆధారాలు లేకపోతే అది ఎలా సాధ్యమవుతుందని నిలదీశారు. ధర్మస్థలలో జరిగిన దారుణాల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరన్నది బయటపడాలని స్పష్టంచేశారు. దర్యాప్తును ప్రభావితం చేస్తున్న వ్యక్తులెవరో ప్రభుత్వం తేల్చాలని అన్నారు. సాక్ష్యాధారాల ధ్వంసం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని చెప్పారు. -
ధర్మస్థల రహస్యం.. వందల శవాలను నేనే పూడ్చాను..
-
ధర్మస్థళ మిస్టరీ: ఆధారాలపై షాకిచ్చిన ఆర్టీఐ సమాధానం
ధర్మస్థళ: కర్ణాటకలోని ధర్మస్థళలో సామూహిక ఖననాల మిస్టరీ అంతకంతకూ బిగుసుకుంటోంది. వందలాది మృతదేహాలను ఖననం చేశానంటూ, ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన సంచలన వ్యాఖ్యల దరిమిలా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(ఎస్ఐటీ) ఈ ఘటనపై ముమ్మర విచారణ చేపట్టింది. తాజాగా ఈ ఉదంతంలో ఆర్టీఐ జోక్యంతో మరో మలుపు తిరిగింది.ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఈ ప్రాంతంలో ఒక యువతిని అక్రమంగా ఖననం చేశారంటూ ఫిర్యాదు చేయడంతో పాటు, ఒక కుక్కను పాతిపెట్టినట్లు ఆమె మృతదేహాన్ని ఖననం చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన ఐర్టీఐని కోరిన దరిమిలా, కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. బెల్తాంగాడి పోలీసులు 2000-2015 మధ్య చోటుచేసుకున్న అసహజ మరణ రికార్డులను తొలగించారని ఆర్టీఐ తెలుపడంతో, ధర్మస్థళ సామూహిక ఖననాలపై నెలకొన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. బెల్తాంగాడి పోలీసులు నాటి అసహజ మరణ రికార్డులను తొలగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఐ కార్యకర్త జయంత్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)కు చేసిన ఒక ఫిర్యాదులో ఒక యువతి మృతదేహాన్ని అక్రమంగా ఖననం చేసినట్లు పేర్కొన్నారు. చట్టపరమైన ప్రోటోకాల్‌లు ఉల్లంఘించారని ఆరోపించారు. ఆ సమయంలో పలువురు అధికారులు దీనికి సాక్ష్యంగా నిలిచారని కూడా ఆయన ఆరోపించారు. తన ఫిర్యాదును పరిశీలించిన సిట్ త్వరలోనే తన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభిస్తుందని భావిస్తున్నానని అన్నారు.ఆర్టీఐని ఆశ్రయించిన జయంత్ బెల్తాంగాడి పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన, వ్యక్తుల డేటా, ఫొటోలను తాను కోరినట్లు తెలిపారు. అయితే దీనికి ఆర్టీఐ నుంచి వచ్చిన సమాధానంలో.. బెల్తాంగాడి పోలీసులు నాటి పోస్ట్‌మార్టం నివేదికలు, వాల్ పోస్టర్లు, నోటీసులు గుర్తింపులేని మృతదేహాలకు సంబంధించిన ఫోటోలను సాధారణ పరిపాలనా ఉత్తర్వుల మేరకు నాశనం చేశారని వెల్లడయ్యింది. ఈ సందర్బంగా జయంత్ మీడియాతో మాట్లాడుతూ ‘ఆగస్టు 2 న నేను సిట్‌కు ఫిర్యాదు చేశాను.. ఈ ఫిర్యాదు నేను వ్యక్తిగతంగా సేకరించిన సాక్ష్యంతో ఆధారపడి వుంది. యువతి ఖననం సమయంలో హాజరైన ప్రతి ఒక్కరి పేరు నేను తెలియజేశాను. నాడు చట్టపరమైన విధానాలన్నింటినీ ఉల్లంఘించారు. వారు ఒక కుక్కను పాతిపెట్టినట్లుగా ఆ యువతి మృతదేహాన్ని ఖననం చేశారు. అందుకే నేను దీనిపై ఫిర్యాదును దాఖలు చేశాను’ అని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ధర్మస్థళ మిస్టరీ: ఆ ఏటీఎం, పాన్ కార్టులు ఎవరివంటే.. -
ధర్మస్థళ మిస్టరీ: ఆ ఏటీఎం, పాన్ కార్టులు ఎవరివంటే..
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థళలో అనుమానాస్పద మరణాల మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. ధర్మస్థళ సమీప ప్రాంతాల్లో వందలాది మృతదేహాలను ఖననం చేశానంటూ, ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు సంచలన వ్యాఖ్యలు చేసిన దరిమిలా, ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(ఎస్ఐటీ) విచారణ చేపట్టింది. ఆ పారిశుద్ధ్య కార్మికుడు సూచించిన 13 ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు చేపట్టారు. వీటిలో ఒక చోట తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ దొరికిన పాన్, ఏటీఎం కార్డులు విచారణ అధికారులకు బెంగళూరులోని ఒక ఇంటికి దారి చూపాయి.ఆ ఏటీఎం కార్డు బెంగళూరు రూరల్ ప్రాంతంలోని నేలమంగళలో నివసిస్తున్న సిదాలక్షమ్మకు చెందినదని సిట్ దర్యాప్తులో తేలింది. అయితే ఆ పాన్ కార్డు ఆమె కుమారుడు సురేష్ కు చెందినదని, మద్యానికి బానిసైన అతను గత మార్చిలో మృతిచెందాడని తేలింది. ధర్మస్థళ సందర్శన సమయంలో సురేష్ తన కార్డులు పోగొట్టుకున్నాడని, అవి నేత్రావతిలో కొట్టుకుపోయి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తన కుమారుడు తాగుడుకు బానిస అయిన కారణంగా ఇంటి నుంచి తరచూ వెళ్లగొట్టేదానినని సిదాలక్షమ్మ అధికారులకు తెలిపింది.తన కుమారుడు మూడేళ్ల పాటు కామెర్ల వ్యాధితో బాధపడ్డాడని, ఈ సమయంలో అతను ఎక్కడకూ వెళ్లలేదని, అయితే జీవనోపాధి చూసుకోవాలని తామే అతనిని ఇంటికి దూరంగా ఉంచామని సిదాలక్షమ్మ తెలిపింది. తాము ఐదేళ్ల క్రితం కుటుంబ సమేతంగా ధర్మస్థళికి వెళ్లామని, అప్పట్లో తన కుమారుడు తన ఏటీఎం వినియోగిస్తున్నాడని, నాడు ఎటీఎం, పాన్ కార్డులు పోయాయని తనకు చెప్పాడని సిదాలక్షమ్మ వివరించింది. ఈ సంగతి చెప్పగానే తాను ఏటీఎం కార్డు బ్లాక్ చేయించానన్నది. తన కుమారుడు సురేష్ చనిపోయాక ఖననం చేశామని, ఆమె తెలిపింది. మాజీ పారిశుధ్య కార్మికుడు సూచించిన 13 ప్రదేశాలలో తవ్వకాలు చేపట్టినప్పుడు అధికారులకు ఏటీఎం, పాన్ కార్డులు లభ్యమయ్యాయి. వీటి ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగుతుందని సిట్ అధికారులు గతంలో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు? -
ధర్మస్థల మరణాల మిస్టరీ.. సిట్ దర్యాప్తులో సంచలనం
-
ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు?
కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థళలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. ఆ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో వందకు పైగా మృతదేహాలను తాను ఖననం చేశానని (Mass Burial Case) ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చెప్పడం.. అతడు చూపించినట్లు 13 ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు చేపట్టారు. అయితే 6వ పాయింట్లో మానవ అస్థిపంజరాల అవశేషాలు బయటపడటంతో దర్యాప్తులో కీలక ముందడుగు పడిందని భావించారంతా. ధర్మస్థళ(Dharmasthala) కేసులో ఇవాళ ఐదో రోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రావళి నది సమీపంలోని అటవీ ప్రాంతంలో.. 9వ పాయింట్ వద్ద అధికారులు మానవ అవశేషాలు గుర్తించే పనిలో ఉన్నారు. మిగిలిన ఈ ఐదు స్పాట్లను అధికారులు కీలకంగా భావిస్తున్నారు. మరోవైపు.. ఇవాళ ప్రత్యక్ష సాక్షిని అధికారులు విచారిస్తారని సమాచారం. ఇప్పటిదాకా జరిపిన తవ్వకాల్లో కేవలం గురువారం(జులై 31వ తేదీ) ఆరో పాయింట్లో ఓ చోట కొన్ని అవశేషాలను మాత్రమే అధికారులు గుర్తించారు. ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. అవి ఇద్దరు మహిళలకు చెందినవి కావొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అయితే ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు అంటున్నారు. అయితే.. ఆరో పాయింట్ తప్ప.. ఇప్పటిదాకా అధికారులు తవ్వకాలు జరిపిన ప్రాంతాలు నదీ తీరాన్ని ఆనుకుని ఉన్నాయి. అవి వరదలతో ప్రభావితం అయ్యాయి. ఈ క్రమంలో మానవ కంకాళాలు(ఎముకలు) కొట్టుకుపోయే అవకాశాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో.. అటవీ ప్రాంతంలోని మిగతా పాయింట్ల మీద దృష్టి సారించారు. పైగా ఈ ప్రాంతాల్లోనే సామూహికంగా తాను శవాలను పాతిపెట్టానని అతను చెబుతున్నట్లు కర్ణాటకకు చెందిన కొన్ని వార్తా చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ కథనాలు ఇస్తుండడం విశేషం. దీంతో ఈ ఐదు ప్రాంతాలు ఈ కేసుకు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇదీ చదవండి: ధర్మస్థళ.. ఉష్ గప్‌చుప్!జనాలు రాకుండా.. గత సోమవారం నుంచి సిట్ అధికారులు.. అతడిని(మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని) వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. అటవీ ప్రాంతం కావడం, దానికితోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతోందని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ప్రణబ్ మొహంతి తెలిపారు. గుంతలు తవ్వేందుకు 20 మంది కార్మికులు, బుల్డోజర్ల సాయం తీసుకుంటున్నారు. ఐపీఎస్ అధికారులు అనుచేత్, జితేంద్ర కుమార్ దయామ, ఎస్పీ సైమన్, పుత్తూరు తహసీల్దారు స్టెల్లా వర్గీస్, బెళ్తంగడి తహసీల్దారు పృథ్వీ సానికం, మంగళూరు కేఎంసీ వైద్యులు, ఫోరెన్సిక్ ప్రయోగశాల నిపుణుల సమక్షంలో ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేత్రవతీ నది ఒడ్డున సిట్ తవ్వకాలు జరుపుతుండడంతో జనం ఆ ప్రాంతాల్లో బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో తవ్వకాలకు అంతరాయం కలిగే అవకాశం ఉండడంతో పోలీసులు అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే.. ఏంటీ మిస్టరీ కేసు..దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక (Karnataka) ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ ఇక్కడికి భారీగా వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు(62).. తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని.. వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్‌కు ఇటీవల ఒక లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం క్లుప్తంగా.. ‘‘గతంలో ఇక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయి. నేనే ఎన్నో శవాలను పూడ్చిపెట్టా. 1998 నుంచి 2014 మధ్య వందకు పైగా మృతదేహాలను ఖననం చేశాను. ఆ వ్యక్తులే మా కుటుంబానికి చెందిన యువతిపై అనుచితంగా ప్రవర్తించడంతో మేం దూరంగా వెళ్లిపోయాం. నన్ను పాపభీతి వెంటాడుతోంది. నాకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలను బయటపెడతా’’2014 డిసెంబరులో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండడంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని ఆ వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు. అయితే మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు? వాటిని ఎవరి సహాయంతో తీసుకువెళ్లేవారు? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికి విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద అతనికి రక్షణ కల్పించారు. మరోవైపు.. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థళ పరిసరాల్లో పలువురు మహిళలను దారుణంగా హింసించి, కడతేర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు ఆ వ్యక్తి లేఖలో పేర్కొనడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.వందల మంది మిస్సింగ్?దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థళ ఓ చిన్నగ్రామం. ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం విస్తరించింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఐదు దశాబ్దాలుగా ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ధర్మస్థళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యాసంస్థలు వెలిశాయి. దీంతో భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటిచోట తాజా ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి. గత పదేళ్లలో.. ధర్మస్థళ, బెళ్తంగడి, ఉజిరె పీఎస్‌ల పరిధిలో 450 మంది అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు. వీటిలో ఒక్క కేసునూ పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలు నోరు మెదపకుండా డబ్బుతో నోరు మూయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థి(20)ని హత్యాచారానికి గురైంది. స్థానిక మోతుబరి కుటుంబానికి చెందినవారు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు పలు ప్రజా సంఘాలతో కలిసి అప్పట్లోనే ఆందోళనలు చేశారు. తమకు అనుమానం ఉన్న కొందరు వ్యక్తులను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయంటూ బాధితురాలి తల్లి సుజాత భట్ తాజాగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇదీ చదవండి: ధర్మస్థళ కేసు.. పురుషుల మృతదేహాలు కూడా?!మీడియాకు ఊరటధర్మస్థళలో ఏం జరుగుతోందంటూ.. గత కొన్నిరోజులుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో కథనాలు మారుమోగుతున్నాయి. ఈ తరుణంలో కొందరు పెద్దలు ధర్మస్థళ పేరును చెడగొడుతున్నారంటూ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో సామూహిక ఖననాలకు సంబంధించిన వేలకొద్దీ కథనాల లింకులను తొలగించాలని, అసత్య ప్రచారం చేయవద్దని మీడియాకు సూచిస్తూ న్యాయస్థానం గాగ్ ఆర్డర్‌ను ఇచ్చింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రతినిధులు కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. కోర్టు ఆ గాగ్ ఆర్డర్‌ను కొట్టేస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. -
Dharmasthala: ధర్మస్థళ మిస్టరీ ఉత్కంఠ.. వెలుగులోకి కీలక ఆధారాలు
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు దగ్గరలోని దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ధర్మస్థళ సామూహిక ఖననం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజులుగా కొనసాగుతున్న తవ్వకాల్లో ఇవాళ మానవ అవశేషాలు బయటపడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్( స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) బృందం గత సోమవారం నుంచి తవ్వకాలు ప్రారంభించగా.. గురువారం ఆరవ స్థలంలో జరిపిన తవ్వకాల్లో మానవ అవశేషాలు (skeletal remains) వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం.1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థళలో పనిచేశానని, మహిళలు, మైనర్లతో సహా అనేక మృతదేహాలను అక్కడ ఖననం చేశానని చెప్పిన మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పడం, ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇప్పుడు కర్ణాటక ప్రజలతో ‘భీమ’ అని పిలుచుకుంటున్న పారిశుధ్య కార్మికుడు తెలిపిన 15 స్థావరాల వివరాల ఆధారంగా సిట్ ఇప్పటివరకు ఆరు ప్రదేశాల్లో తవ్వకాలు చేసింది. ఐదు ప్రదేశాల్లోనూ ఎలాంటి మానవ అవశేషాలు కనిపించలేదు. 👉ఇదీ చదవండి: ధర్మస్థళ కథేంటీ?అనూహ్యాంగా ఇవాళ నేత్రావతి నది స్నాన ఘట్టానికి అవతలి వైపు ఉన్న ఆరో ప్రాంతంలో తవ్వకాలు జరపగా మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోర్సెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. టెస్టులు నిర్వహించి మానవ అవశేషాలు ఎవరివో వెల్లడిస్తామని కర్ణాటక ప్రభుత్వం సామూహిక ఖననం కేసులో ఏర్పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. సామూహిక ఖననం కేసులో ఆధారాల్ని సేకరించేందుకు ఎస్పీ జితేంద్ర కుమార్ దయామా, పుత్తూరు అసిస్టెంట్ కమిషనర్ స్టెల్లా వర్గీస్ సహా సిట్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. డాగ్ స్క్వాడ్‌ను కూడా మోహరించారు. ఇక గురువారం మానవ అవశేషాలు దొరికిన ప్రాంతం అంతా నీరు చేరింది. భూమిలోతు తవ్వేకొద్ది నీరు బయటపడుతోంది. ఆ నీటిని క్లియర్ చేయడానికి డీజిల్ పంపును ఉపయోగిస్తున్నారు. జేసీబీను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ అధికారులతో కలసి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను జూలై 19న ఏర్పాటు చేసింది. వారు డా. ప్రణవ్ మహంతి ఐపీఎస్, ఎంఎన్ అనుచేత్ ఐపీఎస్, సౌమ్యలత ఐపీఎస్, జితేంద్ర కుమార్ దయామ ఐపీఎస్. వారికి మరో ఇరవై మంది పోలీసు సిబ్బందిని ఇచ్చింది.కాగా, కార్మికుడు చెప్పిన 15 ప్రదేశాల్లో ఎనిమిది నేత్రావతి నది ఒడ్డున, నాలుగు ప్రదేశాలు నదికి సమీపంలోని హైవే పక్కన ఉన్నాయి. 13వ స్థలం నేత్రావతిని ఆజుకురికి కలిపే రహదారిపై, మిగిలిన రెండు హైవే సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి. -
‘ధర్మస్థళ’ కేసులో దొరకని అవశేషాలు
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థళలో జరిగిన సామూహిక ఖననం కేసులో మొదటి రెండు ప్రాంతాల్లో మానవ అవశేషాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పుడు మూడవ ప్రదేశంలో తవ్వకాలు ప్రారంభించింది. 1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థళలో పనిచేశానని, మహిళలు, మైనర్లతో సహా అనేక మృతదేహాలను అక్కడ ఖననం చేశానని మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పడం, ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం తెలిసిందే. కార్మికుడు తెలిపిన 15 స్థావరాల వివరాల ఆధారంగా సిట్ ఇప్పటివరకు రెండు ప్రదేశాల్లో తవ్వకాలు చేసింది. ఆ రెండు ప్రదేశాల్లోనూ ఎలాంటి మానవ అవశేషాలు కనిపించలేదు. నేత్రావతి నది వెంబడి ఉన్న మొదటి ప్రదేశంలో మంగళవారం తవ్వకాలు నిర్వహించారు. జేసీబీని ఉపయోగించి లోతుగా తవ్వినప్పటికీ ఎలాంటి అవశేషాలు దొరకలేదు. రెండవ స్థలం కూడా అలాగే ఖాళీగా కనిపించింది. ప్రస్తుతం మూడో ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి. కార్మికుడు చెప్పిన 15 ప్రదేశాల్లో ఎనిమిది నేత్రావతి నది ఒడ్డున, నాలుగు ప్రదేశాలు నదికి సమీపంలోని హైవే పక్కన ఉన్నాయి. 13వ స్థలం నేత్రావతిని ఆజుకురికి కలిపే రహదారిపై, మిగిలిన రెండు హైవే సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి.చీఫ్ మార్పు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం: హోంమంత్రి ఈ కేసు దర్యాప్తులో సిట్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతీని మార్చే విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేయడానికి డైరెక్టర్ జనరల్ ర్యాంకుల అధికారుల జాబితాలో మొహంతీ పేరు కూడా ఉండటంతో.. మార్పు విషయమై మీడియా మంత్రిని ప్రశ్నించింది. కేంద్రంలో ఉండి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించే అవకాశం ఆయనకు ఉంటుందని, ఆయనను కొనసాగించాలా? లేదా మరొకరిని నియమించాలా? అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చట్టం, నియమాలు అనుమతిస్తే ఆయన అక్కడే కొనసాగుతారని, లేదంటే అదే హోదా కలిగిన అధికారిని నియమిస్తామని పరమేశ్వర స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తు గురించి ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు చేయను. దర్యాప్తు పూర్తయి నివేదిక అందిన తరువాత మాట్లాడతాను’అని హోంమంత్రి తెలిపారు. -
ధర్మస్థళ కేసు: 15 అనుమానిత ప్రాంతాల గుర్తింపు!
-
ధర్మస్థల హత్యల కేసులో 5 సమాధానం లేని ప్రశ్నలు
-
ధర్మస్థల కేసులో కొత్త ట్విస్ట్..!
-
‘ధర్మస్థళ’పై ఉష్ గప్‌చుప్!
ధర్మస్థళ వివాదం ముదిరి పాకాన పడుతోంది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రం ధర్మస్థళ పరిసర ప్రాంతాల్లో 20 ఏళ్ల అవధిలో తాను వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని, కొందరి బలవంతం వల్ల తాను అలా చేయాల్సి వచ్చిందని మంజునాథ దేవస్థానపు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు చేసిన ప్రకటనతో వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వివాదం కాస్తా మంగళవారం మరో మలుపు తీసుకుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ధర్మస్థళ మారణహోమం కేసుపై బెంగళూరు కోర్టు మంగళవారం గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. శ్రీ మంజునాథ ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే సోదరుడు హర్షేంద్ర కుమార్ డి. దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా న్యాయస్థానం ఈ ఆదేశాలను ఇచ్చింది.వివిధ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ధర్మస్థళ ఉదంతానికి సంబంధించి ఉన్న 8,842 లింక్‌లను తొలగించాలని కోర్టు ఆదేశించింది. మా పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలకు సంబం«ధించిన కవరేజీకి సంబంధించిన లింకులు తొలగించాలని, డీ–ఇండెక్స్ చేయాలని కోరిన హర్షేంద్ర తన పిటిషన్లో ‘ఎక్స్’, ఫేస్బుక్ పోస్టులు, థ్రెడ్లను ప్రస్తావించారు. ఈ వివాదంపై యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాల్లో ప్రచురించడం, ప్రసారం చేయడం, ఫార్వార్డ్ చేయడం, అప్లోడ్ చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.బెంగళూరులోని పదో అదనపు సిటీ సివిల్ సెషన్స్ కోర్టులో హర్షేంద్ర దాఖలు చేసిన పిటిషన్లో గ్యాగ్ ఆర్డర్‌తో పాటు జాన్ డో ఆర్డర్‌ను పొందారు. హర్షేంద్ర తన పిటిషన్లో 338 సంస్థలు, వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చారు. 4,140 యూట్యూబ్ వీడియోలు, 932 ఫేస్బుక్ పోస్ట్‌లు, 3,584 ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్‌లు, 108 న్యూస్ లింక్‌లు, 37 రెడ్డిట్ పోస్ట్‌లతో పాటు 41 ’ఎక్స్’ పోస్టులతో కలిసి 8,842 లింక్‌లను తన పిటిషన్లో పొందుపరిచారు.వీటిలో ’లెట్ మీ ఎక్స్ప్లెయిన్’ ఎపిసోడ్లు, ది న్యూస్ మినిట్‌లోని వీడియోలు ఉన్నాయి. ప్రతివాదులుగా జాబితా వార్తలు, కంటెంట్, వీడియోలు ఉంచిన థర్డ్ ఐ, ధూత, సమీర్, ది న్యూస్ మినిట్, డెక్కన్ హెరాల్డ్, ది హిందూ, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ప్రజావాణి, కన్నడ ప్రభ, హోస దిగంత, బెంగుళూరు మిర్రర్, ఉదయవాణి, దినమణి, దిన తంతి, దినకరన్, సంయుక్త కర్ణాటక, విజయవాణి, విశ్వవాణి, కేరళ, న్యూస్ కా18 తదతరాలను చేర్చారు.గ్యాగ్ ఆర్డర్ కేవలం పిటిషన్లో ప్రస్తావించిన వాటిని మాత్రమే నియంత్రించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హర్షేంద్ర జాన్ డో ఆర్డర్ కోసం న్యాయమూర్తికి విన్నవించారు. ఈ మేరకు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడంతో పిటిషన్లో పేరు లేని సంస్థలు, వ్యక్తులు, పార్టీలను ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఈ ఆదేశాల జారీ సందర్భంగా న్యాయమూర్తి విజయ కుమార్ రాయ్ ‘ప్రతి పౌరుడికి ప్రతిష్ట అనే చాలా ముఖ్యమైంది. సంస్థ, దేవాలయంపై ఆరోపణ వచ్చినప్పుడు అవి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. పరువు నష్టం కలిగించే ఒక ప్రచురణ కూడా సంస్థల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ ఉత్తర్వు తమ భావప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని, దానిని రద్దు చేయాలని కోరుతూ యూట్యూబ్ పోర్టల్ థర్డ్ ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. – శ్రీరంగం కామేష్ -
ధర్మస్థళలో ఏం జరిగింది?
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థళ. ఇప్పటి వరకు ఇది మంజునాథుడి ఆలయం నుంచి ఆధ్యాత్మిక ప్రాంతంగానే సుపరిచితం. ఈ నెల 3న ఓ న్యాయవాదితో కలిసి అక్కడి పోలీసుస్టేషన్‌కు వచ్చిన వ్యక్తి చేసిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ధర్మశాల దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన తాను దాదాపు 20 ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టానని బాంబు పేల్చాడు. హతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని, కొందరిపై అత్యాచారం జరిగినట్లు, మరికొందరిపై యాసిడ్ దాడులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని అంతా ఉలిక్కిపడేలా చేశాడు. ప్రస్తుతం మానవహక్కుల, మహిళ సంఘాలు నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.ధర్మస్థళ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి మంజునాథ స్వామి ఆలయం ఏళ్లుగా లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షిస్తోంది. ఈ ఆలయాన్ని నడిపే ట్రస్ట్ కర్ణాటకలోని అత్యంత శక్తిమంతమైన హెగ్డే కుటుంబం నేతృత్వంలో పని చేస్తుంటుంది. అత్యంత సంప్రదాయకమైన ఈ కుటుంబం కేవలం దక్షిణ కన్నడ జిల్లాలోనే కాకుండా ఆ రాష్ట్రంలోనే సామాజిక, రాజకీయంగా శక్తిమంతమైంది. అలాంటి ధర్మస్థళ దేవాలయం సూపర్వైజర్లు, నిర్వాహకులపై మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు కేసు నమోదైంది. ఇందులోని నిజానిజాలు గుర్తించే పనిలో ధర్మస్థళ పోలీసులు ఉండగా... సుజాత భట్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు విభాగం మొత్తం అప్రమత్తమైంది. ఫిర్యాదుదారుడిగా ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ‘తాను దళితుడినని, 1995 నుంచి 2014 డిసెంబర్ దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని’ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనేక కీలకాంశాలు పొందుపరిచాడు. అంతా ఉలిక్కిపడేలా చేసిన ఆ వివరాలివి....‘‘ఉద్యోగంలో చేరిన తొలినాళ్లల్లో ధర్మస్థళ ఆలయానికి సమీపంలో ఉన్న నేత్రావతి నది వద్ద విధులు నిర్వర్తించా. ఆ పరిసరాలను శుభ్రం చేసే డ్యూటీ నుంచి సూపర్వైజర్ల ఆదేశాల మేరకు హఠాత్తుగా హేయమైన, దారుణ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేసే పని చేయాల్సి వచ్చింది. పురుషులతో పాటు మహిళలు, బాలికలు, చిన్నారుల మృతదేహాలను తీసుకువెళ్లి సమీపంలో ఉన్న అడవిలోని వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టేలా సూపర్వైజర్లు ఆదేశించారు. మొదట్లో ఇవన్నీ నేత్రావతి నదితో పాటు ధర్మస్థళ ప్రాంతానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలకు సంబంధించినవి భావించా. అయితే కొన్నాళ్లకు ఆ మృతదేహాలను ఉన్న గాయాలు, ఇతర గుర్తులను చూసి అనుమానించాం. దీంతో ఆ మృతదేహాలు ఏమిటి? అంటూ ఆ బాధ్యతలు అప్పగించిన సూపర్వైజర్లను ప్రశ్నించా. పోలీసులకు చెప్పకుండా ఇలా మృతదేహాలను మాయం చేయకూడదని, అసలు విషయం చెప్పకపోతే ఆ పని చేయనని స్పష్టం చేశా. ఆగ్రహానికి గురైన వాళ్లు నన్ను తీవ్రంగా కొట్టారు. తాము చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానంటూ బెదిరించారు. ‘ముక్కలుగా నరికేస్తాం’, ’మీ మృతదేహాన్ని మిగిలిన వాటిలాగే పాతిపెడతాం’, ’మీ కుటుంబాన్ని కూడా ఉండనీయం’ అంటూ వాళ్లు భయపెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని కొనసాగించా.కొన్నిసార్లు ఆయా మృతదేహాలపై అత్యాచారం, తీవ్రమైన హింసకు సంబంధించి ఆనవాళ్లు కనిపించాయి. మహిళల మృతదేహాల్లో అనేకం వస్త్రాలు లేకుండా లో దుస్తులు లేకుండా ఉండేవి. వారి శరీరాలపై లైంగికదాడులకు సంబంధించి గుర్తులు, గాయాలు కనిపించేవి. కొన్ని మృతదేహాలకు ఏకంగా గొంతులు కోసి, తీవ్రరక్తస్రావమై ఉండేవి. 1994 నుంచి దాదాపు 20 ఏళ్ల పాటు ఎన్నో మృతదేహాలను తీసుకువెళ్లి ధర్మస్థళ చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టా. వాటిలో 2010లో పూడ్చిన బాలిక మృతదేహం స్కూల్ యూనిఫాంతో ఉంది. ఆ రోజు సూపర్వైజర్లు నన్ను నేత్రావది నది సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌కు అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రదేశానికి పంపారు. అక్కడే నాకు ఆ బాలిక మృతదేహం కనిపించింది. అప్పట్లో ఆమె వయస్సు 12 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండచ్చు. ఆమె శరీరంగా లైంగిక దాడికి సంబంధించిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి.యాసిడ్ దాడిలో ముఖం, చేతులు కాలిపోయి ఉన్న మహిళలవి, గొంతు పిసికి చంపిన పురుషుల మృతదేహాలు కూడా తీసుకువెళ్లి పాతిపెట్టి వచ్చా. నా సమక్షంలోనూ కొందరిని చంపిన సూపర్వైజర్లు ఆ శవాలను మారుమూల అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టించారు. 1998లో వారికి ఎదురు తిరగడంతో తీవ్రంగా కొట్టారు. నా ప్రాణంతో పాటు నా కుటుంబ ప్రాణాల కోసం 2014 వరకు ఈ పని చేశా. ఆ ఏడాది డిసెంబర్లో సూపర్వైజర్ల సంబంధీకుడు నా కుటుంబానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో నా ఉద్యోగంతో పాటు ధర్మస్థళ వదిలి కుటుంబంతో సహా పారిపోయా. ఇతర రాష్ట్రంలో తలదాచుకున్నా... నాకు, నా కుటుంబానికి హాని తప్పదనే భయం నిత్యం వెంటాడుతూనే ఉంది. అప్పట్లో జరిగిన దారుణాలను బయటకు చెప్పాలని ఇటీవల తిరిగి వచ్చా’’ అని పేర్కొన్నాడు.ధర్మస్థళకు వచ్చిన వెంటనే తాను అప్పట్లో ఓ శవాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్లానని పోలీసుల దృష్టికి తెచ్చాడు. అక్కడ తవ్వి కొన్నేళ్ల క్రితం పాతిపెట్టిన మృతదేహాన్ని తవ్వి తీశానంటూ కొన్ని ఫొటోలను తన ఫిర్యాదుతో జత చేసి ధర్మస్థళ పోలీసులకు అందించాడు. తనకు, తన కుటుంబానికి రక్షణ ఇవ్వాలని కోరాడు. పోలీసులు తనతో వస్తే తాను మృతదేహాలను పాతిపెట్టిన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్తాననీ పేర్కొన్నాడు. ఆ మృతదేహాలను బయటకు తీసి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేయాలని ఆశిస్తున్నానని, అలా చేస్తేనే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, తనలో ఉన అపరాధ భావం పోతుందని సదరు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చెప్పాడు. అప్పట్లో మృతదేహాలను మాయం చేయాలని ఆదేశించిన వారిలో సూపర్వైజర్లతో పాటు ఆలయ పాలకమండలి సభ్యులూ ఉన్నట్లు వివరించాడు. ప్రాణభయంతోనే వారి పేర్లు చెప్పలేదని, పలుకుబడి ఉన్న వారి నుంచి తనకు రక్షణ కావాలని కోరాడు. పోలీసుల ఆ భరోసా ఇస్తే అన్ని పేర్లు చెప్తానని అన్నాడు. ఈ ఫిర్యాదును కోర్టుకు నివేదించిన ధర్మస్థళ పోలీసులు న్యాయమూర్తి అనుమతితో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.- శ్రీరంగం కామేష్త్వరలో మరిన్ని వివరాలు..